ఈ 5 విషయాలు సిజేరియన్ జరిగిన మహిళలకు మాత్రమే అర్ధమవుతాయి!!
9 నెలలు గర్భంలో మోసిన మీ బిడ్డను, ఈ ప్రపంచంలోకి తీసుకురావడం అంత సులువైన విషయం కాదు. అదే సిజేరియన్ ద్వారా అయితే ఆ కష్టం ఇంకాస్త పెరుగుతుంది.సిజేరియన్ జరిగిన తరువాత మీకు ఎదురయ్యే అనుభవాలు కొంచెం వింతగానూ, కొత్తగాను ఉంటాయి. కొన్ని విషయాలు, అనుభవాలు సిజేరియన్ జరిగిన మీకు మాత్రమే ప్రత్యేకంగా ఉంటాయి, మీకు మాత్రమే అర్ధమవుతాయి… అలాంటి విషయాలు ఏంటో చూడండి…
1. మూత్రం వస్తూనే ఉంటాయి
సిజేరియన్ తరువాత మీకు మొదట ఎదురయ్యే అనుభవం. ఆపకుండా బాత్రూంకి వెళ్ళడం. మూత్రం చెప్పాపెట్టకుండా వచ్చేస్తుంటాయి. కానీ భయపడాల్సిన అవసరం లేదు. నిదానంగా అంతా మాములవుతుంది. సిజేరియన్ జరిగిన వాళ్ళకి ఇలా జరగడం సాధారణమే.
2. ఆపరేషన్
మీ దేహాన్ని కత్తులతో కోసి, లోపల నుంచి మీ బిడ్డను తీసి, మళ్ళి కుట్లతో మూసేస్తారు. నిజానికి సిజేరియాన్ జరగడం అంటే ఇదే కదా. ఒక్కసారి తలుచుకుంటే, ఆ భావన వళ్ళంతా గగుర్పాటును కలిగిస్తుంది కదూ..
3. స్నానం
సిజేరియన్ జరిగిన తరువాత మూడు వరాల వరకు స్నానం ఉండదు. కుట్లు తడవడం మంచిది కాదు. అందుకని ఈ బాధ తప్పదు. కానీ కుట్లు తడవకుండా శరీరాన్ని తడి గుడ్డతో తుడుచుకోవచ్చు.
4. బ్లీడింగ్
మహిళలందరికీ బ్లీడింగ్ జరగడం సహజమే. కానీ సిజేరియన్ జరిగిన మహిళలకు, జరిగే బ్లీడింగ్ చాలా ఎక్కువ. మీరు వాడే సానిటరీ పాడ్స్ కు లెక్కే ఉండదు.
5.గాటు
మన శరీరం మీద ఏదైనా దెబ్బ తగిలి, అది అలానే మచ్చల మిగిలిపోతే, బాధగానే ఉంటుంది. అలాంటిది 6-4 ఇంచుల గాటు, మీ శరీరం మీద కనిపిస్తే, ఎప్పటికి అలానే ఉండిపోతే, ఎలా ఉంటుంది. కానీ మన బిడ్డల కోసం అది తప్పదు.
6. ఇన్నర్ వేర్
సిజేరియన్ తరువాత, మీరు వాడే అండర్ వేర్ మారుతుంది. నిజం, సిజేరియన్ తరువాత టైట్ గా ఉండే అండర్ వేర్ వేసుకోడం మంచిది కాదు.
7. హాస్పిటల్
సాధారణ కాన్పు జరిగిన వాళ్ళు కోలుకోడానికి కొన్ని రోజులు చాలు. కానీ సిజేరియన్ జరిగిన వాళ్ళకి, పర్వేక్షణ అవసరం. అందువలన హాస్పిటల్ తో మీ అనుబంధం ఇంకా పెరుగుతుంది.
8. ప్రశ్నలు
అంతా సజావుగా జరిగిపోయి, బిడ్డతో ఇంటికి వచ్చాక, మీకు గంటకో ప్రశ్న లేదా సలహా వచ్చి చేరుతూనే ఉంటుంది. “ పాలు పడుతున్నాయా?”... “ఎలాంటి ఆహారం తీస్కుంటున్నావ్?”. ఇలా చుట్టు పక్కల వాళ్ళు, బంధువులు అడుగుతూనే ఉంటారు.
ఈ అనుభావులు మీకు ఎదురైతే, అందరికి తెలిసేలా తప్పకుండా SHARE చేయండి.
ఇవి కూడా చదవండి
సిజేరియన్ (C-Section) అవసరం రాకుండా సహజ ప్రసవం జరగడానికి 5 మార్గాలు