సెల్ ఫోన్ వలన పిల్లాడి చేతివేళ్ళు తెగిపోయాయి, ఒక కన్ను పోయింది : తప్పు తల్లితండ్రులదే…
ఇప్పుడు టెక్నాలజీ మన జీవితాల్లో భాగమైపోయింది. ప్రతి విషయంలో టెక్నాలజీ సహాయంతోనే జీవిస్తున్నాం. ఇంకా ముఖ్యంగా మొబైల్స్, ఇవి చేతిలో లేకుండా ఒక్క క్షణం కూడా గడవటంలేదు. కానీ టెక్నాలజీ మన జీవితాన్ని ఎంత సుఖమయం చేస్తుందో, అవసరానికి మించి వాడితే అంత ప్రమాదాన్ని కలుగచేస్తుంది. అలాంటి ప్రమాదమే ఒక పిల్లవాడికి జరిగింది. వివరాలలోకి వెళ్ళితే…
అసలేం జరిగింది… ?

చైనాలో ఒక పిల్లవాడు ఎప్పుడు మొబైల్ వాడుతూ, దానికి బానిసయిపోయాడు. అందుకు తల్లి తండ్రులు ఒక కారణం. ఇద్దరు ఉద్యోగాల హడావిడిలో పడిపోయి, పిల్లవాడిని పట్టించుకునే సమయంల లేక పిల్లవాడికి వంటరిగా వదిలేసారు. పిల్లవాడు మొబైల్ అడిగితే అతి గారాభం వలన అడిగిన వెంటనే తీసిచ్చారు. దాని వలన తమ బిడ్డకు జరగబోయే ప్రమాదాన్ని గుర్తించలేకపోయారు. ఇక రోజు మనుషలకు దూరంగా మొబైల్ తోనే సమయాన్ని గడపడం మొదలు పెట్టాడు. తమకు ఎలానో సమయం లేదు కాదు కాబట్టి పిల్లవాడిని పట్టించుకోవడం తల్లితండ్రులు పూర్తిగా మానేశారు.
ఒక రోజు పిల్లవాడు మొబైల్ ఛార్జింగ్ పెట్టి అందులో గేమ్స్ ఆడుతుండగా, ఉన్నటుండి మొబైల్ పేలిపోయింది. ఇంట్లో తల్లితండ్రులు కూడా లేరు. మొబైల్ పేలిన దాటికి పిల్లవాడి చూపుడు వేలు పూర్తిగా తెగిపోయింది. కంటికి గాయం అయ్యింది. తల్లితండ్రులు వచ్చే వరకు అలానే బాధతో అల్లాడుతూ ఉండిపోయాడు. తల్లి తండ్రులు ఇంటికి రాగానే పిల్లవాడిని గమనించి హాస్పిటల్ కు తరలించినా లాభం లేకుండా పోయింది. అప్పటికే పిల్లవాడికి చేతి వేలు తెగిపోయి చాలా సేపు అవడం వలన వైద్యులు తిరిగి అతికించలేకపోయారు. కంటికి అయిన గాయం వలన కంటి చూపును పూర్తిగా కోల్పోయాడు. తల్లి తండ్రలు పడిన ఆవేదనకు అంతు లేదు. దీనికంతా కారణం అవసరానికి మించి, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోకుండా మొబైల్ వాడడం పాటు, పిల్లవాడితో గడపడానికి సమయం లేక పిల్లవాడిని సరిగా పట్టించుకోకుండా, జరగబోయే ప్రమాదాన్ని గుర్తించని తల్లితండ్రులది కూడా.
తల్లితండ్రులు ఏమి చేయాలి?

ఇది ఎక్కడో చైనాలో మాత్రమే జరిగిన విషయం కాదు, మన దేశంలో, మన రాష్ట్రాల్లో, ప్రతి ఇంట్లో జరుగుతున్న విషయమే. పిల్లలతో సమయం గడపలేక, ఆ వంటరి తనాన్ని భర్తీ చేయడానికి పిల్లలను మొబైల్స్ కు బానిసలు చేస్తున్న తల్లి తండ్రులను మనం చూస్తూనే ఉన్నాం. ఇలాంటి ప్రాణాంతకమైన ప్రమాదాలు జరగడానికి ఇవే కారణాలు. తల్లి తండ్రులుగా పిల్లలతో కొంత సమయాన్ని గడపడం మీ బాధ్యత. టెక్నాలజీ ని పరిచయం చేయండి కానీ దానికి సరైన హద్దులు గీయండి. వాడే సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు గురించి చెప్పండి. ఎప్పుడు మొబైల్స్ మాత్రమే కాకుండా పుస్తకాలు చదవడం అలవాటు చేయండి. బయటకు వెళ్ళి ఆడుకోమని చెప్పండి. ఇలాంటి ప్రమాదాలు జరగకుండా పిల్లలను రక్షించుకొండి.
