Link copied!
Sign in / Sign up
34
Shares

ప్రెగ్నన్సీ సమయంలో మీ కడుపులో ఎదుగుతున్న బిడ్డ, ఏ వారం ఏ పండు సైజులో ఉంటాడు…


మీకు ఇప్పుడే మీరు ప్రేగ్నన్ట్ అని తెలిసింది. ఇప్పుడు ఒక చిన్న ప్రాణం మీలో ఎదుగుతుంది. ఎంత అద్భుతమో కదా? మీ కడుపులో పెరుగుతున్న బిడ్డ గురించి తెలుసుకోవాలని మీకు చాలా ఆతృతగా ఉంటుంది. మీ ప్రెగ్నన్సీ రోజులు గడుస్తున్న కొద్ది మీ కడుపులోని బిడ్డ ఎదుగుతూ ఉంటాడు. ఏ వారం ఎంత ఎదుగుతాడు అన్నది తెలుసుకోవడం చాలా కష్టమే. కానీ మీ కోసం మీకు అర్ధమయ్యే విధంగా మీ కడుపులో బిడ్డ ప్రతి వారం ఎంత ఉంటాడో తెలియచేస్తున్నాం…

1. 4 వ వారం

మీరు ఇప్పుడే ప్రేగ్నన్ట్ అని టెస్ట్ల ద్వారా కన్ఫర్మ్ అయ్యింది. ఇప్పుడు మీ కడుపులో బిడ్డ ఎంత సైజు ఉంటాడో తెలుసా? గసగసాల గింజంత.

2. 5 వ వారం

ఈ వారం నుండే మీలో ప్రెగ్నన్సీ లక్షణాలు కనిపిస్తాయి. ఈ వారంలో మీ కడుపులో బిడ్డ నువ్వు గింజంత సైజు లో ఉంటాడు.

3. 6 వ వారం

ఈ వారం నుండి మీకు మార్నింగ్ సిక్నెస్ మొదలవుతుంది. వేవిళ్లు చేసుకుంటారు. ఈ కడుపులోని బిడ్డ గుండె గొట్టుకోవడం మొదలవుతుంది. ఈ వారంలో మీ కడుపులోని బిడ్డ కంది పప్పు సైజులో ఉంటాడు.

4. 7 వ వారం

ఇప్పుడు మీ కడుపులోని బిడ్డ ఎదుగుదల వేగంగా జరగడం మొదలవుతుంది. ఇప్పుడు మీ కడుపులోని బిడ్డ సైజు గుగ్గిళ్ళ గింజ అంత ఉంటుంది.

5. 8 వ వారం

ఇప్పుడు మీ కడుపులోని బిడ్డ మనిషి ఆకారంలో ఎదగడం ప్రారంభిస్తాడు. కదలికలు మొదలవుతాయి. కడుపులో బిడ్డ చాలా చిన్నగా ఉంటాడు కాబట్టి ఆ కదలికలు మీరు తెలుసుకోలేరు. ఈ వారంలో మీ కడుపులోని బిడ్డ ఓకే చిక్కుడు గింజ సైజు లో ఉంటాడు.

 

6. 9 వ వారం

ఇప్పుడు మీ కడుపులోని బిడ్డ గుండె చప్పుడు ను మీరు వినచ్చు. ఈ వారంలో మీ కడుపులోని బిడ్డ ఒక ద్రాక్ష సైజులో ఉంటాడు.

7. 10 వ వారం

ఈ వారంలో మీ కడుపులోని బిడ్డ బరువు 4 గ్రాములు ఉంటుంది. సైజు ఆలివ్ పండంత ఉంటుంది.

8. 11 వ వారం

మీ కడుపులోని బిడ్డ ఈ వారం ఒక పెద్ద అల్లం సైజు  అంత ఎదిగి ఉంటాడు.

9. 12 వ వారం

మీ కడుపులోని బిడ్డ చేతి వేళ్ళు, కాళ్ళ వేళ్ళు ఏర్పడుతాయి. అంజీర పండు సైజులో ఉంటాడు.

10. 13 వ వారం

శరీరంలో అంతర్భాగాలన్నీ ఏర్పడి ఉంటాయి. నిమ్మకాయ సైజు లో ఉంటాడు

11. 14 వ వారం

ఈ వారం మీ కడుపులోని బిడ్డ స్వర పేటిక ఏర్పడుతుంది. కడుపులోని బిడ్డ సైజు చిక్కుడు కాయంత పొడవు ఉంటుంది.

12. 15 వ వారం

ఈ వారానికి మీ కడుపులోని బిడ్డ అవయువాలన్నీ పూర్తిగా ఏర్పడుతాయి. కడుపులోని బిడ్డ బత్తాయి సైజు లో ఉంటాడు.

13. 16 వ వారం

కడుపులోని బిడ్డ ఎదుగుదల వేగం పుంజుకుంటుంది. ఈ వారం కడుపులోని బిడ్డ ఒక ఆపిల్ పండు సైజులో ఎదుగుతాడు.

14. 17 వ వారం

ఈ వారంలో కడుపులోని బిడ్డ సాలిడ్ ఫుడ్ తీసుకోవడం మొదలు పెడుతాడు. ఒక బెర్రీ పండు సైజులో ఎదిగి ఉంటాడు.

15. 18 వ వారం

ఈ వారంలో మీకు కదలికలు తెలుస్తూ ఉంటాయి. మీ కడుపులోని బిడ్డ క్యాప్సికమ్ సైజులో ఎదిగి ఉంటాడు.

