Link copied!
Sign in / Sign up
14
Shares

బిడ్డ ఎదుగుదల: పుట్టిన మొదటిరోజు నుండి మొదటి సంవత్సరం వరకు ఎలా ఉంటుందో చూడండి

చిన్న పిల్లలు పుట్టిన తర్వాత మొదటి సవత్సరంలో చాలా పెరుగుతారు. మొదటి సంవత్సరంలో చాలా మంది పిల్లలకు ఒక రూపం రావడం, మాటలు రావడం, నడవడం, పరుగెత్తడం వంటి చేస్తారు. ఈ పెరుగుదల చాలా అరకు అందరి పిల్లల్లో ఒకే రకంగా ఉంటుంది.  అయితే మొదటి సంవత్సరంలో పిల్లల పెరుగుదల ఎలా ఉంటుందో ఇప్పుడు చూద్దాం.

మొదటి నెల

నెల వయసు ఉన్న పిల్లలు తమ చుట్టూ ఉన్న పరిసరాలను చూస్తారు, గమనిస్తారు. వారి చేతులు ముడుచుకొని ఉండటం గమనించవచ్చు.  వారు నలుపు, తెలుపు రంగులను గుర్తిస్తారు. పిల్లలు చిన్నగా సబ్ధాలు చేయడం, ఓ, ఆ వంటివి అనడం గమనించవచ్చు.

2-3 నెలల మధ్య

2-3 నెలల నుండి చిన్న పిల్లల శరీరంలో పైభాగం వృద్ధి చెందడం ప్రారంభం అవుతుంది. వారు తన్నడం, కాళ్ళు, చేతులు కదిలించడం వంటివి చేస్తారు. వస్తువులను గమనిస్తారు. ఏవైనా తెలిసిన మొహాలను చూస్తే నవ్వుతారు. ఈ వయసులో నవ్వడం, అరవడం వంటివి చేస్తారు.

4-7 నెలల మధ్య

4-7 నెలల మధ్య పిల్లలు ఎక్కువగా నవ్వడం చేస్తుంటారు. వారికి ఆకలైనా, ఆనందం అయినా ఏడవడం, నవ్వడం వంటివి చేస్తూ ఉంటారు. రంగుల మధ్య తేడాలను గమనిస్తారు, ఎటువంటి సపోర్ట్ లేకుండా కూర్చుంటారు. వారి చుట్టూ ఉన్న వస్తువులను గమనించడం, లాగడం వంటివి చేస్తారు. ఏదైనా వస్తువుని లేదా టేబుల్‌ను పట్టుకొని లేవడానికి ప్రయత్నం చేస్తారు.

8-12 నెలలు

పిల్లలు దాగివున్న వస్తువులను గమనిస్తారు. రోజూ జరిగే కార్యక్రమాలకు అలవాటు పడతారు. వారంతకు వారే నీళ్ళు తాగడం, చిన్నగా నడవడం వంటీవి చేస్తారు, వారు అమ్మను, నాన్నను వదిలినప్పుడు ఏడవడం వంటివి చెస్తారు, వారు అమ్మ, నాన్న అని పిలవడం మొదలుపెడతారు, వారు చేతులు ఊపడం, బాయ్ చెప్పడం వంటివి చేస్తారు. వారు విన్న మాటలను మళ్ళీ ఉచ్చరించడానికి ప్రయత్నిస్తారు.

శారీరకంగా వారు ఈ సమయంలో బాగా భివృద్ధి చెందుతారు. వారంతకు వారే లేవడం, వస్తువులు లాగడం వంటీవి చేస్స్తారు. స్పూన్, కప్ వంటివి పట్టుకునేంతగా వారి చేతులు బలంగా తయారవుతాయి. ఈ సమయంలో తల్లిదండ్రుల చేతులు పట్టుకొని లేవడం, ఏదైనా సపోర్ట్ తీసుకొని లేవడం వంటివి చేస్తారు. మాటలు రావడం, ప్రతి దాన్ని పరిశీలనగా చూడటం వంటివి చేస్తారు.

మొదటి సంవత్సరంలో పిల్లలు బాగా ఎదుగుతారు. వారి ఎత్తు కూడా చాలా ఎక్కువవుతుంది. మీరు చూస్తుండగానే వారు పెరిగి పెద్ద వాళ్ళవుతారు. వారు పెరిగే ప్రతి క్షణాన్ని ఒక తల్లిగా మీరు ఆస్వాదించండి.

Click here for the best in baby advice
What do you think?
0%
Wow!
0%
Like
0%
Not bad
0%
What?
scroll up icon