Link copied!
Sign in / Sign up
5
Shares

సిజేరియన్ తరువాత ఇన్ఫెక్షన్ వస్తుందనడానికి 5 గుర్తులు

9నెలలు ఒక ప్రాణాన్ని తనలో మోసి, ఒక బిడ్డకు జన్మనివ్వడం కేవలం మహిళలకు మాత్రమే సాధ్యం. బిడ్డకు జన్మనిచ్చిన తరువాత బిడ్డను చాలా జాగ్రత్తగా చూసుకుంటారు. కానీ మిమ్మలి కూడా మీరు చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. ఒక వేళ మీ కాన్పు సిజేరియన్ ద్వారా జరిగుంటే, ఆ జాగ్రత్త ఇంకాస్త ఎక్కువ అవసరం.  ఎందుకంటే సిజేరియన్ తరువాత ఇన్ఫెక్షన్స్ వచ్చే అవకాశం ఉంటుంది. ఈ కింది గుర్తులు మీలో కనిపిస్తే మీకు ఇన్ఫెక్షన్ వచ్చే అవకాశం ఉంటుంది.

1. తీవ్ర జ్వరం

మీకు చాలా రోజుల పాటు తీవ్రమైన జ్వరం వస్తే అది మీకు ఇన్ఫెక్షన్ రావడానికి గుర్తు కావచ్చు. ఒకవేళ జ్వరంతో పాటు పొత్తి కడుపులో నొప్పి కలిగితే మీరు వెంటనే తప్పకుండా డాక్టర్ ను కలవాలి. ఇన్ఫెక్షన్ గురించి ముందుగానే తెలుసుకుంటే అది తీవ్రమవ్వకుండా నివారించవచ్చు.

2. కడుపు నొప్పి

సిజేరియన్ తరువాత వచ్చే కడుపు నొప్పిని ఎప్పుడు నిర్లక్ష్యం చేయకండి. అది ఇన్ఫెక్షన్ కు ఒక గుర్తు కావచ్చు. ముఖ్యంగా పొత్తి కడుపులో నొప్పి అధికంగా ఉంటే వెంటనే డాక్టర్ ను సంప్రదించాలి. అలాగే కుట్లు వేసిన చోట నొప్పిగా ఉన్నా, జిలగా ఉన్నా ఆ చోటులో రుద్దడం లాంటివి చేయద్దు.

3. రక్త స్రావం

సిజేరియన్ జరిగిన కొన్ని రోజుల వరకు రక్తం సహజంగానే వస్తుంది. కానీ ఎక్కువ రోజులు అది అలానే కొనసాగితే కొంచెం జాగ్రత్త వహించండి. అలాగే రక్తం కుళ్ళిన వాసన వస్తున్నా, అది ఇన్ఫెక్షన్ వచ్చిందండానికి ఒక గుర్తు. వెంటనే డాక్టర్ ను సంప్రదించండి.

4. చీము

మీకు సిజేరియన్ జరిగిన ప్రదేశం నుండి, చీము వస్తుందా? అయితే మీకు తప్పకుండా ఇన్ఫెక్షన్ జరిగినట్టే. ఒకవేళ చీము వాసన వస్తుంటే ఇన్ఫెక్షన్ తీవ్రమైనట్టు. ఆలస్యం చేయకుండా డాక్టర్ను కలవండి.

5. కాళ్ల వాపు

సిజేరియన్ తరువాత కాళ్ళలో వాపు రావడం ఇన్ఫెక్షన్ కి గుర్తు. అంతే కాళ్ళు వాచిపోయి వాటి మీద కోతలు ఏర్పడితే సమస్య తీవ్రమైనట్టు. అందుకే సిజేరియన్ తరువాత వచ్చే ఈ కాళ్ళ వాపును నిర్లక్ష్యం చేయకండి తప్పకుండా డాక్టర్ ను సంప్రదించండి. 

Click here for the best in baby advice
What do you think?
0%
Wow!
0%
Like
0%
Not bad
0%
What?
scroll up icon