Link copied!
Sign in / Sign up
0
Shares

బ్రెస్ట్ ఫీడింగ్ మీ పీరియడ్స్ మీద ఎలా ప్రభావం చూపిస్తుంది?


చాలా మంది మహిళలు ప్రెగ్నన్సీ తరువాత తమ పీరియడ్స్ గురించి కంగారు పడుతారు. 9 నెలలు పీరియడ్స్ రాకుండా ఉండడం వలన, ప్రెగ్నన్సీ తరువాత శరీరంలో జరిగే మార్పులవలన తరువాత రాబోయే పీరియడ్స్ గురించి అనేక భయాలు అనుమానాలు ఉంటాయి. అలాగే బ్రెస్ట్ ఫీడింగ్ పీరియడ్స్ మీద ఎలాంటి ప్రభావం చూపిస్తుందో అనే దాని మీద కూడా అనేక అనుమానాలు ఉన్నాయి. వాటన్నిటి గురించి ఇక్కడ తెలుసుకోండి.

డెలివరీ తరువాత పీరియడ్స్ ఎప్పుడు ప్రారంభమవుతాయి?

ప్రెగ్నన్సీతో ఉన్న 9 నెలలు పీరియడ్స్ రాకుండా ఉంటాయి. కానీ డెలివరీ తరువాత అవి మళ్ళి తిరిగివస్తాయి. డెలివరీ తరువాత పీరియడ్స్ ఎప్పుడైనా రావచ్చు. మీరు సిద్ధంగా ఉండాలి అంతే. కొంత మంది మహిళలో పీరియడ్స్ ఆలస్యమవచ్చు. కంగారుపడాల్సిన అవసరం లేదు. అలా జరగడం సహజమే.

బ్రెస్ట్ ఫీడింగ్ పీరియడ్స్ పై ఎలాంటి ప్రభావం చూపిస్తుంది

మీరు బిడ్డకు పాలు పట్టే సమయంలో మీ శరీరంలో ప్రొలాక్టిన్ ఉత్పత్తి అవుతుంది. ఇది మీ రక్తంలో ప్రవహిస్తుంది. మీరు బ్రెస్ట్ ఫీడింగ్ చేస్తునంత కాలం ఇది మీ రక్తంలో ప్రవహిస్తుంది. దీని వలన మీ శరీరంలో అందవిడుదల జరుగుతుంది. మీకు పీరియడ్స్ రావు. కానీ కొన్ని సార్లు బ్రెస్ట్ ఫీడింగ్ చేస్తున్న సమయంలోనే పీరియడ్స్ వచ్చే అవకాశం ఉంటుంది. ఆ సమయంలో కూడా మీరు బ్రెస్ట్ ఫీడింగ్ చేయచ్చు. పాలలో ఏ విధమైన మార్పు ఉండదు.

బ్రెస్ట్ ఫీడింగ్ ఆపేసిన తరువాత వచ్చే ద్రవాలు

బ్రెస్ట్ ఫెడింగ్ ఆపేసిన తరువాత మొదటి సారి వచ్చే పీరియడ్స్ లో కొంత మార్పు ఉంటుంది. యోని నుండి వచ్చే ద్రవాలు ఎరుపుగా ఉంటాయి, తరువాత లేత రంగులోకి, తరువాత ముదురు గోధుమ రంగులోకి మారుతాయి. ఈ ద్రవాలను ల్యాచియా అంటారు. ఈ ద్రవం బ్రెస్ట్ ఫీడింగ్ ఆపేసిన తరువాత రావడం మొదలవుతుంది. తరువాత మెళ్ళగా ఆగిపోతుంది. 

Tinystep Baby-Safe Natural Toxin-Free Floor Cleaner

Click here for the best in baby advice
What do you think?
0%
Wow!
0%
Like
0%
Not bad
0%
What?
scroll up icon