Link copied!
Sign in / Sign up
11
Shares

సిజేరియన్ జరిగిన తర్వాత త్వరగా కోలుకోవడానికి పాటించాల్సిన 5 ముఖ్యమైన విషయాలు

నార్మల్ డెలివరీ కన్నా సిజేరియన్ డెలివరీ అనేది ఆ క్షణం వరకు ప్రశాంతంగా ఉండవచ్చు, కానీ సి-సెక్షన్ జరిగిన మహిళలు ఆ తర్వాత గర్భాశయం దగ్గర నొప్పి, సిజేరియన్ కుట్ల వలన కలిగే నొప్పిని భరించడానికి చాలా ఓపిక ఉండాలి. అలాగే సిజేరియన్ ద్వారా బిడ్డకు జన్మను ఇచ్చిన మహిళలు ప్రతి విషయం పట్ల చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి. ఇక్కడ చెప్పుకునే ఈ 5 విషయాలు సి-సెక్షన్ చేయించుకున్న ప్రతి మహిళ తెలుసుకోవాలి.

శరీరాన్ని కదిలిస్తూ ఉండాలి

 ఎప్పుడు ఒకేచోట కూర్చోవడం, అలాగే పడుకుని ఉండటం అస్సలు మంచిది కాదు. సి-సెక్షన్ జరిగిన తర్వాత చాలా ధైర్యంగా మీ అంతట మీరే అడుగులు ముందుకు వేయాలి. ఏదైనా జరుగుతుందేమో అన్న భయం వీడండి. మీ ఇంట్లోనే అటు ఇటు నడవటం వలన రక్త ప్రసరణ కూడా బాగా జరుగుతుంది.
 
పాలు ఇవ్వడం మారుస్తూ ఉండాలి

మీ బిడ్డకు పాలు ఇచ్చే సమయంలో ఎప్పుడు ఒకే రొమ్ముల వైపు కాకుండా రెండు వైపులా పాలు ఇవ్వడం చేయాలి. ఎందుకంటే మీ కడుపుపై పడ్డ కుట్లు నొప్పి కలగవచ్చు మరియు రెండు వైపులా పాలు ఇవ్వడం వలన వక్షోజాలకు ఆరోగ్యకరం కూడా. ఇలా అలవాటు చేయకపోతే మీ బిడ్డ ఎప్పుడు ఒకవైపు ఇస్తేనే పాలు సేవించడం చేస్తాడు.

ఆ భాగాన్ని  శుభ్రంగా తుడుచుకోవాలి

బిడ్డకు పాలు ఇచ్చే తల్లులు, సిజేరియన్ చేయించుకున్న తల్లులు ప్రైవేట్ భాగం చుట్టూ సూక్ష్మక్రిములు చేరకుండా, రక్తస్రావం జరుగుతూ ఉంటే మంచి సబ్బుతో ఆ భాగాన్ని శుభ్రం చేసుకుని, తడిగా లేకుండా తుడుచుకోవాలి. లేకపోతే సి-సెక్షన్ కుట్లకు మరియు మీ బిడ్డకు ఇన్ఫెక్షన్స్ సోకే ప్రమాదం ఉంది.

కావాలంటే మందులు వాడవచ్చు

సిజేరియన్ నొప్పులను అంత సులువేమీ కాదు. కాకపోతే మానసికంగా మహిళలు దృఢంగా ఉండటం వలన ఆ నొప్పులను భరించగలరు. ఐతే మీకు మొదట్లో ఎక్కువ నొప్పులుగా ఉంటే డాక్టర్ సలహా మేరకు రెండు వారాలపాటు మందులు వాడవచ్చు.

బరువులు ఎత్తకండి

సిజేరియన్ ఆపరేషన్ చేయించుకున్న తర్వాత కొన్ని వారాల వరకు బరువులు ఎత్తడం చేయకూడదు. అలాగే బిడ్డను కూడా ఎత్తుకోవడం చేయకుండా మీరు పడుకున్నప్పుడు మీకు దగ్గరగా తీసుకోవడం చేయాలి. లేకపోతే కుట్లపై నొప్పి కలిగి కుట్లు విడిపోయే అవకాశం ఉంది.

భర్తతో కలవడం 

సాధారణ ప్రసవం జరిగినప్పుడు భార్యాభర్తలు మూడు నెలలపాటు ఏకాంతంగా కలవడానికి దూరంగా ఉండాలని చెబుతారు వైద్యులు. అలాగే సి- సెక్షన్ తర్వాత గర్భాశయం నొప్పి, కడుపు చుట్టూ ఉన్న కుట్లు, యోని పక్కటెముకలపై ఎక్కువ భారమే పడుతుంది కాబట్టి శృంగారం విషయంలో చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి.

ఈ ఆహారాలు బాగా తినాలి

బిడ్డకు ప్రసవం ఇవ్వడం అంటేనే తల్లి అలసిపోవడం, తన శక్తిని కోల్పోవడం జరుగుతుంది కాబట్టి మీరు మళ్ళీ మునుపటిలా ఉండాలంటే న్యూట్రియన్స్ ఎక్కువగా ఉండే ఆహారం, విటమిన్ సి, ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఎక్కువగా తీసుకోవాలి. మీరు తీసుకునే ఆహారమే మీ బిడ్డ ఆకలిని తీరుస్తుందని గుర్తించాలి.

దయచేసి ఈ విషయాలు అందరికీ తెలిసేలా SHARE చేయగలరు.  

Tinystep Baby-Safe Natural Toxin-Free Floor Cleaner

Dear Mommy,

We hope you enjoyed reading our article. Thank you for your continued love, support and trust in Tinystep. If you are new here, welcome to Tinystep!

Recently, we launched a baby-safe, natural and toxin-free floor cleaner. Recommended by moms and doctors all over India, this floor-cleaner liquid gets rid of germs and stains without adding harmful toxins to the floor. Click here to buy it and let us know if you liked it.

Stay tuned for our future product launches - we plan to launch a range of homecare products that will keep your little explorer healthy, safe and happy!

Click here for the best in baby advice
What do you think?
0%
Wow!
0%
Like
0%
Not bad
0%
What?
scroll up icon