Link copied!
Sign in / Sign up
38
Shares

‘జీడిపప్పు హల్వా’ ను టేస్టీగా 10 నిముషాలలో తయారు చేసుకునే విధానం స్టెప్ బై స్టెప్ ఎలాగో మీరూ తెలుసుకోండి..

మెత్త మెత్తగా కమ్మగా జారిపోతూ తియ్యగా ఉండే హల్వా తినడం అంటే ప్రతి ఒక్కరికీ ఇష్టమే. అయితే హల్వా తయారు చేసుకోవడం చాలా  కష్టమని అనుకుంటారు చాలామంది. కానీ, ఇక్కడ చెప్పుకునే విధానాన్ని మీరు ఫాలో ఐతే చాలు సులభంగా ఈ జీడిపప్పు హల్వాను తయారు చేసుకోవచ్చు. మరి ఎలాగో చూసేద్దామా..

జీడిపప్పు హల్వాకు కావలసిన పదార్థాలు :

మిల్క్ - 1 లీటర్

చక్కర - 200 గ్రాములు

జీడిపప్పు -150 గ్రాములు

యాలకలు -4

కలర్ పౌడర్ లేదా మిఠాయి రంగు పొడి -ఒక స్పూన్

జీడిపప్పు హల్వా తయారీ విధానం :

1. ఒక పాత్రలో మంచి నీరు తీసుకుని అందులో జీడిపప్పు వేసి దాదాపు ఒక గంటపాటు నానబెట్టుకోవాలి. ఆ తర్వాత నీటి నుండి బయటకు తీసి మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. మిక్సీ పట్టుకున్న ఈ ముద్దను ఒక గిన్నెలోకి తీసుకుని పక్కన పెట్టుకోవాలి.

2. ఆ తర్వాత ఒక బౌల్ లో పాలు వేసి బాగా వేడి చేయాలి. పాలు మరుగుతున్న సమయంలోనే అందులో మిక్సీ పట్టుకున్న  జీడిపప్పును పాలలో వేసి కలుపుకోవాలి. జీడిపప్పుతో పాటు చక్కర వేసి మిక్స్ చేసుకోవాలి.

3. బాగా మరిగిన తర్వాత అందులో యాలకల పొడిని మరియు కలర్ పౌడర్ (హల్వా కలర్ పౌడర్ అంటే షాపులలో ఇస్తారు) వేసి మిక్స్ చేయాలి. దీంతో మీకు ఇష్టమైన జీడిపప్పు హల్వా తయారైనట్లు. ఈ హల్వాను వేడిగా ఉన్నప్పుడే చిన్న చిన్న ముక్కలుగా చేసుకుంటే చూడటానికి అందంగా కనిపిస్తాయి.

మరి ఇంకెందుకు ఆలస్యం వెంటనే జీడిపప్పు హల్వాను చేసేయండి. మీ ఇంటిల్లిపాదికీ వడ్డించండి. ఈ తయారీ విధానం మీకు నచ్చితే SHARE చేయండి. ఇంకా ఏవైనా వంటకాల గురించి తెలుసుకోవాలనుకుంటే మీ COMMENT తెలపండి. 

Tinystep Baby-Safe Natural Toxin-Free Floor Cleaner

Click here for the best in baby advice
What do you think?
0%
Wow!
0%
Like
0%
Not bad
0%
What?
scroll up icon