Link copied!
Sign in / Sign up
4
Shares

బిడ్డకు జన్మనివ్వడానికి మించిన విపరీతమైన నొప్పిని భరించాల్సిన 5 సందర్భాలు

బిడ్డకు జన్మనివ్వడంలో కలిగే నొప్పిని ఎంత వర్ణించిన అది అతిశయోక్తి కాదు. అది మొదటి కాన్పయినా, రెండోదైన, మూడోదైనా బిడ్డకు జన్మనివ్వడంలో నొప్పి ఉంటుంది. కానీ మీ జీవితంలోని కొన్ని సందర్భాలలో అంతకు మించిన బాధను అనుభవించాల్సి ఉంటుంది. ఆ సంధర్భాలేంటో ఇక్కడ తెలుసుకోండి…

1. మైగ్రేన్ తల నొప్పి

ఈ తల నొప్పి సాధారణ తలనొప్పి లాంటిది కాదు. చాలా మందిలో మైగ్రేన్ తల నొప్పి అలానే కొన్ని రోజుల వరకు కొనసాగుతుంది. ఈ నొప్పి భరించలేనంత తీవ్రంగా ఉంటుంది. మైగ్రేన్ ఉంటే తల నొప్పితో పాటు వాంతులు, తల తిరగడం వికారం కూడా ఉంటాయి.

2. ఎముకులు విరిగితే

ఎముకులు విరగడం చాలా నొప్పిని కలిగిస్తుంది, బిడ్డకు జన్మనివ్వడం కన్నా. ఎముకులు చాలా బలంగా ఉంటాయి, అవి విరిగేంత వత్తిడి భరించలేని నొప్పిని కలిగిస్తుంది. గాయం మానేంత వరకు బాధను అనుభవించాలి.

3. కిడ్నీలో రాళ్ళు

కిడ్నీ రాళ్ళు ఏర్పడడం మొదట్లో అనేక సమస్యలకు కారణమయిన, నొప్పి అంతగా ఉండదు. కానీ రాళ్ళు పెరిగేకొద్ది, నొప్పి పెరుగుతుంది. నడుము కింది భాగంలో తీవ్రంగా నొప్పి కలుగుతుంది. అందుకే పీచు పదార్ధాలు, నీరు ఎక్కువగా తీసుకోవడం వలన దీనిని నిరోధించవచ్చు.

4. పంటి నొప్పి

పంటి నొప్పి గురించి తెలియాలంటే ఆ బాధను అనుభవించాల్సిందే. ఒక చిన్న పన్ను కలిగించే నొప్పి తల మొత్తం దిమ్మతిరిగేలా చేస్తుంది. దానికదే తగ్గాల్సిందే తప్ప మీరు ఏమి చేసిన, ఎంత బతిమిలాడిన తగ్గదు.

5. మూత్రాశయ సమస్యలు

మూత్రానికి వెళ్ళడం సులువుగా జరగాలని, కొంత ప్రశాంతతను ఇవ్వాలని అందరూ కోరుకుంటారు. కానీ అది మీకు నొప్పిని కలిగిస్తే, చాలా తీవ్రంగా ఉంటుంది. కొన్ని మూత్రాశయ సమస్యల వలన మీరు మూత్రానికి వెళ్ళే ప్రతిసారి నొప్పిని భరించాల్సివుంటుంది. 

బిడ్డకు జన్మనివ్వడాన్ని తక్కువ చేయడం కాదు. ఆ బాధ లోని తీవ్రతను ఈ నొప్పులను పోల్చడం మాత్రమే...

.....................................................................................................

మహిళలందరికీ ఓ మంచి శుభవార్త..

Tinystep మీరు సురక్షితంగా ఉండటానికి ఎటువంటి కెమికల్స్ లేని సహజమైన ఫ్లోర్ క్లీనర్ ఉత్పత్తిని ప్రారంభించింది. మీ పిల్లల ఆరోగ్యకోసం, మీ ఇంట్లోకి ఎటువంటి క్రిములు చేరకుండా ఈ ఫ్లోర్ క్లీనర్ ఉపయోగపడుతుంది.

ఒక్కసారి మీ ఇంట్లో ఈ ప్రాడక్ట్ ను ఉపయోగించి, మీ విలువైన అభిప్రాయాన్ని తెలియపరచండి.

Tinystep ఫ్లోర్ క్లీనర్ ఆర్డర్ చేయడానికి ఇక్కడ క్లిక్ చేయండి

Tinystep Baby-Safe Natural Toxin-Free Floor Cleaner

Click here for the best in baby advice
What do you think?
0%
Wow!
0%
Like
0%
Not bad
0%
What?
scroll up icon