Link copied!
Sign in / Sign up
0
Shares

పిల్లలకు జన్మను ఇచ్చాక ఉద్యోగానికి వెళ్లే తల్లులు ఈ 4 విషయాలు తెలుసుకోవాలి..

ఓ మహిళ తల్లిగా మారాక తనకు ఎన్నో బాధ్యతలు ఉంటాయి. వాటన్నింటినీ తల్లే నిర్వర్తించాల్సి ఉంటుంది. బిడ్డకు జన్మనిచ్చాక అటు బిడ్డను, ఇటు కుటుంబ సభ్యులను తన ఒంటి చేత్తో సరిగా చూసుకోవాలి. ఇక.. ఏమాత్రం తేడా వచ్చినా ఇంట్లో గొడవలే. అందుకే అన్నింటినీ బ్యాలెన్స్ చేస్తూ కుటుంబ బాధ్యతలను సక్రమంగా నిర్వర్తించగలుగుతుంది అమ్మ. అందుకే అమ్మకు అంత గొప్ప స్థానం ఇస్తుంటారు.

బిడ్డకు జన్మనిచ్చిన తర్వాత కొన్ని రోజులకు జాబ్ చేసే మహిళలు మళ్లీ తమ కెరీర్ ను ప్రారంభించాలనుకుంటారు. కాని.. బిడ్డను వదిలి ఎలా జాబ్ చేయాలా అనే సందేహంలో ఉంటారు. ఓ 10 నిమిషాలు బేబీని వదిలి ఉంటేనే ఏదో కోల్పోయామనే భావనలో ఉంటాం కదా.. మరి ఓ ఎనిమిది తొమ్మిది గంటల పాటు బిడ్డను చూడకుండా ఎలా ఉండేది అనే డౌట్ ప్రతి తల్లికి వస్తుంది. కాని.. ఇక్కడ మేం చెప్పే ఈ టెక్నిక్స్ ను మీరు ఫాలో అయ్యారంటే అటు బిడ్డను, ఇటు మీ కెరీర్ రెండింటినీ సక్రమంగా నిర్వర్తించవచ్చు.

పాలు పట్టడం

బిడ్డకు పాలు పట్టడం కోసం ఓ షెడ్యూల్ వేసుకోండి. ఆ షెడ్యూల్ ప్రకారం మీరు మీ బిడ్డకు పాలు పడితే ఏ ఇబ్బంది ఉండదు. మీరు జాబ్ కు వెళ్లేముందు, వెళ్లి వచ్చిన తర్వాత పాలు ఇవ్వడం, ఇలా సరైన షెడ్యూల్ వేసుకోవాలి. ఇక.. మీ కేర్ టేకర్ ను ఎక్కువగా పాలు పట్టొద్దని చెప్పండి. ఇలా ప్రతిరోజు షెడ్యూల్ ప్రకారం నడుచుకుంటే మీ జాబ్ కు, బిడ్డను చూసుకోవడానికి ఎటువంటి ఇబ్బంది ఉండదు.

ఫోకస్ గా పని చేయాలి

మెటర్నిటీ లీవ్ తర్వాత మీరు ఎప్పుడైతే మళ్లీ జాబ్ లో జాయిన్ అవుతారో అప్పుడు మీరు ఎంతో హుషారుగా పని చేస్తారు. మెటర్నిటీ లీవ్ ముందు కంటే ఇప్పుడు ఎంతో తొందరగా పనులను పూర్తి చేస్తుంటారు. చకచకా పనులను పూర్తి చేయడం మీరు మీ బిడ్డకు జన్మనిచ్చాక అలవాటు చేసుకొని ఉంటారు. ఇంకోటి.. త్వరగా పని పూర్తి చేస్తే.. సాయంత్రం తొందరగా ఇంటికి వెళ్లి మీ బిడ్డను చూసుకోవచ్చని ఆలోచిస్తారు.

ఒత్తిడిని జయించాలి

మీరు మీ ఒత్తిడి ఎంత త్వరగా జయిస్తే.. అంత త్వరగా మీ జాబ్, మీ ఇంటి పని, మీ బేబీని అంత బాగా చూసుకోగలరు. ఒత్తిడిని కంట్రోల్ చేసుకోలేకపోతే మాత్రం చాలా సమస్యలు వస్తాయి. అందుకే.. ఒత్తిడిని జయించడం కోసం కనీసం 6 గంటలైనా నిద్రపోవాలి. మీ రోజూ వారి జీవితంలో వ్యాయామాన్ని కూడా చేర్చండి. మంచి ఆహారం తీసుకోండి. ఎక్కువగా దేని గురించి ఆలోచించకండి. ఇవన్నీ సరిగ్గా పాటిస్తే ఖచ్చితంగా మీరు మీ ఒత్తిడిని జయించగలరు. అంతే కాదు.. మీ జాబ్, మీ ఇల్లు, మీ బిడ్డ అందరినీ సరిగ్గా చూసుకోగలరు.

