Link copied!
Sign in / Sign up
12
Shares

భోగి రోజు సాయంత్రం పిల్లల తలపై ‘రేగిపళ్ళు’ ఎందుకు వేస్తారో తెలుసుకోండి. మీ పిల్లలకు ఇలా చేయండి

కొత్త అల్లుళ్ళ రాకతో, బావ మరదళ్ల సరదా సందడితో, పొలం నుండి ఇంటికి తీసుకువచ్చిన ధాన్యంతో, పిల్లపాపల అల్లరితో, ఇంటి ముందు అందమైన రంగ వల్లికలు, బసవన్న కోలాహలం..ఇలా నాలుగు రోజుల సంక్రాంతిని ఎంతో సంతోషంగా జరుపుకుంటారు దక్షిణాది ప్రజలు. ముఖ్యంగా తెలుగువారు జరుపుకునే పెద్ద పండుగలలో సంక్రాంతి ఒకటి. ఐతే భోగి రోజు సాయంత్రం పిల్లల తలపై రేగిపళ్ళు ఎందుకు వేస్తారు, ఇలా వేయడం వెనుక రహస్యం ఏంటో తెలుసుకుందాం..

భోగి మంటలు ఎందుకు వేస్తారు..!

మనం అందరు భోగి రోజున ఇంట్లో స్టోర్ రూమ్ లో ఉన్న పనికిరాని వస్తువులు, కర్రలు, చెక్కలు మరియు తాటి ఆకులతో భోగి మంటలు వేయడం చూసే ఉంటారు. ఇలా ఎందుకు వేస్తారో మీకు తెలుసా..! చలికాలంలో వచ్చే ఈ పండుగలో ఉత్తరాయణం ముందు రోజుకి చలి ఎక్కువగా ఉంటుంది, ఈ చలిని తట్టుకోవడం కాస్త కష్టమే. ఈ చలి నుండి బయటపడేందుకు మంటలు వేసి భగభగమండే ఆ సెగల నుండి చలి కాచుకోవడం వలన భోగి మంటలు అని పిలవడం జరుగుతోంది.

భోగి రోజు సాయంత్రం పిల్లల తలపై రేగిపళ్ళు

పిల్లలు ఆరోగ్యంగా ఉండాలని వారికి ఎటువంటి ఆటంకాలు ఎదురుకాకుండా సంతోషంగా, ఆనందంగా , నవ్వుతూ ఉండాలని భోగి రోజు ఉదయం లేదా సాయంత్రం పిల్లల తలపై రేగిపళ్ళు వేసి ఆశీర్వదీస్తుంటారు. ఇలా చేయడం వెనుక ఒక రహస్యం ఉంది. భోగిపళ్ళ ఆశీర్వాదాన్ని సాక్షాత్తు ఆ శ్రీమన్నారాయుడి ఆశీస్సులుగా భావిస్తారు. పిల్లల తలపై వేసే రేగిపళ్ళలో రేగిపళ్ళు, చామంతి పూలు, బంతి పూరేకులు, నాణెములు ఒక పళ్లెంలో కలిపి వేయాలి. ఇలా రేగిపళ్ళు వేసేదానినే భోగిపళ్లు అని అంటారు.

గాలిపటాలు ఎగురవేస్తున్నారా..!

అలాగే సంక్రాంతి పర్వదినాలలో గాలిపటాలు లేదా పతంగులు ఎగురవేయడం చాలాచోట్ల ఆనవాయితీగా వస్తోంది. గాలిపటాలకు కట్టే దారాలు తెగిపోవడం వలన పక్షులకు తగిలడం లేదా టూ వీలర్ వాహనాలపై వెళ్తున్న వారికి ఇబ్బందికరంగా ఉండి ప్రమాదాలకు దారితీస్తోంది. కాబట్టి తల్లితండ్రుల పర్యవేక్షణలో గాలిపటాలు ఎగురవేసేలా జాగ్రత్తగా చూస్కోండి. సంక్రాంతిని సంతోషంగా జరుపుకోండి..

టైనీ స్టెప్ తరపున అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు..  
Click here for the best in baby advice
What do you think?
0%
Wow!
0%
Like
0%
Not bad
0%
What?
scroll up icon