Link copied!
Sign in / Sign up
31
Shares

కాలి పగుళ్ళ నుండి బయటపడటానికి 5 ఉత్తమ ఇంటి చిట్కాలు

మహిళలనే కాకుండా మగవారిని బాధించే విషయం కాళ్ళ పగుళ్లు. చేతులు, కాళ్ళలో తేమ శాతం తగ్గిపోయి పొడిగా మారుతూ ఉంటాయి. దీని కారణంగా కాళ్ళు చేతులు చీలడం, మంటలు పుట్టడం, కొన్నిసార్లు చీము రక్తం కూడా వస్తుండటం జరుగుతుంది. ముఖ్యంగా వీటి కారణంగా రాత్రుళ్ళు అస్సలు నిద్ర ఉండదు.  అయితే ఇక్కడ ఉన్న ఈ ఇంటి చిట్కాల ద్వారా ఈ సమస్య నుండి త్వరగా బయటపడవచ్చు.

వెజిటేబుల్ ఆయిల్

కాలి పగుళ్లను తగ్గించే ఉత్తమ గుణం వెజిటేబుల్ ఆయిల్ లో కలదు. ముందుగా రెండు స్పూన్ల వెజిటబుల్ ఆయిల్ ను తీసుకోవాలి. అంతకుముందు కాళ్ళను బాగా శుభ్రంగా కడుక్కుని తేమ లేకుండా తుడుచుకోవాలి. ఆ తర్వాత ఆయిల్ కాలి పాదాలపై అప్లై చేసి ఉతికిన సాక్స్ ధరించాలి. రాత్రంతా ఇలాగే ఉంచి ఉదయాన్నే శుభ్రం చేసుకోవడం వలన మంచి ఫలితం ఉంటుంది. మూడు రోజుల్లో వరుసగా చేస్తే మీకే మార్పు కనిపిస్తుంది.

రోజ్ వాటర్ మరియు గ్లిజరిన్

ఈ రెండు పగిలిన కాలి పాదాలకు మంచి రెమెడీగా పనిచేస్తాయి. గ్లిజరిన్ మీ పాదాలను సున్నితంగా ఉండేలా చేస్తే, రోజ్ వాటర్ లో ఉండే విటమిన్ ఎ, బి 3, సి, డి మరియు ఇ యాంటీ ఆక్సిడెంట్స్, యాంటీ ఇన్ఫ్లమేటరీగా పనిచేస్తాయి.. అందుకని ఈ రెండిటినీ సమాన భాగాలుగా తీసుకుని రాత్రి పడుకునే ముందు కాళ్ళను శుభ్రంగా చేసుకుని ఈ మిశ్రమాన్ని రాసుకోవడం వలన ఈ సమస్య నుండి బయటపడవచ్చు.

అరటిపండు

అరటిపండు తొక్కలను తీసుకుని బాగా మెత్తగా చేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని కాలి పాదాలపై రాసుకుని మర్దనా చేసుకోవాలి. ఇలా 15 నిముషాల పాటు చేసి ఆ తర్వాత చల్లని నీరు లేదా గోరు వెచ్చని నీటితో శుభ్రం చేసుకుంటే అందమైన పాదాలు మీసొంతం.

తేనె

సగం బకెట్ లో గోరువెచ్చని నీరు తీసుకుని అందులో ఒక కప్పు తేనె కలిపి పాదాలను అందులో ఉంచి మర్దనా చేసుకోవాలి. 20 నిముషాల పాటు కొద్ది రోజుల పాటు పడుకునే ముందు ఇలా చేసి ఆ తర్వాత బాగా తుడుచుకోవడం వలన పాదాలను సున్నితంగా తయారై, కాళ్ళ పగుళ్ల సమస్య ఉండదు.

ఆపిల్ సైడర్ వెనిగర్

ఒక కప్పు ఆపిల్ సైడర్ వెనిగర్ ను సగం గోరు వెచ్చని బకెట్ నీటిలో వేసి పాదాలను 20 నిముషాల పాటు ఉంచాలి. మెల్లగా మర్దనా చేస్తూ ఉండాలి. ఇలా పడుకునే ముందు చేసుకుని తడిదనం ఆరిపోయేవరకు తుడుచుకోవడం వలన పాదాల పగుళ్ళకు గుడ్ బై చెప్పవచ్చు. 

ఈ ఆర్టికల్ మీకు నచ్చినట్లయితే అందరికీ తప్పకుండా SHARE చేయగలరు.

Cover Image source : flickr

Tinystep Baby-Safe Natural Toxin-Free Floor Cleaner

Click here for the best in baby advice
What do you think?
0%
Wow!
0%
Like
0%
Not bad
0%
What?
scroll up icon