Link copied!
Sign in / Sign up
3
Shares

బిడ్డకు జన్మనిచ్చే ముందు మీకు తప్పకుండా కలిగే 5 ఆలోచనలు : మీకు ఈ ఆలోచనలు వచ్చాయేమో చూడండి..

గర్భవతి అయ్యారు అని తెలిసినప్పటి నుండి ఎప్పుడెప్పుడు తన చిన్నారి చిరు నవ్వు చూస్తానా అని ప్రతి తల్లి ఎదురు చూస్తుంటుంది. బిడ్డకు జన్మనివ్వడం అనేది ఒక అద్భుతమైన మరియు మాటల్లో వర్ణించలేని అనుభూతి. ఇంకా పుట్టకుండానే మీ చిన్నారిని ఎంతో ప్రేమిస్తుంటారు. అంత ప్రేమ ఉన్నప్పుడు వారి పట్ల భయం, వారి ఆరోగ్య విషయంలో సందేహాలు ఉండటం సహజమే. కడుపులో బిడ్డ ఎలా పెరుగుతుంది, పుట్టాక మనం ఎంత బాగా చూసుకోవాలి, ఎలాంటి భవిష్యత్తుని ఇవ్వాలి, ఇలా అనేక విధాలుగా ఆలోచిస్తుంటాము. ఇలాంటి ఆలోచనలే కాక బిడ్డ గురించి ప్రతి తల్లికి కొన్ని కోరికలు కూడా ఉంటాయి. అవేంటంటే….

1. పుట్టబోయే బిడ్డ చూడటానికి ఎలా ఉంటుంది

అన్ని కోరికలు లాగే, ఇది కూడా చాలా సాధారణం. మనకు పుట్టబోయే బిడ్డ చూడటానికి ఎలా ఉంటుంది, ఏ రంగులో ఉంటుంది అని ఆలోచించకుండా ఉండలేము. మీ చిన్నారి అందరి కన్నా ఆరోగ్యంగా మరియు అందంగా ఉండాలని కోరుకుంటున్నారు కదా! అలానే జరుగుతుంది, సంతోషంగా ఉండండి.

2. ఎవరి పోలిక

తప్పకుండా మన మనస్సులో మెదిలే మరో ఆలోచన, చిన్నారికి ఎవరి పోలిక వస్తుంది - అమ్మ పోలిక నా లేక నాన్న పోలిక నా? ఎలాగో చిన్నారికి ఇద్దరి పోలికలు వస్తాయి కాబట్టి ఇద్దరిలో ఉండే మంచి పోలికలు రావాలని ఆశపడతాం కదా!

3. చిన్నారి స్వభావం

ప్రధమంగా చిన్నారి స్వభావం పెంపకం మీద ఆధార పడి ఉంటుంది. కానీ, కొంత వరకు చిన్నారి స్వభావం తల్లి గర్భంలోనే ఏర్పడుతుంది. ఇదే నిజమైతే ప్రతి తల్లి ప్రార్థన ఒక్కటే, తన చిన్నారి మంచి స్వభావం కలిగి ఉండాలని, మంచి భవిష్యత్తు ఉండాలని, అందరికి మంచి పేరు తీసుకు రావాలని.

4. చిన్నారి భవిష్యత్తు

కొన్ని సార్లు, మనం ఒంటరిగా కూర్చొని ఉన్నపుడుపు మన చిన్నారి భవిష్యత్తు అంత సినిమాలో ఒక పాటలో జరిగినట్టు ఊహించుకుంటాము. వారు పుట్టినట్టు, ఆడుకుంటూ పెరిగినట్టు,డాక్టర్ లేదా ఇంజినీర్ అయినట్టు, పెళ్లి చేసుకొని పిల్లలు కనట్టు ఊహించుకుంటాము కదా! మన ఊహలన్నీ నిజం అయ్యి పిల్లలకు మంచి భవిష్యత్తు లభిస్తే అంత కంటే ఆనందం ఇంకేముంటుంది చెప్పండి. ‘

5. ప్రసవం

దాదాపు తొమ్మిది నెలలపాటు గడిపిన తర్వాత, అన్నింటిని ఆశిస్తూ మరియు సంభవించిన ప్రతి దాని గురించి జ్ఞానం పొందటంతో, ఆసుపత్రిలో కొన్ని రోజులు ఉండాల్సి వస్తుంది, ఆ తరువాత మీరు కోరుకున్న కొత్త జీవితం ఆవిర్భవిస్తుంది. కాబట్టి ప్రసవం సులభంగా జరగాలి ప్రతి మహిళా కోరుకుంటుంది. 

.....................................................................................................

మహిళలందరికీ ఓ మంచి శుభవార్త..

Tinystep మీరు సురక్షితంగా ఉండటానికి ఎటువంటి కెమికల్స్ లేని సహజమైన ఫ్లోర్ క్లీనర్ ఉత్పత్తిని ప్రారంభించింది. మీ పిల్లల ఆరోగ్యకోసం, మీ ఇంట్లోకి ఎటువంటి క్రిములు చేరకుండా ఈ ఫ్లోర్ క్లీనర్ ఉపయోగపడుతుంది.

ఒక్కసారి మీ ఇంట్లో ఈ ప్రాడక్ట్ ను ఉపయోగించి, మీ విలువైన అభిప్రాయాన్ని తెలియపరచండి.

Tinystep ఫ్లోర్ క్లీనర్ ఆర్డర్ చేయడానికి ఇక్కడ క్లిక్ చేయండి

Click here for the best in baby advice
What do you think?
0%
Wow!
0%
Like
0%
Not bad
0%
What?
scroll up icon