Link copied!
Sign in / Sign up
6
Shares

చాలా తక్కువ మందికి తెలిసిన ఫెటల్ (పిండం) మానిటరింగ్ గురించి క్లుప్తంగా

ఫెటల్ చెకింగ్ అంటే గర్భాన్ని చెక్ చేయడమే. లోపల ఉన్న బేబీ సక్రమంగా పెరుగుతోందా, పాప యొక్క గుండె సరిగ్గా కొట్టుకుంటోందా వంటి అనేక విషయాలు వైద్యులు పరీక్ష చేసి తెలుసుకుంటారు. దాన్నే ఫెటల్ మానిటరింగ్ అని అంటారు. ఈ పరీక్ష ద్వారా మీ బిడ్డ ప్రసవ సమయంలో వచ్చే ఒత్తిడిని తట్టుకుంటారో లేదో వైద్యులు తెలుసుకుంటారు. ఒక ఎలక్ట్రానిక్ పరికరం ద్వారా నర్సులు లేదా వైద్యులు మీబిడ్డ కదలికలను గమనిస్తారు. చాలా మంది మహిళలు ఫెటల్ మానిటర్‌ను గర్భాధారణ సమయంలో తమ శరీరానికి అమర్చుకుంటారు.

గర్భధారణ సమయంలో పూర్తిగా ఫెటల్ మానిటరింగ్ ఉంటే,

రెండు ఎలక్ట్రానిక్ దిస్క్‌లను తీసుకొని మహిళల పొత్తికడుపు దగ్గ్ర అమర్చుతారు. ఒక డిస్క్ బిడ్డ యొక్క రీడింగ్స్‌ను తీసుకుంటే మరో డిస్క్ తల్లి యొక్క పరిస్థితులను అవగాహన చేసుకుంటుంది. ట్రాన్స్‌డ్యూసర్స్ ఉండే మెషిన్‌ను తల్లి బెడ్ చుట్టూ పెట్టి అక్కడే ఒక మానిటర్‌ను సిద్ధం చేస్తారు. అప్పుడు బిడ్డ యొక్క గుండె శబ్ధాన్ని క్లియర్‌గా వినొచ్చు.

ఎలక్ట్రానిక్ మానిటరింగ్ పెట్టుకోవడం వల్ల తల్లులు కొంత ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది. కడుపు పైభాగంలో, కింది భాగంలో పరికరాన్ని ఫిక్స్ చేయడం వల్ల వారు కదలడానికి ఇబ్బందిగా ఉంటూంది.

తల్లులు టెలీమెట్రీ ద్వారా మెషిన్‌ను పొట్టకు పెట్టుకోకుండానే పరీక్ష చేసుకోవచ్చు. దానినే రిమోట్ మానిటరింగ్ అని కూడా అంటారు. దాని ద్వారా మీ బిడ్డ గుండె వేగాన్ని, కదలికలను పసిగట్టవచ్చు. కొన్ని ఆసుపత్రులలో బిడ్డ కదలికలను తెలుసుకోవడానికి సెన్సార్లు ఉపయోగిస్తారు.

అప్పుడప్పుడు గుండె శబ్ధాన్ని ఎలా తెలుసుకుంటారంటే,

వైద్యులు మీ పొట్ట మీద ఒక పరికరాన్ని పెట్టి బిడ్డ యొక్క హృదయ స్పందనను వింటారు. తల్లి పొట్ట మీద చెయ్యి పెట్టి కూడా బిడ్డ గుండె చప్పుడును వినచ్చు. ప్రసవ సమయం మొదట్లో ప్రతి 15-35 నిముషాల మధ్య వైద్యులు బిడ్డ యొక్క గుండె వేగాన్ని తీసులుంటారు. రెండవ దశలో ప్రతి 5 నిముషాలకు ఒకసారి గుండెవేగాన్ని పరిశీలించి సరైన చర్యను తీసుకుంటారు.

మొత్తానికి ఫెటల్ మానిటరింగ్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటంటే, తల్లి మరియూ బిడ్డ ప్రసవ సమయంలో క్షేమంగా ఉన్నారా లేదా అని తెలుసుకోవడానికి మరియూ తల్లి, బిడ్డకు సంబంధించిన విషయాలలో త్వరితగతిన స్పందించడానికి ఈ పరీక్షలు చేస్తారు.

Click here for the best in baby advice
What do you think?
0%
Wow!
0%
Like
0%
Not bad
0%
What?
scroll up icon