Link copied!
Sign in / Sign up
0
Shares

క్యాన్సర్ తో బాధపడుతున్న చిన్నారి ప్రాణాలను కాపాడి ఆ కుటుంబంలో వెలుగులు నింపిన మహేష్

తమ అభిమానులు ఇబ్బందుల్లో ఉంటే, ఏదైనా విపత్తు జరిగినప్పుడు, పిల్లలు అనారోగ్యంగా తమ అభిమాన నటీనటులను కలవాలని అనుకుంటున్నారు అని తెలిస్తే చాలు వారికోసం ఏమి చేయడానికైనా సరే సిద్ధంగా ఉంటారు మన అభిమాన హీరోలు. అటువంటి వారిలో మన స్టార్ మహేష్ బాబు ఒకరు. ఇప్పటికే పలు సేవా కార్యక్రమాల ద్వారా తనకు చేతనైన సాయం చేస్తున్న మహేష్ బాబు, తాజాగా ఈ అబ్బాయి ప్రాణాలను కాపాడి ఆ కుటుంబంలో సంతోషం నింపాడు.

క్యాన్సర్ తో బాధపడుతున్నాడు అని తెలిసి..

ఈ చిత్రంలో కంటి అద్దాలు పెట్టుకున్న అబ్బాయి పేరు తనీష్. ప్రాణాంతక క్యాన్సర్ వ్యాధితో కొన్ని నెలల నుండి కొన్ని రోజుల దాకా బాధపడుతూ ఉండేవాడు. ఈ వ్యాధిని నయం చేయించడానికి ఆ తల్లితండ్రుల వద్ద తగినంత డబ్బు లేదు. ఏం చేయాలో తెలియలేదు. ఎప్పుడు పిల్లల చిరునవ్వును కోరుకునే తమ అభిమాన హీరో మహేష్ బాబును కలిసి తమ అబ్బాయి సమస్య చెప్పాలనుకున్నారు. తనీష్ ఆరోగ్య పరిస్థితి గురించి మహేష్ బాబుకు తెలియడంతో భారీ మొత్తంలో సమయానికి ఆర్థికసాయం చేసి ఈ కుర్రాడి పాలిట దేవుడయ్యాడు.

మహేష్ ను కలిసిన తనీష్ కుటుంబం

క్యాన్సర్ తో బాధపడుతున్న చిన్నారిని బ్రతికించడానికి సమయానికి భారీ మొత్తంలో ఆర్ధికసాయం చేసిన మహేష్  బాబుకు కృతఙ్ఞతలు తెలిపేందుకు,  ఆపరేషన్ జరిగి తమ బిడ్డ ఆరోగ్యంగా ఉన్నాడు అని తెలిసిన తర్వాత మహేష్ బాబును ఆ కుటుంబ సభ్యులు వెళ్లి కలిశారు. తమ బిడ్డ ప్రాణాలు కాపాడి, తమతో సమయాన్ని మహేష్ బాబుకు థ్యాంక్స్ చెప్పారు. తమను ఆరాధించే ఒక వ్యక్తి సమయానికి ప్రాణాలు కాపాడాడు, నిజంగా ఇంతకంటే ఏం కావాలి.

డబ్బులు సంపాదించడం గొప్పకాదు, కానీ ఆ డబ్బుని నలుగురికి ఉపయోగపడేలా, సమయానికి నేనున్నాను అంటూ ఆదుకోవడమే కదా మంచితనం, గొప్పదనం. ఏమంటారు ఫ్రెండ్స్. మహేష్ బాబు చేసిన ఈ గొప్పపని మీకు నచ్చితే అందరికీ SHARE చేయండి..

Click here for the best in baby advice
What do you think?
0%
Wow!
0%
Like
0%
Not bad
0%
What?
scroll up icon