Link copied!
Sign in / Sign up
6
Shares

బిడ్డకు జన్మనివ్వడం మహిళల శరీరాన్ని పూర్తిగా మార్చేస్తుంది!! అందుకు 9 కారణాలు

image source : flickr

ప్రతి మహిళ జీవితంలో బిడ్డకు జన్మనివ్వడం ఒక అద్భుతమైన అనుభవం. ప్రతి మహిళా బిడ్డకు జన్మనిచ్చి అమ్మ అవ్వాలని జీవితం మొత్తం ఎదురుచూస్తుంది. కానీ ఈ అనుభవానికి మనం చెల్లించే మూల్యం మన శరీరం. అవును బిడ్డకు జన్మనివ్వడం మీ శరీరంలో అనేక మార్పులకు కారణం అవుతుంది. అవేంటో, ప్రసవం తరువాత మీ శరీరంలో వచ్చే మార్పులేంటో ఇక్కడ చూడండి…

1. జుట్టు ఊడిపోవడం

ప్రసవం జరిగిన కొన్ని వారాల తరువాత, జుట్టు రాలడం మొదలవుతుంది. రోజుకు సుమారుగా 100 వెంట్రుకలు రాలిపోతాయి. ఇలా జుట్టు రాలడం 6 నెలల వరకు కొనసాగుతుంది. ప్రెగ్నన్సీ సమయంలో ఎక్కువగా విడుదలైన వివిధ హార్మోన్లు, ప్రసవం తరువాత తగ్గిపోతాయి. శరీరం వాటిని భర్తీ చేసే ప్రయత్నంలో, ఇలా జరుగుతుంది. అయితే మీరు బాధపడాల్సిన అవసరం లేదు, జుట్టు పెరుగుదల తిరిగి సాధారణ స్థితికి చేరుకుంటుంది.

2. చర్మం పొడిబారిపోతుంది

ప్రసవం మీ చర్మం మీద కూడా ప్రభావం చూపిస్తుంది. కొంత మంది మహిళలలో పెదాలు, గెడ్డం భాగంలో చర్మం ఎర్రగా అయిపోతుంది. చర్మం పొడిబారిపోతుంది. మీ శరీరానికి కావాల్సిన నీరు తీసుకుని శరీరాన్ని హైడ్రేటెడ్ గా ఉంచుకోవడం వలన ఈ సమస్య దూరమవుతుంది.

3. ఎదభాగంలో మార్పులు

మీ ఎదభాగం పాలతో నిండిపోతాయి, ఎర్రగా అయిపోతాయి, వాపు వస్తుంది, ఇవన్నీ ప్రసవం తరవాత జరుగుతాయి. 2-3 రోజుల తరువాత వాపు తగ్గుతుంది. తరువాత ఎదభాగం జారిపోవడం మొదలవుతుంది. దీనికి కారణం చర్మం సాగిపోవడం. కొన్ని సమయాలలో ఎద నుండి పాలు కారుతాయి.

4.పొత్తి కడుపులో మార్పులు

ప్రసవం జరిగిన తరువాత మీ గర్భశయం వాస్తుంది. మీ పొత్తి కడుపు పై చేయి పెడితే మీకు తెలుస్తుంది. కొన్ని రోజుల తరువాత వాపు తగ్గి సాధారణ స్థితికి చేరుకుంటుంది. ఇంకా పొత్తి సాగుతుంది, ఇలా జరగడం చాలా సహజం. ప్రసవం తరువాత అందరికి ఎదురయ్యే సమస్య స్ట్రెచ్ మార్క్స్. మొదట లేత ఎరుపు రంగులో ఉంటాయి, తరువాత తెల్లగా మారి శరీర చాయలో కలిసిపోతాయి.

5. వెన్ను నొప్పి

ఉదర భాగంలోని కండరాలు ప్రెగ్నన్సీ సమయంలో వదులవుతాయి. ఇవి తిరిగి బిగువయ్యే వరకు మీ వెన్ను మీద అధిక వత్తిడి పడుతుంది. దీని వలన మీకు ప్రసవం తరువాత వెన్ను నొప్పి ఉంటుంది. సహజంగా ప్రసవం అయిన 6 వారాల తరువాత ఈ సమస్య నయమవుతుంది.

6. మూత్రం, మల బద్దకం

మీరు ప్రెగ్నన్సీ తో ఉన్నప్పుడు, కడుపులోని బిడ్డ బరువు మీ మూత్ర నాళాల మీద వత్తిడి కలిగిస్తుంది. దీని వలన ప్రసవం తరువాత కొన్ని మూత్ర సమస్యలు ఎదురుకుంటారు. అంతే కాకుండా ప్రసవం తరువాత మలబద్దకం మిమ్మల్ని వేధిస్తుంది. పీచుతో కూడిన ఆహరం, పండ్లు, నీరు తీసుకోవడం ఈ సమస్యకు పరిష్కారం.

7. అక్కడ నొప్పి

ప్రసవం తరువాత మహిళలకు గర్భస్థానం దగ్గర అనేక మార్పులు చోటు చేసుకుంటాయి. కొన్ని వారాల వరకు మహిళల ప్రైవేట్ భాగం నుండి రక్తంతో కూడిన ద్రవం స్రవిస్తుంది. మీరు బ్రెస్ట్ ఫీడింగ్ చేయడం వలన ఆ భాగం పొడిబారిపోతుంది. నొప్పి కూడా కలుగుతుంది. కొన్ని వారాల ఈ సమస్యలు తొలిగిపోతాయి.

8. చమటలు

ప్రసవం తరువాత రాత్రుల్లో మీకు అధికంగా చమట పడుతుంది. ప్రెగ్నన్సీ సమయంలో మీ శరీరంలోకి చేరిన వివిధ ద్రవాలు చమట రూపంలో ఇలా శరైరమ్ నుండి బయటకు వెలుతాయి. ఈ సమస్య కొన్ని రోజులే ఉంటుంది. 

.....................................................................................................

మహిళలందరికీ ఓ మంచి శుభవార్త..

Tinystep మీరు సురక్షితంగా ఉండటానికి ఎటువంటి కెమికల్స్ లేని సహజమైన ఫ్లోర్ క్లీనర్ ఉత్పత్తిని ప్రారంభించింది. మీ పిల్లల ఆరోగ్యకోసం, మీ ఇంట్లోకి ఎటువంటి క్రిములు చేరకుండా ఈ ఫ్లోర్ క్లీనర్ ఉపయోగపడుతుంది.

ఒక్కసారి మీ ఇంట్లో ఈ ప్రాడక్ట్ ను ఉపయోగించి, మీ విలువైన అభిప్రాయాన్ని తెలియపరచండి.

Tinystep ఫ్లోర్ క్లీనర్ ఆర్డర్ చేయడానికి ఇక్కడ క్లిక్ చేయండి

Tinystep Baby-Safe Natural Toxin-Free Floor Cleaner

Dear Mommy,

We hope you enjoyed reading our article. Thank you for your continued love, support and trust in Tinystep. If you are new here, welcome to Tinystep!

We have a great opportunity for you. You can EARN up to Rs 10,000/- every month right in the comfort of your own HOME. Sounds interesting? Fill in this form and we will call you.

Click here for the best in baby advice
What do you think?
0%
Wow!
0%
Like
0%
Not bad
0%
What?
scroll up icon