మీ భర్తతో కాసేపు సరదాగా గడపండి

నిజానికి బిడ్డను చూసుకోవడం, ఇంటి బాధ్యతలను నిర్వర్తించడం, కెరీర్ చూసుకోవడం.. వీటన్నింటితోనే మీ జీవితం గడిచిపోతుంటుంది. కాని.. మీ భర్తను కూడా మీరు సరిగ్గా చూసుకోవాలి. ఆయనతో సరదాగా కాసేపు గడపండి. అప్పుడు మీకు కూడా రిలాక్సింగ్ గా ఉంటుంది. అందుకే పార్ట్నర్ కోసం రోజులో కొంత సమయం కేటాయించాలి. లేదంటే వారాంతపు సెలవుల్లో కాసేపు ఇద్దరు కలిసి హాయిగా గడపండి.

డ్రెస్సులు సరిగ్గా సెలక్ట్ చేసుకోండి

సాధారణంగా డెలివరీకి ముందు, డెలివరీ తర్వాత మహిళల శరీరంలో మార్పులు వస్తుంటాయి. అందుకే మార్పులను అనుగుణంగా డ్రెస్సులు ఎంపిక చేసుకోవాలి. ఇంట్లో ఉండే తల్లులను ఏ డ్రెస్సు అయినా పర్లేదు కాని మీరు ఆఫీసుకు వెళ్తారు కాబట్టి ఆఫీసుకు నప్పే డ్రెస్సులు వేసుకోవడం ఉత్తమం. రొమ్ముల దగ్గర బటన్స్ ఉండే డ్రెస్సులు వేసుకుంటే బిడ్డకు పాలివ్వాలనుకుంటే ఎటువంటి సమస్యా ఉండదు. లేదంటే.. బిడ్డకు పాలివ్వడంలో చాలా సమస్యలు వస్తాయి.

డేకేర్, ప్లే స్కూల్స్

మీరు జాబ్ కు వెళ్లిన సమయంలో మీ పిల్లలను డేకేర్ సెంటర్ లో చేర్పించాలనుకుంటారు. కాని సరైన డేకేర్ సెంటర్ సెలెక్ట్ చేసుకోవడమే చాలా కష్టం. ఎందుకంటే మీరు జాబ్ కు వెళ్లిన సమయంలో మీ బేబీ డేకేర్ సెంటర్ లోనే ఉండాలి. అందుకే మంచి డేకేర్ సెంటర్ ను ఎంపిక చేసుకుంటే మీకు ఎటువంటి టెన్షన్ ఉండదు.

బిడ్డకు జన్మను ఇచ్చాకా ఉద్యోగానికి వెళ్లాలనుకునే మహిళలు ఈ విషయాల పట్ల జాగ్రత్తగా ఉండండి.. 

.....................................................................................................

మహిళలందరికీ ఓ మంచి శుభవార్త..

Tinystep మీరు సురక్షితంగా ఉండటానికి ఎటువంటి కెమికల్స్ లేని సహజమైన ఫ్లోర్ క్లీనర్ ఉత్పత్తిని ప్రారంభించింది. మీ పిల్లల ఆరోగ్యకోసం, మీ ఇంట్లోకి ఎటువంటి క్రిములు చేరకుండా ఈ ఫ్లోర్ క్లీనర్ ఉపయోగపడుతుంది.

ఒక్కసారి మీ ఇంట్లో ఈ ప్రాడక్ట్ ను ఉపయోగించి, మీ విలువైన అభిప్రాయాన్ని తెలియపరచండి.

Tinystep ఫ్లోర్ క్లీనర్ ఆర్డర్ చేయడానికి ఇక్కడ క్లిక్ చేయండి 

Tinystep Baby-Safe Natural Toxin-Free Floor Cleaner

Click here for the best in baby advice
What do you think?
0%
Wow!
0%
Like
0%
Not bad
0%
What?
scroll up icon