Link copied!
Sign in / Sign up
45
Shares

భార్యలు చెప్పే ఈ 6 విషయాలు అంటే భర్తలకు చాలా ఇష్టం.. అవేంటో మీరే చూడండి

పాత రోజులు వదిలేయండి. ఇది 21వ శతాబ్దం. ఈ జనరేషనే వేరు. ముఖ్యంగా ఈకాలం భార్యాభర్తల గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. భర్తతో పాటు భార్య కూడా అన్ని పనుల్లో సమానంగా దూసుకెళ్తున్న రోజులివి. ఇంటి పని, వంట పని దగ్గర నుంచి డబ్బుల సంపాదన వరకు భార్య.. భర్తకు సమానంగా, తోడుగా నిలుస్తోంది. అంటే భార్యాభర్తలు ఇద్దరు మల్టీటాస్కర్లు అయిపోతున్నారు. అయితే.. మన పేరెంట్స్, మన తాతయ్య, నానమ్మ, అమ్మమ్మలు పిల్లలను ఎలా మేనేజ్ చేశారో ఎప్పటికీ మనకు అర్థం కాదు.

అయితే.. ఇప్పటి రోజులు వేరు. ఈరోజుల్లో భర్తలు కూడా భార్యలను అర్థం చేసుకుంటున్నారు. మరీ అంత మొండిగా ఏమీ ఉండట్లేదు. ఎలాగూ భార్యభర్తలు ఇద్దరూ ఉద్యోగులే. అందుకే.. అప్పుడప్పుడు భార్యకు చేదోడు వాదోడు గానూ ఉండే భర్తలు కోకొల్లలు.  భర్తకు కాకపోతే భార్యకు పనులు ఎవరు చేసి పెడతారు చెప్పండి. భార్య అవసరాలు భర్తకు కాకపోతే ఇంకెవరికి తెలుస్తాయి. అందుకే.. భర్తలకు కొంచెం ఇబ్బంది అనిపించినా.. చేయక తప్పదు. అప్పుడే వాళ్ల సంసారం నిండుగా ఉంటుంది.

సరె.. ఇప్పుడు మనం నిజాయితీగా.. భార్యల కోసం భర్తలు చేసే ముఖ్యమైన పనులేంటో తెలుసుకుందాం పదండి...

వంట పని

భార్య ఎప్పుడైనా ఆఫీసు నుంచి ఇంటికి ఆలస్యంగా వచ్చినప్పుడు ఖచ్చితంగా ఆ రాత్రి వంట వండటమంటే ఎంతో కష్టం. కాని.. కిచెన్ లో గరిటె తిప్పే భర్తలకైతే అది చిటికెలో పని. ఒకవేళ భార్య ఆఫీసు నుంచి ఇంటికి రావడం లేటయితే.. డిన్నర్ రెడీ చేసి పెడతారు. అయితే.. కొంతమంది భర్తలు ఆఫీసు నుంచి వచ్చాక కూడా గరిటె తిప్పాల్సి ఉంటుంది. అబ్బో.. ఆఫీసులో ఫుల్లు వర్క్. ఫుడ్డు వండేసేయ్.. అంటూ భార్యలకు ఆర్డర్లు వేసేవాళ్లంటే భార్యలకు చెడ్డ చిరాకుగా ఉంటుంది. అందుకే.. ఎంత బిజీబిజీగా ఆఫీసులో గడిపినా.. ఇంటికొచ్చాక గరిటె తిప్పితేనే శ్రీమతికి మీరు నచ్చుతారు. లేదంటే ఆరాత్రి ఇంట్లో యుద్ధాలే.

