Link copied!
Sign in / Sign up
13
Shares

బ్రెస్ట్ ఫీడింగ్ సులభంగా చేయడానికి మహిళలు ధరించాల్సిన 5 నర్సింగ్ బ్రాస్

మీరు బ్రెస్ట్ ఫీడింగ్ చేస్తున్నారా ? అయితే మీరు వేసుకునే బ్రా సరిగా ఎంచుకోవడాం చాలా అవసరం. ఫీడింగ్ చేసే దశలో సాధారణ బ్రాస్ కాకుండా నర్సింగ్ బ్రాస్ వేసుకోవడం, మీకు చాలా ఉపయోగపడుతుంది. ఈ బ్రాస్ మీ రొమ్ములను సాగిపోకుండా చేయడమే కాకుండా, పిల్లలకు పాలు పట్టడాన్ని సులభం చేస్తాయి. బ్రెస్ట్ ఫీడింగ్ చేసే దశలో, ధరించాల్సిన అలాంటి బ్రాస్ ఏంటో చూడండి…

1. అండర్ వైర్ నర్సింగ్ బ్రాస్
Underwire nursing bras

సాధారణ బ్రాస్ లా కాకుండా, ఈ నర్సింగ్ బ్రా కు ఉండే క్లిప్స్తో  బ్రా కప్స్ ను సులువుగా, ఓపెన్ చేయచ్చు, క్లోజ్ చేయచ్చు. ఇవి పిల్లలకు పాలు ఇవ్వడాన్ని సులభం చేస్తాయి.

2. సాఫ్ట్ కప్ నర్సింగ్ బ్రాస్
Soft cup nursing bras

సాఫ్ట్ కప్ నర్సింగ్ బ్రాస్, బ్రెస్ట్ ఫీడింగ్ బ్రాస్ లో ఉత్తమమైనవి. ఇవి మీ రొమ్ములను సౌకర్యంగా ఉంచడమే కాకుండా, ఏ కష్టం లేకుండా పిల్లలకు పాలు ఇచ్చేలా ఉపయోగపడుతాయి.

3. నర్సింగ్ స్లీప్ బ్రాస్
Nursing sleep bras

ఇవి చాలా మెత్తగా, సౌకర్యంగా ఉంటాయి. రాత్రి పూట కూడా ధరించచ్చు. పిల్లలకు సులువుగా బ్రెస్ట్ ఫీడింగ్ చేయచ్చు.

4. ట్యాంక్ టాప్ నర్సింగ్ బ్రాస్
Tank top nursing bras

ఈ ట్యాంక్ బ్రాస్ కు ఉండే నర్సింగ్ క్లిప్స్, మీరు ఏ సమయంలోనైనా, ఏ పరిస్థుతులలో నైనా పిల్లలకు పాలు ఇవ్వడాన్ని సులువు చేస్తాయి. ఏవి ట్యాంక్ టాప్స్ మరియు బ్రా కలయిక. వీటిని సులువుగా ధరించచ్చు.

5. బ్రెస్ట్ పంపింగ్ బ్రాస్

 Breast pumping bras

ప్రెగ్నన్సీ తరువాత కొన్ని సమస్యల వలన, పిల్లలకు నేరుగా రొమ్ముల ద్వారా పాలు ఇవ్వలేకపోతాం. అలాంటి సమయంలో బ్రెస్ట్ పంపింగ్ సహాయంతో, రొమ్ముల నుండి పాలు సేకరించి, పిల్లలకు పట్టిస్తారు. ఈ సమస్య ఉన్నప్పుడు ఈ బ్రా ధరించడం మొత్తం ప్రక్రియను సులభం చేస్తుంది.

 

 

 

 

Click here for the best in baby advice
What do you think?
0%
Wow!
0%
Like
0%
Not bad
0%
What?
scroll up icon