బ్రెస్ట్ ఫీడింగ్ గురించి మీకు చాలా మంది, చాలా విషయాల చెప్పి ఉంటారు . అందులో మీకు ఉపయోగ పడినవి కొన్ని, అయోమయానికి గురిచేసినవి కొన్ని. అయితే బ్రెస్ట్ ఫీడింగ్ గురించి కొన్ని అసత్యాలు, అపోహలు ప్రచారంలో ఉన్నాయి. వీటివలన బ్రెస్ట్ ఫీడింగ్ చేస్తున్న తల్లులు కొంత భయానికి లోనవుతున్నారు. అందుకే మీరు బ్రెస్ట్ ఫీడింగ్ గురించి విన్నవాటిలో కొన్ని అసత్యాలు ఇవే …
1. చిన్న రొమ్ముల్లో తక్కువ పాలు ఉంటాయి
ఇది 100% అసత్యం. రొమ్ముల్లో పాలను వుత్తపతి చేసే బ్రెస్ట్ కణజాలాలు (breast tissues) ప్రెగ్నన్సీ సమయంలో పెరుగుతాయి. రొమ్ముల పరిమాణానికి కారణమైన కొవ్వు కణజాలాలలో పాలకు సంబంధించిన నాళాలు ఉండవు. అంటే రొమ్ముల పరిమాణానికి, పాలకు ఏవిధమైన సంబంధం లేదు. రొమ్ముల సైజు తక్కువగా ఉంటె పాలు తక్కువగా ఉంటాయి, అని ఎవరైనా చెప్తే నమ్మకండి.
2. సి-సెక్షన్ జరిగితే పాలు ఇవ్వలేం
సాధారణ కాన్పు జరిగిన వాళ్ళతో పోలిస్తే, సి- సెక్షన్ వాళ్ళకు బ్రెస్ట్ ఫీడింగ్ మొదట్లో కొంచెం కష్టంగా ఉండచ్చు. కానీ అసాధ్యం మాత్రం కాదు. సమతుల్యమైన, ఆరోగ్యకరమైన ఆహారం తీసుకుంటే, ఏ సమస్య ఉండదు.
3. రొమ్ములు జారిపోతాయి
రొమ్ములు జారిపోవడం అనేది ప్రెగ్నన్సీ వలన జరుగుతుంది. ప్రెగ్నన్సీ తో ఉన్నప్పుడు శరీరం తో పాటు రొమ్ములు కూడా లావు అవుతాయి. దీని వలన రొమ్ములు జారిపోవడం జరుగుతుంది. రొమ్ములు జారిపోడానికి బ్రెస్ట్ ఫీడింగ్ మాత్రమే కారణం కాదు.
4. నెలసరి పూర్తిగా ఆగిపోతాయి
బ్రెస్ట్ ఫీడింగ్ వలన పీరియడ్స్ ఎప్పటికి ఆగిపోతాయి,ఇది పూర్తి అవాస్తవం. అలా జరగదు. బ్రెస్ట్ ఫీడింగ్ చేస్తున్న సమయంలో నెలసరి కొంత కాలం వరకు రావు. కానీ పూర్తిగా ఆగిపోవడం మాత్రం జరగదు.
5. మూసుకుపోయిన నాళాలతో బ్రెస్ట్ ఫీడింగ్ చేయలేము
ఇది పూర్తిగా అవాస్తవం. పిల్లలు పాలు తాగే సమయాన్ని మార్చినప్పుడు ఈ సమస్య వస్తుంది. ఈ సమస్యకు పరిష్కారం, బ్రెస్ట్ ఫీడింగ్ చేయడమే. అలాగే బ్రెస్ట్ ఫీడింగ్ చేసే దశలో బిగుతుగా ఉండే బ్రాలను వేసుకోవద్దు.
