Link copied!
Sign in / Sign up
1
Shares

బొట్టు నుదుటిపై ఎందుకు పెట్టుకోవాలి..? ఏ వేలితో పెట్టుకుంటే మంచిది, అసలు రహస్యం ఇదే..

బొట్టు..తిలకం..సింధూరం..ఇలా భారతీయ హైందవ సంస్కృతీ ప్రకారం మహిళలు నుదుటిపై బొట్టు పెట్టుకోవడం సాంప్రదాయంగా వస్తోంది. అయితే ప్రస్తుతం ఫ్యాషన్ ట్రెండ్ కారణంగా కొందరు బొట్టు పెట్టుకోవడానికి దూరంగా ఉంటున్నారు, అదే వాళ్ళ వ్యక్తిగత ఇష్టం. కాగా, నుదుటిపై బొట్టు పెట్టుకోవడం వెనుక మన పెద్దలు చెబుతున్న ఈ నిజాలు వింటే మాత్రం ఆశ్చర్యం కలుగుతుంది. బొట్టు వెనుక దాగి ఉన్నటువంటి ఆ రహస్యం ఏంటో మీరే చూడండి.. 

కుంకుమ ఎందుకు ధరించాలి..!!

మన భారతీయ ఆచార వ్యవహారాల ప్రకారం మహిళలు నుదుటిన కుంకుమ ధారణ చేసుకోవడం సాంప్రదాయంగా వస్తోంది. మన శరీరంలోని ఒక్కో అవయవానికి ఒక్కో అధిదేవత ఉన్నారు. అలా లలాటానికి అధిపతి బ్రహ్మ. అంటే నుదుటి స్థానానికి అధిపతి బ్రహ్మ. బ్రహ్మ ఎరుపు రంగులో ఉంటారు. అందుకు సంకేతంగా ఎర్రటి కుంకుమ లేదా సింధూరం నుదుటిపై ధరిస్తారు. ఇలా బొట్టు పెట్టుకోవడం వలన సాక్ష్యాత్తు ఆ దేవుడినే పూజించినట్లని చెబుతారు. ముక్కు పై భాగాన, రెండు కనుబొమ్మల మధ్య భాగాన ఇలా బొట్టు పెట్టుకోవడం వలన ఇక్కడ మొత్తం మూడు కలుస్తాయి. ఈ మూడు నాడులు పీయూష గ్రంధితో అనుసంధానం అయి ఉంటాయి. 

ఏ వేలితో బొట్టు పెట్టుకోవాలి?

పైన చెప్పినవిధంగా లలాటస్థానంలో బొట్టు పెట్టుకోవడం వలన సూర్యకాంతి అక్కడ ప్రసరించినట్లయితే శరీర నాడులు ఉత్తేజితమై మేధావులను చేస్తుందని అంటారు. సూర్యకాంతి పడిన తర్వాత శరీర నాడులు, అవయవాలు ఉత్తేజితమై శరీరం ఆరోగ్యంగా ఉండేలా చేస్తుంది. సాధారణంగా కుంకుమ లేదా సింధూరం పెట్టుకుంటున్నప్పుడు ఉంగరం వేలితో బొట్టు పెట్టుకోవడం చేస్తుంటారు. ఇలా ఉంగరం వేలితో బొట్టు పెట్టుకుంటే చాలా ప్రశాంతంగా ఉంటారు. అదే చూపుడు వేలితో బొట్టు పెట్టుకోవడం వలన ముక్తి మార్గం కలుగుతుందని, మధ్య వేలితో బొట్టు పెట్టుకోవడం వలన ఆయుష్షు పెరిగి ఆరోగ్యంగా ఉంటారని పండితులు, పెద్దలు చెబుతున్నారు. 

మీరు బాగా గమనించి ఉన్నట్లయితే మన పెద్దలు ఒక బిళ్ళ ఆకారంలో నిండుగా నుదుటిపై బొట్టు ధరించేవారు. ఈ రహస్యం చాలామందికి తెలుసు కాబట్టి ఇంకా ఆ ఆచారాన్ని చాలామంది ఫాలో అవుతున్నారు. అందుకని ఈ గొప్ప విషయాలను ప్రతి ఒక్కరికీ తెలిసేలా షేర్ చేయండి.. 

Click here for the best in baby advice
What do you think?
0%
Wow!
0%
Like
0%
Not bad
0%
What?
scroll up icon