Link copied!
Sign in / Sign up
27
Shares

బ్రెస్ట్ ఫీడింగ్ సమయంలో మీరు చేసే ఈ చిన్న తప్పులు మీ బిడ్డకు చాలా ప్రమాదం!!


బిడ్డకు పాలు పట్టడం తల్లులందరికి సహజంగానే వచ్చేస్తుందని అందరూ అనుకుంటారు.  కానీ బ్రెస్ట్ ఫీడింగ్ సమయంలో కొన్ని చిన్న చిన్న తప్పులు జరిగే ప్రమాదం ఉంటుంది. కానీ ఆ చిన్న చిన్న తప్పులు మీ బిడ్డకు చాలా ప్రమాదాన్ని కలిగిస్తాయి. ఆ తప్పులేమిటో, వాటిని ఎలా నివారించాలో ఇక్కడ తెలుసుకోండి…

1. నిండే వరకు ఉండకండి

చాలా మంది మహిళలు తమ రొమ్ములు పూర్తిగా పాలతో నిండిపోయిన తరువాత, పిల్లలకు పాలు ఇస్తారు. ఇలా చేయడం మంచిది కాదు. మీ రొమ్ములు పూర్తిగా పాలతో నిండి పోయిన తరువాత పాలలో ప్రోటీన్లు తగ్గిపోతాయి. అందుకే రొమ్ములు పూర్తి నిండిపోయే వరకు ఉండకుండా ముందే బిడ్డకు పాలు పట్టండి.

2. బాధపడకండి

బ్రెస్ట్ ఫీడింగ్ చేస్తున్న కొత్తల్లో మీరు పిల్లలకు సరిగా పాలు ఇవ్వడం లేదని చాలా మంది తల్లులు బాధ పడుతూ ఉంటారు. మెల్లగా బిడ్డకు పాలు ఎలా ఇవ్వాలో తెలుసుకుని ఏ తప్పు చేయకుండా బిడ్డకు పాలు ఇవ్వండి. అలా కాకుండా మీరు బ్రెస్ట్ ఫీడింగ్ సమయంలో బాధపడితే అది బిడ్డకు మంచిది కాదు.

3. రాత్రి పూట

ఉద్యోగం చేసే మహిళలు రాత్రి పూట అలసిపోవడం వలన పిల్లలకు పాలు ఇవ్వరు. అలా చేయడం వలన రొమ్ముల్లో పాలు నిండిపోతాయి. శరీరానికి పాలు అవసరానికి మించి ఉత్పత్తి అవుతున్నాయనే సంకేతం అందుతుంది. పాల ఉత్పత్తి తగ్గుతుంది. అందుకే బిడ్డకు రొమ్ములు పూర్తిగా పాలతో నిండక ముందే పాలు పట్టించండి.

4. నిద్ర

అప్పుడే పుట్టిన పిల్లలు ఎక్కువగా నిద్రపోతారు. ఇది సహజమని అందరూ పిల్లలను అలానే ఎక్కువ సేపు నిద్రపోనిస్తారు. పాలు పట్టించాల్సిన సమయంలో బిడ్డ నిద్రపోతుంటే లేపి పాలు పట్టించకుండా అలానే నిద్రపోనిస్తారు. ఆలా చేయకండి బిడ్డకు అవసరమైన పాలు అందవు. పాలు పట్టించాల్సిన సమయంలో బిడ్డ నిద్ర పోతున్న లేపి పాలు పట్టించండి.

5. ఆహరం

మీరు తీసుకునే ఆహరం మీలో పాల ఉత్పత్తికి తోడ్పడుతుంది.  అందుకే ప్రోటీన్లు, పోషకాలతో కూడిన బలమైన ఆహరం తీసుకోండి. మీరు సరైన ఆహరం తీసుకోకపోతే బిడ్డకు అవసరమయ్యే పాలను మీరు అందివ్వలేరు. 

Click here for the best in baby advice
What do you think?
0%
Wow!
0%
Like
0%
Not bad
0%
What?
scroll up icon