Link copied!
Sign in / Sign up
35
Shares

బ్రెస్ట్ ఫీడింగ్ : పిల్లలకు పాలు ఇచ్చేటప్పుడు తినకూడని 5 ప్రమాదకరమైన ఆహారాలు

డెలివరీ తరువాత ప్రతి తల్లి జాగ్రత్తగా దృష్టి పెట్టాల్సిన అంశం బ్రెస్ట్ ఫీడింగ్. పుట్టిన బిడ్డ ఆరోగ్యంగా ఎదగడం కోసం తల్లి పాలు చాలా అవసరం. బ్రెస్ట్ ఫీడింగ్ సమయంలో బాగా పాలు పట్టాలంటే ఆరోగ్యకరమైన ఆహారాలు తీసుకోవాలి. ఈ సమయంలో అందరికి ఆకలి, దాహం ఎక్కువగా ఉంటాయి. అయితే మీరు బిడ్డకు పాలు ఇచ్చేటప్పుడు కొన్ని ఆహారాలకు దూరంగా ఉండాలి. మీరు తీసుకునే ఆహారాలు పాల ద్వారా పిల్లలకు కూడా అందుతాయి. కొన్ని ఆహారాలు  వాళ్ళకు అలెర్జీలు కలిగించచ్చు.  అలాంటి తినకూడని 5 ఆహారాలు ఏంటో తెలుసుకుందాం…

1.చాక్లేట్

చాలా మంది చాక్లేట్లు ఇష్టంగా తింటారు. మానేయడం కొంచెం కష్టమే. కానీ మీరు బ్రెస్ట్ ఫీడింగ్ చేసే దశలో మరి ఎక్కువగా చాక్లేట్లు తినకపోవడం మంచిది. చాక్లేట్ లో ఉండే కొన్ని పదార్ధాలు మీ రొమ్ముల్లో పాల వుత్తపతిని  తగ్గిస్తాయి. పిల్లలకు అలెర్జీ లు కూడా కలిగించచ్చు.

2.ఆవు పాలు

బ్రెస్ట్ ఫీడింగ్ సమయంలో ఆవు పాలు కానీ దానికి సంబంధించిన ఉత్పత్తులు కానీ తీసుకోకండి. ఆవు పాలలో ఉండే ప్రోటీన్లు పిల్లలకు పడవు. అలాంటి సమయంలో పిల్లలకు ఎక్జిమా(eczema)- చర్మ సంబంధిత వ్యాధులు, వాంతులు, మలబద్దకం, లాంటి సమస్యలు ఎదురువుతాయి. అందుకే బ్రెస్ట్ ఫీడింగ్ సమయంలో ఆవు పాలకు దూరంగా ఉండండి.

3.సముద్ర చేపలు (sea fish)

చాలా మంది డాక్టర్స్ కూడా, పిల్లలకు పాలిచ్చే తల్లులను సముద్ర చేపలు తినవద్దని చెప్తారు. ఎందుకంటే సముద్ర చేపలలో మెర్క్యూరీ (mercury) ఎక్కువగా ఉంటుంది. మెర్క్యూరీ విషపదార్ధం. మీరు తీసుకునే చేపలలో ఉండే మెర్క్యూరీ, మీ పాల ద్వారా పిల్లలకు కూడా చేరుతుంది.  ఇది పిల్లల ఎదుగుదల మీద చాలా తీవ్రమైన ప్రభావం చూపిస్తుంది.

4.ఆల్కహాల్

అలవాటు లేని వాళ్లకు ఏ ప్రమాదం లేదు కానీ అలవాటు ఉన్న వాళ్ళు వెంటనే మానేయండి. బ్రెస్ట్ ఫీడింగ్ చేసే వాళ్ళు ఆల్కహాల్ తీసుకోవడం, పిల్లల పై కలిగే తీవ్రమైన పరిణామాలకు కారణం అవుతుంది. పిల్లల ఎదుగుదలను నిరోధిస్తుంది. పిల్లలు ఎప్పుడు మందంగా ఉంటారు. ఇలాంటి సమస్యలు కలుగుతాయి.

5.ప్రొసెస్డ్ (proccesed)  ప్యాకేజ్డ్ (packaged) ఫుడ్ 

  బయట దొరికే ప్యాకేజ్డ్ ఫుడ్, బ్రెస్ట్ ఫీడింగ్ అప్పుడు తినకండి. ఈ ఆహారాలు పాడైపోకుండా ఉండదానికి వాటిలో ప్రిజర్వేటివ్స్ - కొన్ని రకాల కెమికల్ కలుపుతారు. అవి పిల్లలకు అలెర్జీ లు కలిగించచ్చు. ఈ దశలో ఇంట్లో వండిన ఆహారాన్ని మాత్రమే తీసుకోండి.

Click here for the best in baby advice
What do you think?
75%
Wow!
25%
Like
0%
Not bad
0%
What?
scroll up icon