Link copied!
Sign in / Sign up
8
Shares

బ్రెస్ట్ ఫీడింగ్ ఆపేసిన తరువాత జరిగే 5 విషయాలు


బ్రెస్ట్ ఫీడింగ్ ఆపాల్సిన సమయం అందరు అమ్మలకు ఒకేలా ఉండదు. తల్లి పాలు ఇవ్వడం ఆపేసిన తరువాత శారీరక మార్పులతో పాటు కొంత భావోద్వేగ మార్పులకు కూడా లోనవుతారు. బ్రెస్ట్ ఫీడింగ్ ఆపేసిన తరువాత, శారీరకంగా, మానసికంగా జరిగే మార్పులు కొంత ఆందోళనకు గురిచేస్తాయి. అందుకే బ్రెస్ట్ ఫీడింగ్ ఆపేసిన తరువాత జరిగే ఈ విషయాలు గురించి తెలుసుకోండి…

1. మానసిక మార్పులు (Mood changes)

బ్రెస్ట్ ఫీడింగ్ ఆపేసిన తరువాత కొన్ని మానసిక మార్పులకు లోనవడం సహజం. కొంతమందిలో చికాకుపడడం, చిన్న విషయాలకు కూడా కంగారుపడడం లాంటి లక్షణాలు కనపడతాయి. ఈ సమస్యలన్నీ కొన్ని వరాల తరువాత ఆగిపోతాయి. ఒకవేళ ఎక్కువ కాలం కొనసాగితే మీ గైనకాలజిస్ట్ ను తప్పనిసరిగా సంప్రదించండి.

2. రొమ్ముల్లో నుంచి పాలు కారడం

బ్రెస్ట్ ఫీడింగ్ ఆపేసిన తరువాత రొమ్ముల్లో నుంచి పాలు కారడం సహజం. రొమ్ముల్లో పాల వుత్తపతి ఆగిపోవడం అందరికి ఒకేలా జరగదు. ఎక్కువ కాలం బ్రెస్ట్ ఫీడింగ్ చేసివుంటే, పాలు వుత్తపతి ఆగిపోడానికి ఎక్కువ సమయం పడుతుంది. తరువాత రొమ్ముల్లో నుంచి పాలు కారడం కూడా పూర్తిగా ఆగిపోతుంది.

3.పీరియడ్స్ తిరిగి మొదలవుతాయి

బ్రెస్ట్ ఫీడింగ్ చేస్తున్న సమయంలో పీరియడ్స్ ఆగిపోతాయి. మీరు బ్రెస్ట్ ఫీడింగ్ ఆపేసిన తరువాత పీరియడ్స్ తిరిగి మొదలవుతాయి. అయితే కొంత మందిలో పీరియడ్స్ ఆలస్యం అవడం సహజం జరుగుతుంది. బ్రెస్ట్ ఫీడింగ్ ఆపేసిన తరువాత, పీరియడ్స్ తిరిగి మొదలవడానికి ఎక్కువ సమయం తీసుకుంటే, మీ గైనకాలోజిస్ట్ ను కలవండి.

4. రొమ్ముల పరిమాణం తగ్గుతుంది

మీరు ప్రెగ్నన్సీ తో ఉన్న సమయంలో, శరీర బరువుతో పాటు, రొమ్ముల పరిమాణం కూడా పెరుగుతుంది. తరువాత మీరు బ్రెస్ట్ ఫీడింగ్ చేస్తున్న సమయంలో కూడా ఆ పరిమాణం అలానే కొనసాగుతుంది. మీరు పాలు ఇవ్వడం ఆపేసిన తరువాత ఆ పరిమాణం తగ్గి సాధారణ స్థాయికి వస్తుంది.

5. రొమ్ముల్లో నొప్పిగా ఉంటుంది

బ్రెస్ట్ ఫీడింగ్ సడెన్ గా ఆపేయడం వలన మాస్టిటిస్ (Mastitis) సమస్య వస్తుంది. అంటే రొమ్ములో నొప్పిగా ఉండడం, మంటగా ఉండడం, నాళాలు మూసుకుపోవడం, సలపరింతలు లాంటి సమస్యలు వస్తాయి. నొప్పి ఎక్కువగా ఉంటే పాలను రొమ్ముల నుంచి పాలు తీసేయండి. సమస్యలు తీవ్రమైతే గైనకాలోజిస్ట్ ను కలవండి.  

Click here for the best in baby advice
What do you think?
0%
Wow!
0%
Like
0%
Not bad
0%
What?
scroll up icon