Link copied!
Sign in / Sign up
26
Shares

బిడ్డ గుండె బలంగా ఆరోగ్యంగా ఉండాలంటే ప్రెగ్నన్సీ సమయంలో తీసుకోవాల్సిన 5 ఆహారాలు

మీరు ప్రేగ్నన్ట్ గా ఉన్నప్పుడు తీసుకునే ఆహరం మీకు పుట్టబోయే పిల్లల మీద చాలా ప్రభావం చూపిస్తుంది. అందుకే సాధారణంగా కన్నా ప్రేగ్నన్ట్ గా ఉన్నప్పుడు మీరు తీసుకునే ఆహరం విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. మీరు ఎలాంటి ఆహరం తీసుకుంటున్నారు అనే దాని మీదే మీ బిడ్డ ఆరోగ్యం ఆధారపడివుంటుంది. ఈ మధ్య పిల్లలలో పుట్టుకతోనే అనేక లోపాలు చోటు చేసుకుంటున్నాయి. అందులో ముఖ్యమైనది గుండె సమస్యలు. అవి మీ పుట్టబోయే బిడ్డకు రాకుండా ఉండాలంటే మీరు  ప్రెగ్నన్సీ సమయంలో తీసుకోవాల్సిన ఆహారాలు ఇవే…

1. తృణధాన్యాలు

బార్లీ, గోధుమలు, రాగులు, ముడి బియ్యం, సజ్జలు, జొన్నలు లాంటి తృణధాన్యాలలో మీకు కావాల్సిన ప్రోటీన్లు, పోషకాలు పుష్కలంగా ఉంటాయి.  వీటిని మీరు ప్రెగ్నన్సీ సమయంలో తప్పకుండా తీసుకోండి. ఇవి మీ గుండెతో పాటు మీ బిడ్డ గుండెకు కూడా మేలు చేస్తాయి.

2. ప్రోటీన్లు

గుండె ఆరోగ్యంగా ఉండాలంటే పుష్కలమైన ప్రోటీన్లు కావాలి. అందుకే మీరు ప్రెగ్నన్సీ సమయంలో ప్రోటీన్లతో నిండిన గుడ్లను, మాంసాహారాలను తప్పకుండా తీసుకోండి. ఇవి బిడ్డ గుండెకు చాలా మేలు చేస్తాయి. ఒకవేళ మీరు శాఖాహారులైతే పన్నీర్ లాంటి పాల ఉత్పత్తులు, పప్పు దినుసులు, లాంటి వాటిని ఆహారంలో చేర్చుకోండి.

3. పాల ఉత్పత్తులు

పాలు, పెరుగు, మజ్జిగ లాంటి పాల ఉత్పత్తులు మీకు చాలా అవసరం. ఇందులో మీ బిడ్డ గుండె బలంగా ఆరోగ్యంగా ఉండడానికి కావాల్సిన కాల్షియమ్ మరియు ఇతర పోషకాలు ఉంటాయి. వీటిని తప్పనిసరిగా ప్రెగ్నన్సీ సమయంలో మీ ఆహారంలో చేర్చుకోండి.

4. ఆకు కూరలు

ఆకుకూరలలో మీకు ఫైబర్స్, ఐరన్, వివిధ విటమిన్స్ పుష్కలంగా ఉంటాయి. అందుకే మీ రోజు తీసుకునే ఆహారంలో తప్పనిసరిగా ఉండాలి. ఏవి మీ బిడ్డ గుండెకు చాలా మేలు చేస్తాయి.

5. డ్రై ఫ్రూట్స్

జీడీ పప్పు, బాదం పప్పు, ఎండు ద్రాక్ష, పిస్తా లాంటి డ్రై ఫ్రూట్స్ లో పుష్కలంగా పోషకాలు ఉంటాయి. అవి మీ గుండెకు, మీ బిడ్డ గుండెకు చాలా అవసరం. అందుకే మీరు వీటిని కూడా మీ ఆహారంలో చేర్చుకోవాలి.  

Click here for the best in baby advice
What do you think?
0%
Wow!
0%
Like
0%
Not bad
0%
What?
scroll up icon