Link copied!
Sign in / Sign up
153
Shares

బ్రెస్ట్ ఫీడింగ్: బ్రెస్ట్ మిల్క్ పెంచుకోవడానికి 10 అద్భుతమైన ఆహారాలు

ప్రపంచ ఆరోగ్య సంస్థ (World Health Organisation), పిల్లలను ఆరోగ్యాంగా ఉంచడానికి, 6 నెలల వరకు తల్లి పాలు ఇవ్వడం అత్యుత్తమమైన మార్గంగా తేల్చింది. తల్లిపాల ద్వారా పిల్లలకు, పూర్తి పోషక విలువలతో సహా రోగాలను, ఇన్ఫెక్షన్ లను ఎదురుకునే యాంటిబాడీస్ ను కూడా అందిస్తుంది. అందుకే తల్లిపాలు బిడ్డకు అత్యంత అవసరమైన విషయం. కానీ చాలా మంది మహిళల్లో రొమ్ముల్లో పాలు తగ్గిపోవడం పెద్ద సమస్య. కానీ మీరు రోజు ఈ 10 ఆహారాలను తీసుకుంటే  పాల ఉత్పత్తి చాల బాగా జరుగుతుంది.

1.మెంతులు

శాస్త్రీయ అధ్యయనాల ప్రకారం మెంతుల్లో గాలాక్టోగోగూస్(Galactogogues) ఉంటుందని రుజువు చేయబడింది. ఈ పదార్ధం రొమ్ముల్లో పాలను ఉత్పత్తి చేస్తాయి. డాక్టర్స్ కూడా బాలింతలకు పాలు పడడానికి వీటిని ఆహారంలో ఎక్కువగా తీసుకోమని చెప్తారు. క్రమం తప్పకుండా రోజు కొంచెం మెంతులు తీసుకొని నీరు తాగండి. పాలు బాగా పడుతాయి.

2.సొంపు

భోజనం అయ్యాక సరదాగా తినే సోంపు ఆరోగ్యానికి అమృతం లాంటిది. రోజు సాధా సోంపు తీసుకోవడం వలన పాలు చాలా త్వరగా పడుతాయి. పాలు పడడానికే కాకుండా , ప్రెగ్నన్సీ తర్వాత వచ్చే అజీర్తి,మలబద్ధకం లాంటి సమస్యలను కూడా సోంపు నయం చేస్తుంది.

3.వెల్లులి

వెల్లులి మనం వంటల్లో వాడుతుంటాం కానీ వెల్లులి కొన్ని ఆయుర్వేద గుణాలున్నాయి. అందుకె కొన్ని మూలికలతో కలిపి ఆయుర్వేదంలో వాడుతుంటారు. అధ్యయనాల ప్రకారం, వెల్లులిని ఏదో విధం ఆహారం లో తీసుకునే వారు, పిల్లలకు ఎక్కువ సేపు పాలు పట్టగలరని తెలిసింది..

4.జీలకర్ర

మనం సాదరణంగా ఇంట్లో వాడే జీలకర్ర లో ఐరన్ శాతం ఎక్కువగా ఉంటుంది. బాలింతలుగా ఉన్నపుడు జీలకర్రను ఎక్కువగా తీసుకోవడం రొమ్ముల్లో పాల ఉత్పత్తిని ఉతేజపరుస్తుంది.

5.నువ్వులు

తెల్ల నువ్వులు, నల్ల నువ్వులు రెండింటిలోనూ కాపర్, కాల్షియమ్ పుష్కలంగా ఉంటాయి. వీటిలో ఉండే పోషకాలు తల్లికి బిడ్డకు చాలా అవసరం. బెల్లంతో చేసిన నువ్వులుండలు, అరిసెలు తినడానికి ప్రయత్నించండి. ప్రెగ్నన్సీ తర్వాత మీకు బలాన్ని, శక్తిని ఇస్తుంది.

6.వాము

అందరి ఇంట్లోను వామును కడుపు ఉబ్బరంగా ఉన్నపుడు, లేదా అజీర్తి చేసినప్పుడు వాడుతుంటాం. కానీ వాముకు బాలింతల్లో పాలను ఉత్పత్తి చేసే శక్తి కూడా వుంది.

7.ఓట్స్

బాలింతలు ఉదయం పూట అల్పాహారంగా తీసుకోవడానికి ఓట్స్ ఒక మంచి ఎంపిక. కాల్షియమ్, ఫైబర్, ఐరన్ ఓట్స్ లో పుష్కలంగ దొరుకుతాయి. ఉదయం పూట ఒక బౌల్ ఓట్స్ తీసుకోవడం వలన రొమ్ముల్లో ల్యాక్టేషన్ (lactation ) మెరుగుపడుతుంది.

8.కూరగాయలు

కూర గాయల్లో ముఖ్యంగా నేతి బీరకాయ, సొరకాయ, కాకరకాయ లాంటివి పాల ఉత్పత్తికి చాలా తోడ్పడుతాయి. అంతే కాకుండా పోషక విలువలు, అధికంగా ఉంటాయి. అరుగుదలకు కూడా ఉపయోగ పడుతాయి.

9. ఏర్ర కూరగాయలు

క్యారెట్, బీట్ రూట్, చిలకడ దుంప లాంటి ఎర్రని కూరగాయల్లో బీటా కరోటిన్ (beta carotene) అధిగంగా ఉంటుంది. ఇది పాల ఉత్పత్తిని పెంచడమే కాకుండా, కాలేయ సమస్యలను, రక్త హీనతను పోగొడుతుంది.

10.డ్రై ఫ్రూప్ట్స్

బాదాం, జీడీ పప్పు, ఆప్రికాట్ , పిస్తా లాంటి డ్రై ఫ్రూప్ట్స్ ప్రోలక్టీన్ (prolactin) అనే హార్మోన్ ను ఉత్పత్తి చేస్తాయి.  ఈ హార్మోన్ ల్యాక్టేషన్ (lactation ) జరిగేటప్పుడు చాల ప్రధానంగా పని చేస్తుంది. అందుకె బాలింతలుగా ఉన్నపుడు డ్రై ఫ్రూప్ట్స్ ను మీ ఆహారంలో భాగం చేసుకోండి.

Tinystep Baby-Safe Natural Toxin-Free Floor Cleaner

Click here for the best in baby advice
What do you think?
100%
Wow!
0%
Like
0%
Not bad
0%
What?
scroll up icon