Link copied!
Sign in / Sign up
7
Shares

సిజేరియన్ ఆపరేషన్ సమయంలో జరిగే 10 ఊహించలేని సంఘటనలు

తల్లి బిడ్డను తన గర్భంలో 9 నెలలు మోస్తుంది. ప్రసవానికి సిద్దమవుతుంది. కానీ ప్రతి తల్లి కోరుకునేది తన ప్రసవం సులభంగా జరగాలని. మీరు ఎంత కోరుకున్న పరిస్థుతుల రీత్య, మీకు ఇష్టం లేకున్నా కొన్ని సార్లు, మీ ప్రసవం సిజేరియన్ ద్వారా జరగడం తప్పదు. సిజేరియన్ ఎలా జరుగుతుందో అందరికి తెలిసిందే, కానీ సిజేరియన్ సమయంలో కొన్ని సంఘటనలు జరుగుతాయని మీరు ఊహించలేరు. అవేంటో తెలుసుకుని ముందే సిద్దపడండి…

1. అవయువాలు పక్కకు జరుపుతారు

మీ గర్భసంచి, జీర్ణకోశం మరియు మూత్రాశయం వెనుక ఉంటుంది. సిజేరియన్ సమయంలో మీ గర్భ సంచిని చేరుకోడానికి, జీర్ణకోశాన్ని, మూత్రాశయాన్ని పక్కకు జరుపుతారు. గర్భ సంచిని నుండి బిడ్డను బయటకు తీసాక, అవయువాలను యదా స్థానంలో ఉంచుతారు. కొన్ని సార్లు వాటిని బయటకు తీయడం కూడా జరుగుతుంది.

2. భుజాల్లో గ్యాస్

సిజేరియన్ ఆపరేషన్ తరువాత మీ ప్రేగులు ఇంతకముందులా ప్రభావంగా పనిచేయవు. అరుగుదల సమస్యల వలన ఉదర భాగంలో గ్యాస్ ఏర్పడుతుంది. ఈ గ్యాస్ చాతి భాగం పై వత్తిడి కలగచేస్తుంది. భుజాలలో నొప్పిని కలిగిస్తుంది.

3. వెన్నులోకి ఇంజక్షన్

సిజేరియన్ ఆపరేషన్ సమయంలో మత్తు మందు ఇస్తారు. ఈ పద్దతిని ఎపిడ్యూరల్ అంటారు. వెన్నులోకి ఇంజక్షన్ ద్వారా అనేస్తేషియా ను ఇంజెక్ట్ చేస్తారు, మీ శరీర కింద భాగం మత్తులో ఉంటుంది.

4. వాంతులు

 

ఇది సిజేరియన్ సమయంలో చాలా సహజంగా జరుగుతుంది. అందుకే ఆపరేషన్ జరిగేయ్ కొన్ని గంటల ముందు ఆహరం తీసుకోవాలి, ద్రవాలను తీసుకోవడం మంచిది. అనేస్తేషియా వలన కడుపులో వికారం కలుగుతుంది, వాంతులు అవుతాయి.

5. చలి

మీకు సిజేరియన్ ఆపరేషన్ జరుగుతున్న సమయంలో మీకు చాలా చలిగా అనిపించచ్చు. దీనికి ఆపరేషన్ థియేటర్లోని ఏసి అని అనుకుంటాం. కానీ కాదు. చలి గా అనిపించడం కేవలం మీ భావం మాత్రమే. అనేస్తేషియా వలన మీ నదులు మొద్దుబారిపోతాయి. దీని కారణంగా మీకు చాలా చలిగా ఉన్నట్టు అనిపిస్తుంది.

6. చమటలు

సిజేరియన్ జరిగే సమయంలో చలిగా ఉంటే, పూర్తయ్యాక విపరీతంగా చమటలు పుడుతాయి. దీనికి కారణం సర్జరీ జరిగిన తరువాత విడుదలయ్యే హార్మోన్స్. అవి మీ శరీరంలో ఉష్ణోగ్రత పెంచి, చమటలను కలిగిస్తాయి.

7. మైకం

ఎపిడ్యూరల్ చాలా శక్తివంతం అయినది. సహజంగా మీ శరీర కింద భాగానికి నొప్పి తెలియకుండా మథు కలగడానికి అనేస్తేషియా ఎపిడ్యూరల్ ద్వారా ఇస్తారు. కానీ కొన్ని సార్లు కేవలం కింద శరీర భాగం మాత్రమే కాకుండా, శరీరం మొత్తానికిమాతు కలిగి మీరు పూర్తి మైకంలో ఉండచ్చు.

8. లాగడం

సిజేరియన్ సమయంలో మీరు అనేస్తేషియాలో ఉంటారు కాబట్టి, మీ కడుపు పై కొత్త పెట్టడం మీకు తెలియదు.  కానీ బిడ్డను కడుపులో నుండి బయటకు తీస్తున్నప్పుడు, కడుపులోనుండి ఏదో లాగేస్తున్నట్టు మీకు అనిపిస్తుంది. 

9. షేవ్ చేస్తారు

మీకు సిజేరియన్ జరిగే సమయంలో, మీ యోని ప్రాంతాన్ని, మిగతా శరీర భాగాల పై వెంట్రుకలను షేవ్ చేస్తారు. ఆపరేషన్ సమయంలో వాటి వలన ఏ ఇబ్బంది కలగకుండా ఉండడానికి ఇలా చేస్తారు.

10. చేతులు కట్టేస్తారు

ఇలా అందరి విషయంలో జరగదు. ఆపరేషన్ సమయంలో మీరు పూర్తి మైకంలో ఉంటారు. ఆ సమయంలో మీ చేతులు మీ అధీనంలో లేకుండా కదుపుతూ ఉంటారు. అది మరి ఎక్కువగా జరిగితే ఆపరేషన్ కు ఆటంకం కలగవచ్చు. అందుకే చేతులను స్ట్రాప్ చేస్తారు. 

Click here for the best in baby advice
What do you think?
0%
Wow!
0%
Like
0%
Not bad
0%
What?
scroll up icon