Link copied!
Sign in / Sign up
0
Shares

బ్రెస్ట్ ఫీడింగ్ గురించి సినీ నటి లిసా హెడాన్ ఇచ్చిన అద్భుతమైన సందేశం


రామ్ చరణ్ కథానాయకుడిగా నటించిన రచ్చ సినిమాలో ఒక పాటలో తళుక్కుమని మెరిసిన ఈ నటి తరువాత బాలీవుడ్ వెళ్ళి మంచి పేరు సంపాదించుకున్నది. ఆమె మే 17, 2017 లో ఒక మెగా బిడ్డకు జన్మనిచ్చింది. ఆ పిల్లాడికి జాక్ అని పేరు పెట్టి అతని ఫొటోలను ఇంస్టాగ్రామ్ ద్వారా తన ఫాలోవర్లకు షేర్ చేసేది. అలానే నిన్న జాక్ కి పాలు పట్టిస్తున్న ఒక ఫోటో పెట్టి ప్రజలందరికి అద్భుతమైన సందేశం ఇచ్చింది.

ఆమె తన ఇంతగ్రామ్ లో ఇలా పోస్ట్ చేసింది. “అందరు పెళ్లిళ్లు పుట్టిన తరువాత జీవితం ఎలా ఉంది అని ప్రశ్నలు అడుగుతున్నారు. కానీ వాటికి జవాబు ఇవ్వడాం మర్చిపోయాను, కానీ ఇది బ్రెస్ట్ ఫీడింగ్ వీక్ అని తెలిసి తల్లి అయినా తరువాత ఫిట్నెస్ గురించి మరియు తల్లి పాలు ఇవ్వడం గురించి మీతో పంచుకోవాలనిపించింది. నిజానికి తల్లి అయిన తరువాత తిరిగి మళ్ళీ మంచి శరీరాకృతి పొందడానికి బ్రెస్ట్ ఫీడింగ్ ఎంతగానో ఉపయోగపడింది. బ్రెస్ట్ ఫీడింగ్ అనేది టైం తీసుకునే పనే కానీ, దీనికంటే మంచి వ్యాయామం మరియు బిడ్డతో బంధం పెంచుకోవడానికి మరో మార్గం లేదు. బ్రెస్ట్ ఫీడింగ్ గురించి మరిన్ని వివరాల కోసం నా బ్లాగ్ mycityforkids.com ని చూడండి. హ్యాపీ బ్రెస్ట్ ఫీడింగ్ వీక్" అని చెప్పి ముగించింది.

ఎంత బాగా చెప్పింది కదా. నిజంగానే, తల్లి పాలు ఇవ్వడం బిడ్డకే కాదు తల్లికి కూడా మంచిదని పరిశోధనల్లో కూడా తేలింది. కావున ఎటువంటి అపోహలు నమ్మకుండా మీ పిల్లలకు తల్లి పాలు ఇవ్వండి. 

Click here for the best in baby advice
What do you think?
0%
Wow!
0%
Like
0%
Not bad
0%
What?
scroll up icon