16. 19 వ వారం

ఈ వారంలో మీకు వేవిళ్లు, మార్నింగ్ సిక్నెస్ పూర్తిగా తగ్గిపోతాయి. మీ కడుపులోని బిడ్డ ఇప్పుడు ఒక పెద్ద టమాటో సైజు లో ఉంటాడు.

17. 20 వ వారం

ఈ వారంలోనే మీ కడుపులోని బిడ్డకు లింగం ఏర్పడుతుంది. అరటి పండు సైజులో బిడ్డ ఉంటాడు.

18. 21 వ వారం

ఈ వారం మీ కడుపులోని బిడ్డ 360 గ్రాముల బరువుంటాడు. క్యారట్ సైజులో ఎదిగి ఉంటాడు.

19. 22 వ వారం

ఇప్పుడు మీ కడుపులోని బిడ్డ నిద్ర వేళలను పాటిస్తాడు. రోజులో కొంత సమయం పాటు మీకు కదలికలు తెలుస్తు ఉంటాయి. మిగతా సమయంలో కడుపులోని బిడ్డ ఏ కదలికలు ఉండవు, ఆ సమయంలో కడుపులోని బిడ్డ నిద్రపోతుంటాడు. ఈ వారంలో బిడ్డ ఒక కీరా దోసకాయ సైజులో ఉంటాడు.

20. 23 వ వారం

ఇప్పుడు మీ కడుపులోని బిడ్డ ఒక పెద్ద మామిడి కయ సైజు లో ఉంటాడు. మీ గుండె చప్పుడును, మాటలను వినగలడు.

21. 24 వ వారం

ఈ వారంలో బిడ్డ పూర్తి ఆకారాన్ని ఏర్పరుచుకుంటాడు. ఇప్పుడు కడుపులోని బిడ్డ మొక్కజొన్న సైజులో ఉంటాడు.

22. 25 వ వారం

ఇప్పుడు మీ కడుపులో బిడ్డ బీట్ రూట్ సైజులో ఉంటాడు. కదలికలు వేగంగా ఉంటాయి. అప్పుడప్పుడు తంతుంటాడు.

23. 26 వ వారం

ఈ వారానికి మీ కడుపులోని బిడ్డ ఒక పెద్దా జామ పండు సైజులో ఉంటాడు.

24. 27 వ వారం

ఇప్పుడు మీ కడుపులోని బిడ్డ మెదడు చేయడం ప్రారంభిస్తుంది. అన్నిటిని గ్రహిస్తూ ఉంటాడు. దానిమ్మ పండు సైజులో ఉంటాడు.

25. 28 వ వారం

కడుపులోని బిడ్డ రోగ నిరోధక శక్తి పెరగడం వేగం పుంజుకుంటుంది. కడుపులోని బిడ్డ సైజు ఒక పెద్ద వంకాయ అంత ఉంటుంది.

26. 29 వ వారం

ఇప్పుడు కడుపులోని బిడ్డ ఎక్కిళ్ళు పడడం మొదలు పెడుతాడు. క్యాబేజి సైజులో ఉంటాడు.

27. 30 వ వారం

ఇప్పుడు కడుపులోని బిడ్డ బలంగా తయారయ్యి ఉంటాడు. ఒక పెద్ద కాలీఫ్లవర్ సైజులో ఉంటాడు.

28. 31 వ వారం

 

ఇప్పుడు మీ కడుపులోని బిడ్డ సైజు డ్రాగన్ ఫ్రూట్ అంత ఉంటుంది.

29. 32 వ వారం

ఇప్పుడు మీ కడుపులోని బిడ్డ బరువు సుమారు 1 కేజి ఉంటుంది. ఒక కర్బుజా సైజులో బిడ్డ ఎదిగివుంటాడు.

30. 33 వ వారం

ఈ వారానికి మీ కడుపులోని బిడ్డ ఊపిరి తిత్తులు పూర్తి బలంగా ఏర్పడిపోయి ఉంటాయి. బిడ్డ సైజు పైన్ ఆపిల్ అంత ఉంటుంది.

31. 34 వ వారం

ఇప్పుడు మీ కడుపులోని బిడ్డ సైజు ఒక పెద్ద దోస పండంత ఉంటుంది.

32. 35 వ వారం

బిడ్డ పూర్తి అవయవాలతో కిరిని పండంత సైజులో ఉంటాడు.

33. 36 వ వారం

బిడ్డ వినికిడి శక్తి పూర్తిగా అభివృద్ధి చెందుతుంది. బిడ్డ ఇప్పుడు టెంకాయ సైజులో ఉంటాడు.

34. 37 వ వారం

ఇప్పుడు మియు కడుపులోని బిడ్డ సైజు కంద గడ్డ అంత ఉంటుంది.

35. 38 వ వారం

ఈ వారంలో కడుపులోని బిడ్డ సైజు పుచ్చకాయంత ఉంటుంది.

36. 39 వ వారం

ఈ వారం లో బిడ్డ పూర్తి ఎదుగుదలతో ఉంటాడు. గుమ్మడి సైజులో ఉంటాడు.

37. 40 వ వారం

పనస పండు సైజులో మీ బిడ్డ బయటకు రాడాని కి సిద్ధంగా వున్నాడు. 

Click here for the best in baby advice
What do you think?
0%
Wow!
0%
Like
0%
Not bad
0%
What?
scroll up icon