Link copied!
Sign in / Sign up
9
Shares

భార్యను భర్త ఎంత గొప్పగా ప్రేమిస్తాడో తెలిపే వీడియో : ఆలుమగలు తప్పక చూడండి ❤️❤️👏👏

భార్యాభర్తల బంధం ఈ సృష్టిలోనే గొప్పది. ఆ బంధాన్ని వేరే బంధంతో పోల్చలేం. ఎవరో ముక్కూ మొహం తెలియని ఓ అమ్మాయి ఒకరి ఇంట్లో అడుగుపెడుతుంది. ఇక, తన మిగతా జీవితమంతా ఆ ఇంట్లోనే గడపాలి. ఎన్నో అనుమానాలు, భయాలతో మెట్టినింట్లో అడుగు పెడుతుంది. కాని.. ఆ అమ్మాయికి జీవితాంతం తోడుగా ఉంటూ తనతో జీవితాన్ని పంచుకోవాల్సింది తన భర్తే. అవును, ఆ భర్తతోనే తన జీవితాన్నంతా పంచుకోవాలి. ఆ భర్తలోనే తన అమ్మను, నాన్నను, తోబుట్టువులను చూసుకోవాలి. అందుకే... భార్యాభర్తల బంధం అనేది చాలా గొప్పది అని చెబుతుంటారు పెద్దలు.

ఇప్పుడు మీరు చూడబోయే ఈ వీడియో కూడా భార్యాభర్తల బంధం గురించి గొప్పగా చెబుతుంది. నిజానికి ఇది ఏక్ హీరా అనే యాడ్. అంటే.. డైమాండ్స్ కు సంబంధించిన యాడ్. కాని.. భార్యాభర్తల కోణంలో

తీసి యాడ్ ను సక్సెస్ చేశారు. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నది.

అసలు ఆ వీడియోలో ఏముందంటే...

Video CC : Ek Heera

ఈ వీడియోను భర్త కోణంలో చిత్రీకరించారు. ఓ భర్త తన భార్య గురించి ఎలా ఆలోచిస్తాడు. భార్య తనతో లేకపోయినా, ప్రపంచం ఆగిపోదు కదా అనుకుంటాడు. సూర్యుడు ఉదయించడం ఆపేస్తాడా? సూర్యుడు అస్తమించడం ఆపేస్తాడా? మన పిచ్చిగాని... భార్య భర్త దగ్గర లేకుంటే ఏం ఆగిపోదు. అని అలోచిస్తుంటాడు భర్త.

అయితే.. భార్య భర్త దగ్గర లేకపోయినా జీవితం గడుస్తుంది కాని అది ఎటువంటి జీవితం అనేది తెలుసుకోవాలనే పరద్యానంలోకి వెళ్లిపోతాడు భర్త.

అయితే.. భార్య లేని జీవితం ఒక జీవితమేనా అని అనుకుంటాడు. కాని.. తనకో మంచి సర్ ప్రైజ్ ఇవ్వాలనుకుంటాడు. ఆ సర్ ప్రైజ్ ఓ జెమ్ అయితే బాగుంటుందనుకున్నాడు. అందుకే మంచి డైమాండ్స్ తో చేసిన ఇయర్ రింగ్స్ ను తన భార్యకు గిఫ్ట్ గా ఇస్తాడు. ఆ గిఫ్ట్ వాళ్ల బంధానికి ప్రతీకగా నిలుస్తుంది. 

నిజానికి.. ఏ జెమ్స్, ఏ జూవెల్స్ కూడా భార్య కంటే అందంగా ఉంటాయా? భార్య కంటే వాటికి ఎక్కువ విలువ ఉంటుందా చెప్పండి.

Tinystep Baby-Safe Natural Toxin-Free Floor Cleaner

Click here for the best in baby advice
What do you think?
0%
Wow!
0%
Like
0%
Not bad
0%
What?
scroll up icon