Link copied!
Sign in / Sign up
28
Shares

బిడ్డకు పాలు ఇచ్చేటప్పుడు తల్లి చేయకూడని 5 పనులు : చాలా ప్రమాదకరం

బిడ్డకు తల్లి పాలు ఎంత అవసరమో, ఎన్ని నెలలు (6 నెలలు) అవసరమో ప్రతి తల్లికీ తెలిసే ఉంటుంది. అయితే బిడ్డకు పాలు ఇచ్చే సమయంలో తల్లికి ఇక్కడ చెప్పుకోబోయే అలవాట్లు ఉండకూడదు మరియు ఈ పనులు చేయకూడదు. ఇలా చేయడం వలన పసిపిల్లలను ఆకలికి దూరం చేయడమే కాకుండా మీ బిడ్డ ఎదుగుదలకు ఆటంకం కలిగించిన వారవుతారు. ఆ విషయాలేంటో మీరు తెలుసుకోండి. అందరికీ తెలియజేయండి.

పాలు తాగమని ఒత్తిడి చేయకండి

కొందరు తల్లులు తమ పిల్లలకు పాలు ఇచ్చే సమయంలో ఎక్కువగా ఒత్తిడికి గురవుతూ ఉంటారు. తల్లి ఎంత ఒత్తిడికి గురవుతుందో పాలు సేవించే బిడ్డ కూడా అంతే ఒత్తిడికి గురవుతాడు. ఎందుకంటే రొమ్ములు పరిశుభ్రంగా లేకపోవడం వలన పాలు తాగే సమయంలో ఏడవటం,  దగ్గడం చేస్తుంటారు. ఇది తెలియక బిడ్డ పాలు తాగలేదని రొమ్ములకు దగ్గరగా తీసుకుని తాగమని ఒత్తిడి చేయకూడదు.

పాలు ఇస్తున్నామని సిగ్గుపడకండి

తల్లి అవ్వటం ఎంత అదృష్టమో, బిడ్డకు పాలు ఇవ్వడం కూడా అంతే అదృష్టంగా భావించాలి. మీరు మీ బిడ్డకు పాలు ఇవ్వడం వలన మీ అందం తరిగిపోదు, మీ శరీరంలో ఎటువంటి మార్పులు జరగవు. ఇంకా చెప్పాలంటే ఆరోగ్యంగానే ఉంటారు. తల్లి పాలకు బదులుగా బిడ్డకు ఏం ఇచ్చినా కూడా  వృధానే అవుతుంది.

ఈ మందులు వాడకూడదు

బిడ్డకు పాలు ఇవ్వాలని, పిల్లల ఆకలిని తీర్చాలని ప్రతి తల్లీ కోరుకుంటుంది, కానీ కొందరిలో పాపం పాల ఉత్పత్తి సరిగ్గా ఉండకపోవడం వలన బిడ్డకు పాలు ఇవ్వలేరు. పాల ఉత్పత్తి పెరగడానికి కొన్ని రకాల మందులను, ఎవరో ఇచ్చిన మందులను సొంతంగా ఉపయోగించడం మంచిది కాదు. ప్రస్తుతం కొన్ని నాసిరకాల మందులను తక్కువ ఖర్చుకే ఇచ్చేవాళ్ళు ఉన్నారు. మీకు నిజంగా ఈ సమస్య ఉంటే అనుభవజ్ఞులైన ఆయుర్వేద నిపుణలను లేదా డాక్టర్స్ ను కలిసి మీ సమస్య చెప్పండి.

పాలు ఇచ్చే సమయంలో మధ్యలో వదిలివేయకండి

పిల్లలు పాలు తాగే సమయంలో అందరూ ఒకే విధంగా త్వరగా పాలు సేవించడం కాస్త కష్టమే. రొమ్ములు సరిగ్గా నోటికి అందక జారిపోవడం, పాలు తాగడానికి రొమ్ములను అందుకుంటూ అలసిపోవడం వలన ఎక్కువ సమయం పట్టవచ్చు. అందుకని విసిగిపోకుండా బిడ్డ జారిపోకుండా పట్టుకోవడం, రొమ్ములు అందేలా పాలు తాగించడం చేయాలి.

ఆల్కహాల్ ధూమపానం సేవించి ఇవ్వకూడదు

ఇది ప్రత్యేకంగా చెప్పుకోకపోయినా ప్రతి తల్లికీ తెలిసిన విషయమే. తల్లి ఏ ఆహారం తీసుకుంటుందో చంటి పిల్లాడి కూడా పాల రూపంలో అంతే ఆహారం అందుతుంది కాబట్టి, తల్లి ఆల్కహాల్, ధూమపానానికి దూరంగా ఉండాలి. ధూమపానం చేసేవారి పక్కన కూడా ఉండకూడదు. మీతో పాటు మీ బిడ్డ ఆరోగ్యానికి ఇది మంచిది కాదు.

దయచేసి ఈ విషయాలు అందరికీ చేరేలా SHARE చేయండి.  

Click here for the best in baby advice
What do you think?
0%
Wow!
0%
Like
0%
Not bad
0%
What?
scroll up icon