Link copied!
Sign in / Sign up
2
Shares

భావ ప్రాప్తిని ఎక్కువ సేపు అనుభవించాలంటే శృంగార సమయంలో ఇలా చేయాలి?

శృంగారంలో పాల్గొనే అందరూ భావప్రాప్తిని కోరుకుంటారు. భావప్రాప్తిని అనుభవించాలనుకుంటారు. కానీ మగవారిలాగా స్త్రీలు శృంగారంలో పాల్గొన్న ప్రతి సారి భావప్రాప్తిని పొందలేకపోవచ్చు. భావప్రాప్తి పొందిన అది చాలా తక్కువ సేపు ఉండచ్చు. అందుకే మీ భావప్రాప్తిని ఎక్కువ సేపు కొనసాగించడానికి ఇలా చేయండి…

1. వ్యాయామం

మీ యోని ప్రాంతంలోని కండరాల పై ప్రభావం చూపించేలా, మీరు చేసే వ్యాయామం భావప్రాప్తి ఎక్కువ సేపు ఉండేలా చేస్తుంది. కండరాలు గట్టి పడడం వలన, భావప్రాప్తి సమయంలో వ్యాకోచ సంకోచాలు ఎక్కువ సేపు ఉంటాయి. భావప్రాప్తిని ఎక్కువ సేపు అనుభవించచ్చు.

2. దాని గురించి ఆలోచించకండి

శృంగార సమయంలో భావప్రాప్తి జరుగుతుందా లేదా అని ఆలోచిస్తూవుండడం, మీ మెదడు మీద వత్తిడిని పెంచుతుంది. సరైన భావప్రాప్తిని పొందలేరు. అందుకే దాని గురించి ఎక్కువగా ఆలోచించకండి, ప్రశాంతగా ఉండండి. శృంగారాన్ని ఆనందించండి, భావప్రాప్తి ఎక్కువసేపు ఉంటుంది.

3. వేడితో, చల్లదనంతో

మీ యోనిని, యోని చుట్టు ఉన్న ప్రాంతాన్ని వేడి టవల్ తో కాసేపు తర్వాత చల్లని టవల్ తో కాసేపు మర్దన చేస్తూవుండండి. ఇలా తరచూ చేయడం వలన మీ యోని ప్రాంతాన్ని సున్నితంగా మారుస్తుంది. భావప్రాప్తి ఎక్కువ సేపు కొనసాగుతుంది.

4. క్లిటోరిస్

మీలో భావప్రాప్తిని కలిగించేది, మీ యోనిలోని క్లిటోరిస్. శృంగార సమయంలో దీని మీద జరిగే రాపిడి మీకు భావప్రాప్తిని కలిగిస్తుంది.  అందుకే శృంగారంలో దీని మీద రాపిడి జరిగేలా చూసుకోండి.  

Click here for the best in baby advice
What do you think?
0%
Wow!
0%
Like
0%
Not bad
0%
What?
scroll up icon