Link copied!
Sign in / Sign up
51
Shares

ఆపరేషన్ థియేటర్ లో సిజేరియన్ ఇలా జరుగుతుంది : పూర్తి వివరంగా చిత్రాలతో సహా.....


సిజేరియన్ సర్జరీ చుట్టూ, ఎన్నో భయాలు, అనుమానాలు, ప్రశ్నలు. సిజేరియన్ జరగడానికి దారి తీసే పరిస్థితులు, జరిగిన తరువాత తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి, చాలా సార్లు తెలుసుకున్నాం. కానీ అసలు ఆపరేషన్ థియేటర్లో, సి-సెక్షన్ ఎలా జరుగుతుంది? ఎప్పుడైనా చూసారా? మీకోసం మేము అందిస్తున్నాం. గుండె ధైర్యం చేసుకొని చూడండి…

1. సి-సెక్షన్ సర్జరీ ఇలా మొదలవుతుంది

అనేస్తేషియా(anesthesia) ఇచ్చి, అది ప్రభావం చూపించిన తరువాత. ఈ చిత్రంలో చూపించిన విధంగా, పొత్తి కడుపు మీద, గాటు పెడుతారు.

2. పొరలను కోస్తూ పోతారు

పొత్తి కడుపు మీద గాటు చేసిన తరువాత, మిగతా పొరలను మెల్లగా కోస్తారు. ఆ ప్రక్రియను ఈ చిత్రంలో చూడచ్చు.

3. అమ్నియోటిక్ ద్రవాలను తొలిగిస్తారు

అన్ని పొరలను కోస్తూ గర్బాశయం చేరుకుంటారు. తరువాత గర్భాశయంలో ఉండే, అమ్నియోటిక్ ద్రవాలను, సుక్క్షన్ ద్వారా తొలిగిస్తారు. అది ఎలా జరుగుతుందో ఇక్కడ చూడండి.

4. శిశువు తల బయటకు వస్తుంది

గర్భాశయంలోంచి అమ్నియోటిక్ ద్రవాలు తొలిగించిన తరువాత. శిశువును గర్భంనుంచి బయటకు తీయడం ప్రారంభిస్తారు. ఈ చిత్రం లో ఉన్నట్టు మొదట తల భాగం బయటకు తీస్తారు.

5. శిశువును భుజాల వరకు బయటకు తీస్తారు

ఈ చిత్రంలో ఉన్నట్టు ,తల భాగం తరువాత, మెల్లగా భుజాల వరకు బయటకు తీస్తారు.

6. శిశువును పూర్తిగా బయటకు తీస్తారు

ఈ చివరి స్టెప్ లో , శిశువు పూర్తి శరీరాన్ని బయటకు తీస్తారు. అది ఎలా జరుగుతుందో ఈ చిత్రంలో చూడచ్చు. 

Click here for the best in baby advice
What do you think?
33%
Wow!
67%
Like
0%
Not bad
0%
What?
scroll up icon