పిల్లలకు పాలు ఇచ్చేటప్పుడు పీరియడ్స్ ఎందుకు ఆగిపోతాయి? ఇలా జరిగితే ప్రమాదమా..!
మీరు ప్రెగ్నన్ట్ గా ఉన్న సమయంలో, ప్రసవం జరిగాక మీ శరీరంలో చాలా మార్పులు చోటు చేసుకుంటాయి. అందులో ముఖ్యమైన మార్పులు మీరు బ్రెస్ట్ ఫీడింగ్ చేస్తున్న సమయంలో జరుగుతాయి. ప్రధానంగా మీ పీరియడ్స్ లో చాలా మార్పులు జరుగుతాయి. అవేంటో చూద్దాం…
ఎందుకు జరుగుతుంది?
బ్రెస్ట్ ఫీడింగ్ చేస్తున్న సమయంలో ప్రోలాక్టిన్ అనే హార్మోన్ ఎక్కువగా విడుదలవుతుంది. దీని కారణంగా రొమ్ముల్లో పాలు ఉత్పత్తి అవుతాయి. కానీ ఇదే హార్మోన్ కారణంగా, అండ ఉత్పత్తికి అవసరమయ్యే హార్మోన్ లు తగ్గిపోతాయి. అందువలన బ్రెస్ట్ ఫీడింగ్ చేస్తున్నప్పుడు, పీరియడ్స్ ఆలస్యమవుతాయి. ఇలా పీరియడ్స్ ఆలస్యమవడాన్ని లాక్టేషన్ ఆమెనోరెయా (lactational amenorrhea) అంటారు. బ్రెస్ట్ ఫీడింగ్ చేస్తున్న సమయంలో మీరు ఏకాంతంలో పోల్గోన్న గర్భం రాకుండా ఉండడానికి 98% అవకాశం ఉంటుంది.
అందరిలో ఇలా జరుగుతుందా?
కొంతమందిలో బ్రెస్ట్ ఫీడింగ్ చేసే సమయంలో పీరియడ్స్ వచ్చే అవకాశం ఉంటుంది. బ్రెస్ట్ ఫీడింగ్ మానేసిన తరువాత మీ పీరియడ్స్ మళ్ళి తప్పకుండా మొదలవుతాయి.
ఏకాంతంగా పాల్గొంటే ఏమవుతుంది?
బ్రెస్ట్ ఫీడింగ్ సమయంలో ఏకాంతంగా పాల్గొనడంలో ఏ సమస్య లేదు. మీరు ఇంతక ముందులానే ఏకాంతంగా ఆనందాన్ని అనుభవించచ్చు. కానీ మీరు గర్భం పొందే అవకాశం తక్కువగా ఉంటాయి. అందుకు కారణం పీరియడ్స్ ఆగిపోవడం. మీరు గర్భం పొందుతారనే భయం లేకుండా దగ్గరగా ఉండటం చేయవచ్చు .