Link copied!
Sign in / Sign up
4
Shares

బ్రెస్ట్ నొప్పిని తగ్గించడానికి 5 సులభమైన మార్గాలు

పాలు ఇచ్చే తల్లులకు రొమ్ముకు సంబంధించి చాలా ఇబ్బందులు ఉంటాయి. ఎక్కువగా పాలు తాగడం వలన వాచి ఉండటం, నొప్పిగా ఉండటం వంటివి జరుగుతాయి. అంతేకాక, అక్కడ ఇంఫెక్షన్ వచ్చే అవకాశం కూడా ఉంది. ఈ సమస్యలను అధికమించడానికి కొన్ని మార్గాలు ఉన్నాయి. అవేంటంటే,

1.బిడ్డ పాలు తీసుకోవడానికి ఇబ్బంది పడటం

చాలా మంది పిల్లలకు పాలు ఎలా తాగాలో తెలియకపోవడం వల్ల ఆ ప్రభావం తల్లి మీద పడుతుంది. దీంతో నిపుల్స్ దగ్గర ఉండే చర్మం చాలా పొడిగా అయిపోయి నొప్పి వచ్చే అవకాశం ఉంది. కాబట్టి, పాలు ఎలా తాగాలో పిల్లలకే వదిలేయండి. వారికి అనుకూలంగా మారేవరకు వదిలేయడం వల్ల వారు సులభంగా పాలు తాగుతారు.

2.ఇన్ఫెక్షన్స్ అప్పుడు వద్దు 

పిల్లలకు ఇన్ఫెక్షన్స్ వస్తే వారు పాలు తాగడం వలన మీకు కూడా వచ్చే అవకాశం ఉంది. కాబట్టి మీకు ఏదైనా అసౌకర్యం కలిగితే వెంటనే డాక్టర్‌ను కలవండి. అయితే, అక్కడ ఎటువంటి క్రీమ్స్ రాయకపోవడం మంచిది. మీ నిపుల్స్‌ను ఎప్పుడూ గమనిస్తూ ఉండండి. ఏదైనా పెద్ద మార్పు కనిపిస్తే వైద్యున్ని కలవండి.

3.మాయిశ్చరైజర్

పిల్లలు పాలు తాగే చోట మాయిశ్చరైజ్ చేయడం మంచిది. దీని వలన అక్కడ తేమగా ఉండి చర్మం ఎటువంటి  డ్యామేజ్ కాకుండా ఉంటుంది. మాయిశ్చరైజర్ కోసం వైద్యుని సలహా తీసుకోవచ్చు. దీనితో పాటూ బిడ్డ చర్మానికి హాని కలగని మాయిశ్చరైజర్ వాడటం మంచిది.

4.గాలి అందించండి

మీ బ్రెస్ట్‌కు ఎక్కువగా గాలి అందేలా చూడండి. అక్కడ ఉండే చర్మానికి బయట గాలి తగలడం వలన ఇంఫెక్షన్ వచ్చే ప్రమాదం చాలా వరకు తగ్గుతుంది. అక్కడ ఉండే చర్మం శ్వాస తీసుకున్నట్లు కూడా ఉంటుంది. దీనినే బ్రెస్ట్ రిలాక్స్ అని కూడా అంటారు.

5.బట్టలు మార్చాలి

మీరు వేసుకున్న బట్టల వలన కూడా మీ బ్రెస్ట్ నొప్పికి గురయ్యే అవకాశం ఉంది.  మీరు ఎక్కువ హార్డ్ ఉండే దుస్తులు ధరించడం వల్ల ఆ ప్రభావం మీ బ్రెస్ట్ మీద పడే అవకాశం ఉంది. కాబట్టి సున్నితమైన బట్టలే వాడటం చాలా మంచిది. పాలు ఉత్పత్తి అయ్యే సమయంలో అక్కడ ఉండే చర్మం చాలా సున్నితంగా తయారవుతుంది కాబట్టి మెత్తటి వస్త్రాలు ధరించడం వల్ల నొప్పి రాకుండా చేయవచ్చు!

Click here for the best in baby advice
What do you think?
0%
Wow!
0%
Like
0%
Not bad
0%
What?
scroll up icon