Link copied!
Sign in / Sign up
34
Shares

బియ్యంతో కడిగిన నీటితో మీ అందాన్ని 10 రెట్లు పెంచుకోవచ్చు. ఎలాగో చూడండి

ఒకప్పుడు మన పెద్దలు, మన పూర్వీకుల జుట్టు ఎంత అందంగా, రాలిపోకుండా ఉండేదో తెలుసా,  వారి ముఖం, చర్మం కాంతివంతంగా మెరిసిపోతూ ఉండేది. అప్పట్లో ఇప్పుడు మనం వాడుతున్న క్రీములు లేకపోవడం మరియు ప్రతిరోజూ వారు బియ్యంతో కడిగిన నీటిని ఉపయోగించడమే. అసలు ఈ నీటిని ఎలా ఉపయోగించాలి? ఎలా ఉపయోగిస్తే అందం పెరుగుతుందో ఇక్కడ వివరంగా తెలుసుకుందాం..

బియ్యం నీటిని ఎలా వాడాలి?

ముందుగా ఒక బౌల్ లో బియ్యం, వాటిని కడిగేందుకు నీటిని తీసుకుని బియ్యంను శుభ్రం చేసుకోవాలి. ఈ నీటిని పారబోయాలి. ఆ తరవాత మళ్ళీ నీటితో బియ్యం కడిగి ఆ నీటిని ఒక బౌల్ లో ఉంచుకోవాలి, మరోసారి బియ్యంను నీటితో శుభ్రం చేసుకుని అంతకుముందు ఉంచిన బౌల్ లో ఈ నీటిని పోయాలి. ఈ నీటిని ముఖంపై కడుక్కోవడం వలన ముఖం అందంగా తయారవుతుంది.

మొటిమలు ఉండవు కాంతి పెరుగుతుంది

చాలామంది మహిళలలో చిన్న చిన్న మొటిమలు, ముఖంపై రాషెస్, జిడ్డు, మురికి, ఆయిల్ చర్మం వస్తూ ఉంటుంది. అటువంటివారు నేరుగా అయినా లేదా కాటన్ తీసుకుని బియ్యం కడిగిన నీటిలో ఉంచి ముఖంపై రాసుకుని శుభ్రం చేసుకుంటే మంచి ఫలితం ఉంటుంది. అలాగే మోచేతులు, మోకాళ్ళు, మెడ భాగంలో రాసుకోవడం వలన నలుపుదనం తగ్గిపోతుంది.

జుట్టుకు ఎలా ఉపయోగించాలి?

బియ్యంను కడిగిన నీటిని జుట్టుకు, జుట్టు కుదుళ్లకు రాయడం వలన సిల్కీ హెయిర్ సొంతం అవ్వడమే కాకుండా, జుట్టు రాలే సమస్య తగ్గుతుంది. ముందుగా ఈ నీటిని జుట్టుపై రాసుకుని కొన్ని నిముషాల తర్వాత గానీ ఆరిన తర్వాత తలస్నానం చేసుకుని బాగా ఆరబెట్టుకుంటే జుట్టు అందంగా ఉంటుంది.

ఎటువంటి ఖర్చు లేకుండా మీ అందాన్ని పెంచే ఈ సింపుల్ చిట్కాలను అందరితోనూ SHARE చేసుకోండి.  
Tinystep Baby-Safe Natural Toxin-Free Floor Cleaner

Click here for the best in baby advice
What do you think?
0%
Wow!
0%
Like
0%
Not bad
0%
What?
scroll up icon