Link copied!
Sign in / Sign up
5
Shares

బ్రాహ్మి సరస్వతి ఆకు : ఆయుర్వేద మూళిక యొక్క 8 ప్రయోజనాలు

ఆయుర్వేదం భారత దేశంలో అనాదిగా అనేక వ్యాధులను నయం చేస్తూ వుంది. అంతే కాకుండా మన శరీరంలోని వివిధ క్రియలను సక్రమంగా, సరళంగా జరగడానికి ఆయుర్వేదం తోడ్పడుతుంది. అలాంటి ఆయుర్వేదం ప్రసాదించిన ఒక దివ్య ఔషధం బ్రహ్మి సరస్వతి ఆకు. ఇది నీటిలో ఉంటుంది. ఇందులో వుండే ఆయుర్వేద గుణాలు మీ పిల్లలకు చాలా అవసరం. అవేంటో ఇక్కడ చూడండి…

1. వత్తిడిని తగ్గిస్తుంది

బ్రాహ్మి సరస్వతి ఆకు వత్తిడిని, ఆతృతను తగ్గిస్తుంది. మన మెదడులో వత్తిడిని, ఆతృతను కలిగించే కార్టిసోల్ హార్మోన్స్ ను తగ్గిస్తుంది.

2. మతిమరుపు

బ్రాహ్మి మతిమరుపు వ్యాధిని తగ్గిస్తుంది. బ్రాహ్మి ఆకులో ఉండే బాకోసైడ్స్ అనే కెమికల్ మెదడులోని కణాలను నిర్మాణానికి తోడ్పడుతుంది.

3. మేథా శక్తి

బ్రాహ్మి మెదడులోని హిప్పోక్యాంపస్ అనే భాగం మీద ప్రభావం చూపిస్తుంది. పిల్లలలో తేలితేటలు పెరగడానికి ఈ భాగమే కారణం. ఈ ఆకు తీసుకోవడం వలన జ్ఞాపకశక్తి, తెలివితేటలు పిల్లలలో పెరుగుతాయి.

4. క్యాన్సర్ నివారణ

బ్రాహ్మి ఆకులో యాంటీఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉంటాయి. ఇవి శరీరంలోని క్యాన్సర్ కారక కణాలను అణిచివేస్తాయి. కాన్సర్ ను నివారిస్తాయి.

5. రోగ నిరోధక శక్తి

యాంటీఆక్సిడాంట్స్ తో పాటు బ్రాహ్మి ఆకులో పుష్కలంగా ఉండే పోషకాలు మీ శరీరంలోని రోగ నిరోధక శక్తిని పెంచుతుంది.

6. కీళ్ళ నొప్పులు

కీళ్ళ నొప్పులు, కీళ్ళ వాపు వంటి రోగాలకు బ్రాహ్మి ఆకును ఆయుర్వేద ఔషధం గా వాడుతారు. ఇది వెంటనే ఫలితాన్ని చూపిస్తుంది. అందుకు ఈ వ్యాధి ఉన్న వారు ఈ ఆకులను తీసుకోవడం మంచిది.

7. చక్కర వ్యాధి

బ్రాహ్మి ఆకు చక్కర వ్యాధిని అదుపులో ఉంచుతుంది. రక్తంలోని చక్కర శాతాన్ని అదుపు చేస్తుంది. చక్కర వ్యాధి ఉన్న వాళ్ళు ఈ బ్రాహ్మి ఆకును రోజు తీసుకోవడం  వలన కొంత ఫలితం ఉంటుంది.

8. చుండ్రు

బ్రాహ్మి ఆకుతో తయారు చేసే నూనె తలకు వాడడం వలన జుట్టు రాలడం, చుండ్రు లాంటి సమస్యలను అరికడుతుంది. 

Click here for the best in baby advice
What do you think?
0%
Wow!
0%
Like
0%
Not bad
0%
What?
scroll up icon