సిజేరియన్ గురించి మహిళలు ఎప్పుడు నమ్మకూడని, భయపడకూడని 5 అపోహలు
ప్రతి మహిళకు ప్రసవం అనేది ఒక కొత్త అనుభవాన్ని ఇస్తుందని చెప్పవచ్చు. వారు ప్రగ్నెన్సీ సమయంలో ఎన్నో సవాళ్ళను ఎదుర్కోవలసి వస్తుంది. వాటిలో ముఖ్యమైనది ఏంటంటే, సిజేరియన్ జరగడం. అయితే సిజేరియన్ గురించి మనకు తెలియని చాలా అపోహలు ఉన్నాయి. వాటి గురించి ఎవరూ చెప్పరు. చెప్పినా కూడా పూర్తి సమాచారం ఉండదు. సిజేరియన్ వల్ల చాలా సమస్యలు వస్తాయని కొందరు అంటే, సిజేరియన్ మంచిదే అనేవారు కూడా ఉన్నారు. అలాంటి అపోహలు-నిజాలు గురించి ఇప్పుడు తెలుసుకోవచ్చు.
సిజేరియన్‌ను మీకు మీరుగా అడగవచ్చు
మీరు పురిటి నొప్పులు భరించలేమని ఫీల్ అయినా, లేక ఈ తేదిన మాత్రమే మీకు బిడ్డ పుట్టాలని మీరు బావిస్తున్నట్లైతే మీరు సిజేరియన్ ద్వారా బిడ్డను కనవచ్చు. అయితే, ఏ డాక్టర్ అయినా సిజేరియన్ ద్వారా కనమని మిమ్మల్ని ప్రోత్సహించరు. ప్రతి డాక్టర్ సహజ ప్రసవమే మంచిదని చెప్తారు. అది ముమ్మాటికీ నిజం. తప్పనిసరి పరిస్థితులలో మాత్రమే మీరు సిజేరియన్ వెళ్ళడం మంచిది.
ఒకసారి సిజేరియన్ అయితే ఇక ఎప్పుడూ సిజేరియనే
మీరు ఒకసారి సిజేరియన్‌కు గురి అయితే, ఇక ప్రతిసారి మీరి సిజేరియన్ ద్వారానే బిడ్డను కనగలరు. అయితే సిజేరియన్ జరిగిన తర్వాత ఆరోగ్యకరమైన బిడ్డకు జన్మను ఇవ్వలేరని ఒక అపోహ ఉంది. ఇది అపద్ధం. ఎందుకంటే మీరు సిజేరియన్ తర్వాత ప్రసవించేటప్పుడు కూడా ఆరోగ్యకరమన బిడ్డకు జన్మను ఇవ్వగలరని వైద్యుల ద్వారా తెలుసుకోవచ్చు.
సిజేరియన్ మరీ అంత సేఫ్ కాదు
సహజ ప్రసవంతో పోలిస్తే సిజేరియన్‌కు వెళ్ళడం వల్ల చాలా ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉంది. అవేంటంటే, ఎక్కువగా బ్లీడ్ అవ్వడం, హార్ట్ అటాక్ రావడం, ఇతర ఇఫెక్షన్స్ రావడం వంటివి. కాబట్టి మీరు సజహ ప్రక్రియ వైపు మొగ్గు చూపడం మంచిది. ఇక తప్పనిసరి పరిస్థితుల్లో మాత్రమే, మీకుటుంభంతో మాట్లాడి నిర్ణయం తీసుకోండి.
ఇతర డాక్టర్లను సంప్రదించవచ్చు
మీరు కలిసిన మొదటి డాక్టర్ సిజేరియన్‌ను సూచిస్తే, మీరు ఎటువంటి ఇబ్బంది లేకుండా మరో డాక్టర్ వద్దకు వెళ్ళి పరీక్ష చేయించుకోవచ్చు. ఒకవేళ వారు మీకు సహజ ప్రసవాన్ని సూచిస్తే మీరు ఆవిధంగానే ముందుకు వెళ్ళవచ్చు. సెకండ్ ఒపీనియన్ తీసుకోవడం వల్ల లోపల బిడ్డ పరిస్థితి గురించి మీకు మరింత అవగాహన రావచ్చు. కాబట్టి రెండవ డాక్టర్‌ను కలవడంలో ఎటువంటి తప్పూ లేదు.
సిజేరియన్ చేయించున్న వారు పాలు ఇవ్వలేరు
సిజేరియన్ చేసుకున్నవారు పిల్లలకు పాలు పట్టించలేరనే ఒక అపోహ ఉంది. అయితే సిజేరియన్ జరిగిన మొదట్లో పాలు వచ్చే అవకాశం తక్కువగా ఉంటుంది కానీ నిదానంగా మీరు కూడా మీ పిల్లలకు పాలు ఇవ్వవచ్చు. అస్సలు రాకపోతే, సక్షన్ ద్వారా కూడా పాలు పోందవచ్చు.
సిజేరియన్ చేసుకుంటే గాయం తొందరగా మానదు
సిజేరియన్ చేసుకోవడం వల్ల గాయం తొందరగా మానదనే అపోహ ఉంది. అయితే వాస్తవానికి, మీరు క్రమం తప్పకుండా మందులు వాడుతూ, వ్యాయామం చేస్తూ ఉంటే సులభంగా గాయం మానుతుంది.
సిజేరియన్ చేసుకున్న వాళ్ళు డైట్ పాటించాలి
సిజేరియన్ చేసుకున్న వాళ్ళు డైట్ పాటించాలి అన్న వాదన వినిపిస్తూ ఉంటుంది. కానీ అది ఎంతమాత్రమూ నిజం కాదు. అయితే మీరు పిల్లలకు పాలు పట్టించాలి కాబట్టి సులభంగా జీర్ణమయ్యే ఆహారాన్న్ని మాత్రమే తీసుకోవలసి ఉంటుంది. దీన్నే కొందరు సిజేరియన్ డైట్ అని పొరబడుతుంటారు.
కాబట్టి మీరు సిజేరియన్‌కు వెళ్ళకపోవడం మంచిదని చెప్పవచ్చు. ఒకవేళ వెళ్ళవలసి వస్తే వీటి గురించి డాక్టర్‌ను అడిగి తెలుసుకోండి. వీటితో పాటూ మీ భర్త, మీ కుటుంభం యొక్క సపోర్ట్ మీకు ఉండాలి. మీరు సిజేరియన్‌కు వెళ్ళినా అతి తొందరలోనే మీరు మునుపటిలా ఆరోగ్యంగా మారవచ్చు.