Link copied!
Sign in / Sign up
5
Shares

C-సెక్షన్ తర్వాత బెల్లీ ఫ్యాట్ తగ్గడానికి ఇంటి చిట్కాలు

బిడ్డకు సహజంగా జన్మను ఇచ్చిన తర్వాత లేదా సిజేరియన్ తర్వాత మహిళల శరీరంలో కొన్ని మార్పులు జరగడం సహజమే. అందులో ఎక్కువ బరువు పెరగడం, నడుం మరియు ఉదర భాగాలలో ఫ్యాట్ ఎక్కువగా చేరుతుంటుంది. అయితే ఇక్కడ చెప్పుకునే ఈ సింపుల్ టిప్స్ ఫాలో అవడం వలన మహిళలు సి-సెక్షన్ తర్వాత వచ్చే బెల్లీ ఫ్యాట్ ను తగ్గించుకోవచ్చు.

బిడ్డకు పాలు ఇవ్వడం

బెల్లీ ఫ్యాట్ నుండి త్వరగా బయటపడవచ్చు లావు తగ్గవచ్చు అనేది అంత సింపుల్ విషయమేకాదు. అయితే బిడ్డకు ఆరు నెలల పాటు తప్పకుండా తల్లి పాలను పట్టించడం వలన బెల్లీ ఫ్యాట్ ను తగ్గించుకోవడానికి సహజమైన మార్గాలలో ఉత్తమమైనదిగా చెప్పుకోవచ్చు.

పొట్ట చుట్టూ బెల్ట్

సి-సెక్షన్ తర్వాత పొట్ట చుట్టూ కొవ్వు చేరకుండా మరియు ఉదరభాగం సాగకుండా ఉండటానికి ప్రస్తుతం మార్కెట్ లో బెల్లీ ఫ్యాట్ ను తగ్గించే బెల్లీ బెల్ట్ లభ్యమవుతున్నాయి కాబట్టి వాటిని ఉపయీగించుకోవచ్చు. ఐతే ఆహారం తీసుకునేటప్పుడు, నిద్ర సమయంలో వీటిని తీసివేయడం చేయాలి.

ఆహారం

సి-సెక్షన్ జరిగిన తర్వాత కడుపుభాగంలో కుట్లు ఉంటాయి కాబట్టి తీసుకునే ఆహారంలో చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి. కార్బోహైడ్రేట్స్ మరియు ద్రవ పదార్థాలను ఎక్కువగా తీసుకోవడం చేయాలి. ముఖ్యంగా జీర్ణప్రక్రియకు సులువుగా అనిపించే ఫుడ్స్ తీసుకోవడం చేయాలి. త్వరగా జీర్ణంకాని ఆహార పదార్థాలు, మసాలా ఫుడ్స్ కు దూరంగా ఉండటం మంచిది.

నీరు ఎక్కువగా తీసుకోవడం

రోజులో కనీసం రెండు లేదా మూడు లీటర్ల నీటిని తీసుకోవడం వలన బెల్లీ ఫ్యాట్ సమస్య ఉండదు. నీరు ఆరోగ్యానికి మంచిదేనని ప్రతి విషయంలోనూ మనం చెప్పుకుంటున్నదే కాబట్టి నీటిని బాగా తీసుకోవాలి.

వ్యాయామాలు

సి-సెక్షన్ జరిగిన తర్వాత బెల్లీ ఫ్యాట్ రావడం, శరీరంలో మార్పులు జరుగుతూ ఉంటాయి కాబట్టి బెల్లీ ఫ్యాట్ తగ్గించుకోవడానికి వ్యాయామాలు, ఆసనాలు ఉత్తమమే. అయితే వెంటనే మరీ ఎక్కువగా శరీరాన్ని ఇబ్బంది పెట్టేలా త్వరగా బరువు తగ్గాలి అనేవిధంగా చేయకుండా చిన్న చిన్న ఆసనాలు వేయడం, శరీరానికి ఇబ్బంది కలగకుండా ఎక్సర్ సైజెస్ చేసుకుంటే మునుపటిలాగే ఉండవచ్చు.

దుస్తులు

కొంతమంది హీరోయిన్స్ తల్లి అయిన తర్వాత చాలా త్వరగా స్లిమ్ అవుతూ ఉంటారు. వారిలాగే అవ్వడానికి కొంతమంది ప్రయత్నిస్తూ ఉంటారు. అది ఎంతమాత్రం మంచి పధ్ధతి కాదు. వారంటే నిపుణల సలహా మేరకు దగ్గరుండి మరీ ప్రణాళిక చేసుకుంటారు. కానీ ఇది అందరివల్లా అయ్యే పనికాదు కదా. అలాగే ధరించే దుస్తుల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. బిగుతైన దుస్తులు ధరించకుండా శరీరానికి అనుకూలంగా ఉండే దుస్తులు ధరించాలి.

ఈ ఆర్టికల్ అందరికీ ఉపయోగపడుతుంది అని మీకు అనిపిస్తే వెంటనే LIKE చేయండి SHARE చేయండి. మరిన్ని విషయాలు తెలుసుకోవాలన్నా, ఈ ఆర్టికల్ పై మీరు COMMENT చేయవచ్చు.

ఇవి కూడా చదవండి.

ప్రెగ్నన్సీ సమయంలో సెక్స్ గురించి ఈ 5 విషయాలు తప్పక తెలుసుకోండి

Click here for the best in baby advice
What do you think?
0%
Wow!
0%
Like
0%
Not bad
0%
What?
scroll up icon