Link copied!
Sign in / Sign up
0
Shares

బ్రెస్ట్ ఫీడింగ్ వలన వక్షోజాలు జారిపోతాయా?

వక్షోజాలు జారిపోవడానికి ముఖ్యకారణం బ్రెస్ట్ ఫీడింగ్ అని అనుకుంటారు, కానీ అది ఒకటే కారణం కాదు, ముఖ్య కారణం అంతకంటే కాదు. నిజానికి స్థనాలు జారడానికి జీవ సంబంధిత లేదా అనేక ఇతర కారణాలు ఉన్నాయి.

1. మీరు ఎన్ని సార్లు గర్భవతిగా ఉన్నారు

మీకు ఎక్కువ మంది పిల్లలు ఉంటె, మీ రొమ్ములు మరింత విస్తరించి ఉంటాయి.

2. గర్భం దాల్చక ముందు మీ రొమ్ముల యొక్క పరిమాణం మరియు ఆకారం

పెద్దగా ఉంది విస్తారంగా ఉండే స్థనాలతో పోలిస్తే చిన్నగా, గుండ్రంగా ఉండే స్థనాలలో తక్కువ మార్పులు జరుగుతాయి.

3. మీరు పెరిగిన బరువు

బరువు పెరగడం అనేది ప్రతి మహిళకు అనేక సమస్యలు తెస్తుంది. వాటిలో స్థనాలు జారడం కూడా ఒకటి. మీ గర్భధారణ సమయంలో ఎక్కువ బరువు పెరిగితే అది ఛాతీలను మరింత విస్తరించడానికి దారితీస్తుంది.

4. ధూమపానం

మీకు ఈ విషయం కొత్తగా అనిపించవచ్చు, కానీ ధూమపానం చర్మం స్థితిస్థాపకతను (Elasticity) కోల్పోయేలా చేస్తుంది. దీని కారణంగా, ధూమపానం చేసేవారి రొమ్ములు జారడానికి ఎక్కువ అవకాశం ఉంది.

5. మీ జెనెటిక్స్

అవును, అది నిజమే. మీ కుటుంబానికి చెందిన జన్యువులు పరిమాణం స్థనాల యొక్క ఆకారం మరియు సైజు మారడంలో ప్రధాన పాత్ర పోషిస్తాయి.

6. మీ వయస్సు

గర్భంతో సంబంధం లేకుండానే ప్రతి స్త్రీ స్థనాలు పెరిగే వయస్సుతో పాటు జారడం జరుగుతుంది. అస్సలు వయస్సు అనేది పెరగకుండా ఉంటె ఎంత బాగుంటుందో కదా!.

స్థనాలు జారడానికి అనేక కారణాల వలన దానిని ఆపడం కష్టం. కానీ ఆలస్యం చేయొచ్చు. 

ఈ కింది జాగ్రత్తలు తీసుకుంటే స్థనాలు జారడాన్ని ఆలస్యం చేయొచ్చు.

1. సపోర్టివ్ బ్ర్రా ధరించడం

స్థనాలలో ఉండే కూపర్ స్నాయువులు మీ స్థనాలను బిగువు ఉంచడంలో మద్దతునిస్తాయి. కానీ, కాలక్రమేణా, గురుత్వాకర్షణ ఈ స్నాయువులను కిందకు లాగి స్థనాలు జారడానికి కారణమవుతుంది. దీనిని నివారించడానికి సపోర్టివ్ బ్రా వేసుకుంటే మంచిది.

2. అధిక బరువు పెరగకుండా చూసుకోండి

పైన చెప్పినట్టు మీరు గర్భధారణ సమయంలో పెరిగిన బరువు స్థనాలు జారడానికి కారణం కావచ్చు. సున్నితమైన వ్యాయామం మరియు మీ బరువు నియంత్రణలో ఉంచడానికి సహాయపడే ఆహారం తీసుకోవడానికి ప్రయత్నించండి.

3. సురక్షితమైన మాయిశ్చరైజర్ ఉపయోగించండి

రొమ్ము సంరక్షణ విషయానికి వస్తే ఆరోగ్యకరమైన మరియు తడిగా ఉన్న చర్మం ముఖ్యం. కావున సురక్షితమైన మాయిశ్చరైజర్ మాత్రమే ఉపయోగించండి.

4. నెమ్మదిగా మీ గర్భం బరువు కోల్పోవడానికి ప్రయత్నించండి

మీరు త్వరగా బరువు కోల్పోవడానికి ప్రయత్నిస్తే, మీ చర్మం స్థిరత్వాన్ని కోల్పోతుంది. కావున నెమ్మదిగా బరువు తగ్గడం ఆచరణీయం.

5. ధూమపానం జోలికి వెల్లకండి

ధూమపానం చర్మం సాగేలా చేస్తుంది, చర్మం యొక్క స్థితిస్థాపకతను తగ్గిస్తుంది. కొన్నిసార్లు, అత్యుత్తమ మాయిశ్చరైజర్ కూడా ఈ విషయంలో మీకు సహాయపడకపోవచ్చు.

.

Click here for the best in baby advice
What do you think?
0%
Wow!
0%
Like
0%
Not bad
0%
What?
scroll up icon