Link copied!
Sign in / Sign up
29
Shares

బియ్యంలో పురుగులు పుట్టకుండా ఉండాలంటే ఈ 3 గృహ చిట్కాలు పాటించండి : చాలా బాగా పనిచేస్తాయి

దాదాపు ప్రతి ఒక్కరి ఇంట్లోనూ ఇది ఎదురవుతున్న సమస్యే. కొత్త బియ్యం, పాత బియ్యం అనే తేడా లేకుండా బియ్యంలలో చిన్న చిన్న పురుగులు చేరుతూ ఉంటాయి. అలాగే గోధుమపిండి ఒక వారం డబ్బాలో ఉంచినా చాలు వెంటనే పురుగులు చేరుతూ ఉంటాయి. ఇలా చేరడం వలన ఆ పురుగులను బయటకు తీయడానికి చాలా ఇబ్బందులు పడాల్సి వస్తూ ఉంటుంది. కొన్ని సార్లు అయితే వీటిని బయటకు పడేయాల్సి వస్తుంది. అందుకని మన పెద్దలు చెప్పిన ఈ గృహ చిట్కాలను ఫాలో అయినట్లయితే బియ్యం, గోధుమ పిండిలలో పురుగులు పట్టకుండా చూసుకోవచ్చు. ఎలాగో మీరే చూడండి. మీకు నచ్చితే అందరికీ తెలుపగలరు.

కర్పూరం బిళ్ళలు

బియ్యం పురుగు పట్టకుండా ఉండాలంటే మనం పూజ గదిలో ఉపయోగించే కర్పూరం బిళ్లలను మెత్తగా పొడిగా చేసుకోవాలి. ఈ పొడిని చిన్న చిన్న కాటన్ క్లాత్ లలో ఉంచి బియ్యం సంచి లేదా బియ్యం డబ్బాలలో ఉంచుకోవడం వలన పురుగులు పట్టకుండా నిరోధించవచ్చు.

వేపాకు ఉండలు

పైన కర్పూరం బిళ్ళలతో చేసిన విధంగా బియ్యంలో పురుగులు పట్టినప్పుడు వెంటనే కొన్ని ఎండిన వేపాకులు తీసుకుని పొడిగా చేసుకోవాలి. ఇలా పొడిగా చేసుకున్న తర్వాత చిన్న చిన్న ఉండలుగా ఒక పొడి వస్త్రంలో కట్టుకుని బియ్యం మధ్యలో ఉంచడం వలన పురుగులు పట్టకుండా ఆపవచ్చు.

వెల్లుల్లి

బియ్యంలో పురుగులు ఎక్కువగా ఉన్నప్పుడు లేదా పురుగులు పట్టకుండా ఉండాలంటే వెల్లుల్లి రిబ్బలను పొట్టు తీయకుండా లేదా ఒక క్లాత్ లో ఉంచి బియ్యం డబ్బాలో వేయడం వలన ఈ సమస్య నుండి బయటపడవచ్చని చెబుతున్నారు పెద్దలు.

లవంగాలు

బియ్యం పురుగు పట్టకుండా ఆపడంలో లవంగాలు మరింత ఎఫెక్టివ్ గా పనిచేస్తాయి. కొన్ని లవంగాలను తీసుకుని పొడిగా చేసుకుని ఆ పొడిని పలుచటి పొడి వస్త్రంలో బియ్యం మధ్యలో ఉంచుకోవాలి. లేదా ఎటువంటి పొడి చేయకుండా లవంగాలను క్లాత్ లో ఉంచుకొని బియ్యం మధ్యలో ఉంచుకున్నా సరే పురుగు పట్టకుండా ఆపుకోవచ్చు.

ఉప్పు

ఇది దాదాపు అందరికీ తెలిసిన విషయమే. రాళ్ళ ఉప్పును బియ్యం డబ్బాలో లేదా బియ్యం సంచిలో ఉంచినట్లయితే పురుగు పట్టకుండా ఆపవచ్చు. అలాగే ఎండిన కాకరకాయ ముక్కలను పొడి వస్త్రంలో చిన్న చిన్న మూటలుగా చేసుకుని ఉంచడం వలన బియ్యం పురుగు పట్టదు. ఈ విషయాలు గ్రామాలలో ఉన్నవారికి బాగా తెలిసి ఉంటాయి. మన పెద్దలు, నిపుణులు చెప్పిన ఈ ఉపయోగకరమైన విషయాలను ఫాలో అవ్వండి. మీకు నచ్చితే అందరితో పంచుకోండి. 

Tinystep Baby-Safe Natural Toxin-Free Floor Cleaner

Dear Mommy,

We hope you enjoyed reading our article. Thank you for your continued love, support and trust in Tinystep. If you are new here, welcome to Tinystep!

We have a great opportunity for you. You can EARN up to Rs 10,000/- every month right in the comfort of your own HOME. Sounds interesting? Fill in this form and we will call you.

Click here for the best in baby advice
What do you think?
0%
Wow!
0%
Like
0%
Not bad
0%
What?
scroll up icon