Link copied!
Sign in / Sign up
7
Shares

సి-సెక్షన్ సమయంలో మత్తు కోసం ఇచ్చే ‘ఎపిడ్యూరల్’ ఎలా ఇస్తారు? ఎందుకు ఇస్తారు?

డెలివరీ గురించి చాలా మంది మహిళలకు అనేక అనుమానాలు, భయాలు ఉంటాయి. ముఖ్యంగా ప్రసవ సమయంలో కలిగే నొప్పి గురించి ఆందోళన చెందుతుంటారు. సహజంగా ఏదైనా సర్జరీలు జరుగుతున్న సమయంలో నొప్పి తెలియకుండా ఉండడానికి అనేస్తేషియా ఇస్తుంటారు. కానీ మహిళలకు డెలివరీ సమయంలో అనేస్తేషియా ఇవ్వడం వలన బిడ్డకు ప్రమాదం ఉంటుంది. అందుకే శరీరం మొత్తం కాకుండా కేవలం కింద భాగం వరకు నొప్పి తెలియకుండా మత్తు ఉండడానికి,  స్పైనల్ అనేస్తేషియా లేదా ఎపిడ్యూరల్ ఇస్తారు.

ఎపిడ్యూరల్ అంటే ఏంటి?

ప్రసవసమయంలో నొప్పి ని తగ్గించడానికి ఎపిడ్యూరల్ అనేస్తేషియా ఇస్తారు. వెన్నెముకకు, వెన్నులోని ద్రవానికి మధ్య, ఇంజెక్షన్ ద్వారా అనేస్తేషియా ఇస్తారు. ముందుగా ఇంజెక్షన్ చేయాల్సిన ప్రాంతంలో మత్తు ఇచ్చి, ఇంజక్షన్ ద్వారా వెన్నులోకి అనేస్తేషియాను ఇంజెక్ట్ చేస్తారు.  ఎపిడ్యూరల్ పూర్తిగా శరీరాన్ని మొద్దుపరచదు. నొప్పిని మాత్రం తగ్గిస్తుంది.

స్పైనల్ అనేస్తేషియా అంటే ఏంటి?

స్పైనల్ అనేస్తేషియాలో అనేస్తేషియాను నేరుగా వెన్నులోకి ఇంజెక్ట్ చేస్తారు. ఇది వెంటనే ప్రభావం చూపిస్తుంది. స్పైనల్ అనేస్తేషియా శరీరం మీద చాలా బలంగా ప్రభావం చూపిస్తుంది. శరీర కింద భాగం మొత్తం చలనం ఉండదు.

 

ఈ అనేస్తేషియాలు కేవలం సిజేరియన్ సమయంలో  మాత్రమే కాకుండా, సహజ కాన్పులో కూడా కొన్ని సార్లు నొప్పిని తగ్గించడానికి ఇస్తారు.  అనేస్తేషియా వలన సర్జరీ సమయంలో వాంతులవుతాయి, అందుకే అనేస్తేషియా ఇచ్చే కొన్ని గంటల ముందు ఆహరం తీసుకోవడం మంచిది.

Click here for the best in baby advice
What do you think?
0%
Wow!
0%
Like
0%
Not bad
0%
What?
scroll up icon