Link copied!
Sign in / Sign up
12
Shares

బిడ్డ ముందు తల్లితండ్రులు చేయకూడని 4 పనులు


భార్య భర్తలు ఏకాంతంలో అనేకమైన పనులు చేస్తువుంటారు. అందులో ఏ సమస్య ఉండదు ఎవరు అడ్డు రారు. కానీ బిడ్డ పుట్టాక ఆ ఏకాంతం  కాస్త కొంచెం కొంచెంగా కోల్పోతారు. ఇంతకముందులా అన్ని పనులు ఇప్పుడు చేయలేరు. తల్లి తండ్రులుగా మీరు బిడ్డ ముందు చేయలేని చేయకూడని పనులేంటో ఇక్కడ చూడండి…

1. అరుచుకోవడం

ఏ దంపతులకైనా అనేక విషయాల మీద భిన్నమైన అభిప్రాయలు ఉండడం సహజం. ఎవరి వాదనను వారు సమర్ధించుకునే ప్రక్రియలో చిన్న గొడవలు మొదలవుతాయి. ఆ గొడవ కాస్త మాట్లాడుకోవడం నుండి అరుచుకోవడం దాకా వెళుతుంది. ఇది మీరు మాత్రమే ఉన్నప్పుడు అయితే సమస్య లేదు. కానీ మీకో పసి బిడ్డ ఉంటె తన ముందు ఇవన్నీ చేయకండి. పసి బిడ్డలు మీరు అరుచుకోవడాన్ని అర్ధం చేసుకోలేరు. ఏదో ప్రమాదం జరుగుతుంది అనుకుని భయపడుతారు. అది వారిని మానసికంగా గాయపరుస్తుంది.

2. టీవీ

బిడ్డతో ఉన్నప్పుడు, లేదా బిడ్డకు పాలు ఇస్తున్నప్పుడు మీరు టీవీ చూస్తున్నారా? అయితే మీరు కొంచెం ఆలోచించాలి. మీరు టీవీ చూస్తున్నప్పుడు మీతో పాటు బిడ్డ కూడా గమనిస్తూ ఉంటాడు. మీరు టీవీ లో భయంకరమైన శబ్దాలతో, అరుపులతో వేగంగా కదులుతున్న దృశ్యాలను చూస్తూ ఉంటె, అవి మీ బిడ్డ మీద ప్రభావం చూపిస్తుంది. మీరు బిడ్డతో ఉన్నప్పుడు అలాంటివి టీవీ లో చూడకపోవడం మంచిది.

3. సౌండ్

మీరు కారులో కానీ లేదా ఇంట్లో కానీ పాటలు వినడానికి ఇష్టపడుతారా? పాటలు వినడం వరకు ఏ సమస్య లేదు. కానీ బిడ్డ మీ పక్కనున్నప్పుడు పెద్ద సౌండుతో పాటలు వినడం లాంటివి చేయకండి. అది బిడ్డకు మంచిది కాదు. బిడ్డ కర్ణబేరి అంత పెద్ద సౌండ్ వినగలిగేలా నిర్మాణం అయ్యుండదు. ఇది బిడ్డకు చాలా ప్రమాదం.

4. మొబైల్

మీరు బిడ్డతో ఉన్నప్పుడు మొబైల్ ను వాడడం తగ్గించండి. మొబైల్ వాడడం ద్వారా అధికంగా విడుదలయ్యే రేడియేషన్ బిడ్డకు మంచిది కాదు. అలాగే బ్రెస్ట్ ఫీడింగ్ సమయంలో కూడా మొబైల్ దగ్గరుంచుకోకండి. అది బిడ్డకు చాలా హానికరం. 

Tinystep Baby-Safe Natural Toxin-Free Floor Cleaner

Click here for the best in baby advice
What do you think?
0%
Wow!
0%
Like
0%
Not bad
0%
What?
scroll up icon