 వీకెండ్ లో భర్తలతో హాయిగా గడపడం

వీకెండ్ వస్తే చాలు.. భార్య తన భర్తతో ఆ వారంలో జరిగిన విషయాలన్నీ తన చాతి మీద పడుకొని చెప్పాలనుకుంటుంది. తన భర్త తనతో కనీసం వారంలో ఒక్కసారైనా గడపాలనుకుంటుంది. కాని.. భర్త మాత్రం వారం రోజుల్లో లేని బిజీ.. ఆ వీకెండ్ లోనే ఉన్నట్లు బిల్డప్ ఇవ్వడం లాంటివి చేస్తే భార్యకు అస్సలు నచ్చదు. వారంలో కనీసం కొన్ని గంటలైనా భర్త తనతో స్పెండ్ చేయాలని ఏ భార్య అయినా కలలుకంటుంది. ఆ కలలను వమ్ము చేసే భర్తంటే ఏ భార్యకైనా చిరాకే మరి.

ప్రెగ్నెన్సీ సమయంలో జాగ్రత్తగా చూసుకోవాలి

ప్రెగ్నెన్సీ అనేది మహిళకు ఓ వరం. తన జన్మకు సార్థకత అనేది ఓ బిడ్డకు జన్మనిచ్చినప్పుడే కలుగుతుంది. అటువంటి సమయాల్లో ఏ భార్య అయినా.. తన భర్తను తన దగ్గరే ఉండేలా చూసుకుంటుంది. కాని.. కొంతమంది భర్తలు భార్య ప్రెగ్నెన్సీతో ఉన్నా.. పట్టించుకోకుండా తమ పనేదో తాము చూసుకుంటుంటారు. అటువంటి భర్తలంటే భార్యలకు అచ్చలు నచ్చదు. ఎంత బిజీగా ఉన్నా.. ప్రెగ్నెన్సీ సమయంలో భార్యతో ఎక్కువ సమయం గడుపుతూ తనను, తన కడుపులో పెరుగుతున్న బిడ్డను కంటికి రెప్పలా కాపాడుకునేవాడంటేనే భార్యకు నచ్చుతుంది.

ప్రెగ్నెన్సీ సమయంలో బరువుపై శ్రద్ధ

ప్రెగ్నెన్సీ సమయంలో మహిళలు ఖచ్చితంగా బరువు పెరుగుతారు. అయితే.. మీ భర్తలు మీ బరువుపై మీమ్మల్ని ఆటపట్టిస్తుంటారు.  అయితే.. ప్రెగ్నెన్సీ సమయంలో వచ్చే బరువు తాత్కాలికం అయినప్పటికీ.. బరువు పెరిగినప్పుడు భర్త టీజ్ చేస్తే మాత్రం భార్యకు అస్సలు నచ్చదు.

అత్తతో సమస్య ఉన్నప్పుడు

భర్త.. భార్యతో ఎంత సఖ్యతగా ఉన్నా.. భ ర్త కుటుంబ సభ్యులు కూడా అలాగే ఉండాలని లేదు. ఉంటారని కూడా అనుకోలేము. ముఖ్యంగా భర్త తల్లితో.. భార్యకు ఎప్పుడూ గొడవలే ఉంటాయి. భర్త తల్లి వైపు మొగ్గి.. భార్యను నిందించాడనుకోండి. అటువంటి భర్తలంటే భార్యలకు మహా చిరాకు. అందుకే.. ఎటువంటి పరిస్థితుల్లోనైనా.. భార్యకు తోడుగా నిలిచేవాడినే భార్య ప్రేమిస్తుంది.. ఆరాధిస్తుంది.. ఇష్టపడుతుంది. తన మనసును ఇచ్చేస్తుంది. కాని.. చిన్న చిన్న విషయాలకు అలిగి, చిన్న చిన్న పనులు చేయడానికి కూడా బద్దకించే భర్తలంటే భార్యలకు అసహ్యం, కోపం, చిరాకు లాంటివి కలుగుతాయి. అందుకే భర్తలు భార్యలకు అనుగుణంగా మసులుకొని మీ జీవితాన్ని మూడు పువ్వులు, ఆరు కాయలుగా ఉంచుకోండి.

Tinystep Baby-Safe Natural Toxin-Free Floor Cleaner

Click here for the best in baby advice
What do you think?
0%
Wow!
0%
Like
0%
Not bad
0%
What?
scroll up icon