Link copied!
Sign in / Sign up
19
Shares

భోజనం చేసిన తర్వాత రాత్రి పడుకునేముందు మహిళలు చేయాల్సిన 5 పనులు..

మీకు కావాల్సిన సమాచారాన్ని అందిస్తున్నందుకు మర్చిపోకుండా మా టైనీ స్టెప్ తెలుగు వెబ్ సైట్ ను ఫాలో అవుతున్న ప్రతి మహిళకు పేరుపేరున  ధన్యవాదాలు. మహిళలు ఉదయం నిద్రలేచిన దగ్గరి నుండి రాత్రి పడుకునేవరకు ఇంటి పనులు, పిల్లలు, భర్త, అత్తమామలకు కావాల్సిన ప్రతి ఒక్కటి దగ్గరుండి చూసుకుంటూ అలసిపోతుంటారు. ఇలాంటప్పుడు తమ ఆరోగ్యాన్ని అంతగా పట్టించుకోరు. అటువంటి మహిళల కోసం ఇక్కడ కొన్ని చిట్కాలు, మీకు నచ్చితే అందరికీ SHARE చేయండి…

సోంపు

ఇది చూడటానికి చిన్నదే అనిపించవచ్చు కానీ మీ ఆరోగ్యాన్ని చాలా బాగా కాపాడుతుంది. ప్రతి రోజూ భోజనం చేసిన తర్వాత ఒక టీ స్పూన్ సోంపును ఎటువంటి చక్కర తీపి పదార్థాలు లేకుండా తీసుకోవడం వలన త్వరగా జీర్ణమవుతుంది, మీ బరువును తగ్గించివేస్తుంది, గుండె బాగా పనిచేసేలా తోడ్పడుతుంది. నోట్లో బాక్టీరియా లేకుండా దూరం చేస్తుంది.

వెంటనే పడుకోకండి

పనులన్నీ ఒకరే చేయడం వలన మీ శరీరం త్వరగా అలసిపోతుంది, అందుకని భోజనం చేసిన వెంటనే కాసేపు నడుం వాలుద్దాం అని పడుకుని వెంటనే నిద్రలోకి జారుకుంటారు. ఇలా చేయడం వలన మీరు తీసుకున్న ఆహారం త్వరగా జీర్ణం కాదు మరియు శరీరంలో కొవ్వు శాతం పెరుగుతుంది కూడా. అందుకని ఐదు నిముషాలు కూర్చొని ఆ తర్వాత కొద్దిసేపు అటుఇటు నడవటం మంచిది.

లో దుస్తులు

మగవాళ్ళు తమ ఒంటిపై అన్ని దుస్తులు లేకపోయినా ఉండగలరు, కానీ మహిళలు అలా కాదు కదా. అందుకని కనీసం  ఎండాకాలంలో నైట్ డ్రస్సులు ధరించడం, పడుకునేముందు లో దుస్తులు తీసివేసి పడుకోవడం వలన మీ శరీరానికి కాస్త గాలి తగిలి హాయిగా ఉంటుంది. ఇది మీకు తెలిసే ఉంటుంది కానీ మేం మీకు చెప్పాల్సిన బాధ్యత అనుకుంటున్నాం.

ఫ్రూట్స్

మహిళ గొప్పదనం ఏమిటంటే తనకన్నా తన భర్త, పిల్లల గురించే ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటుంది. ఏదైనా తక్కువ ఉన్నా సరే సర్దుకుపోగలదు. ఐతే భోజనం చేసిన కొన్ని నిముషాల తర్వాత ఆహారాన్ని త్వరగా జీర్ణం చేసే యాపిల్, అరటిపండు, పైనాపిల్, ద్రాక్ష వంటివి కనీసం కొద్దిమొత్తంలో అయినా తీసుకోండి.

టాబ్లెట్స్

ఉదయం నుండి రాత్రి పడుకునేవరకు ఏదో ఒక పనితో అలసిపోవడం వలన నడుం నొప్పి, మోకాళ్ళ నొప్పులు అంటూ ఏదో ఒక టాబ్లెట్ వేసుకోవడం చేస్తుంటారు, ఇది ప్రతి ఒక్కరి ఇంట్లో సమస్యే. అందుకని ప్రతి ఒక్క దానికి టాబ్లెట్స్ కు దూరంగా ఉండి మీ ఆరోగ్యాన్ని కాపాడుకోండి.  టాబ్లెట్స్ ఎక్కువగా తీసుకోవడం గ్యాస్ సమస్యలు తలెత్తుతాయి. మరీ ఎక్కువగా నొప్పి ఉంటే ఒక్కసారి డాక్టర్ ను వెళ్లి కలవండి.

ఇది మీకు నచ్చితే అందరికీ SHARE చేయండి

Tinystep Baby-Safe Natural Toxin-Free Floor Cleaner

Click here for the best in baby advice
What do you think?
0%
Wow!
0%
Like
0%
Not bad
0%
What?
scroll up icon