Link copied!
Sign in / Sign up
23
Shares

భార్యలు భర్త ముందు చేయకూడని 4 పనులు : ఇలా చేస్తే మీ ఆయనకు నచ్చదు

పతియే ప్రత్యక్ష దైవం అని అంటుంటారు మన పెద్దలు. కళ్ళ ముందున్న మీ భర్తను ప్రేమగా చూసుకుంటూ,  ఆయనను గౌరవిస్తే చాలు కనిపించని ఆ భగవంతుడు  కూడా అవసరం లేదు అని అర్థం. ఐతే ప్రస్తుతం కాలానికి తగ్గట్లుగా మనుషులలో చాలావరకు మార్పు వచ్చింది. ఇందులో కొన్ని భార్య చేసే  పనులంటే భర్తకు అస్సలు నచ్చవు. అవేంటో మీరే తెలుసుకోండి. మీ భర్తను ఇబ్బంది పెట్టకండి సంతోషంగా చూసుకోండి..

నచ్చని విషయాలు చెప్పడం

పక్కింటి వాళ్ళు అది కొన్నారు, వాళ్ళ ఆయన ఆమె కోసం ఏం తీసుకువచ్చాడో మీకు తెలుసా, మన ఎదురింటి వాళ్ళు చూడండి కొత్త ఫ్లాట్ కొనుక్కుని ఎంత సంతోషంగా ఉన్నారో అంటూ నగలు, డబ్బులు.. ఇలా ప్రతి ఒక్క విషయాన్ని చిరాకు కలిగించేలా చెప్పడం, విసుగు తెప్పించడం వంటివి పదేపదే చెప్పడం మంచిది కాదు. ఇది మీ దాంపత్య జీవితంపై ప్రభావం పడే అవకాశం ఎక్కువగా ఉంది.

అందరిముందు ఇలా అనకూడదు

ఒకప్పుడు మా ఆయన, ఏమండోయ్, మా శ్రీవారు అని ఎంతో ఆప్యాయంగా, గౌరవంగా తమ భర్తలను భార్యలు పిలిచేవారు. ఇప్పుడు కొందరు అలా పిలుస్తున్నారు లెండి. ఇలా కాకుండా మరికొందరు తమ భర్తను అందరిముందు పేరుపెట్టి పిలవడం, ఇంకొందరు ఐతే గౌరవం లేకుండా పిలవడం చేస్తుంటారు. ఒంటరిగా ఉన్నప్పుడు ఇలా పిలిస్తే ఫర్వాలేదు కానీ అందరిముందు పిలవడం వలన మీ ఆయన గౌరవాన్ని మీరే తక్కువ చేసినట్లు ఉంటుంది.

మీ ఆయనకు నచ్చని వారితో మాట్లాడటం

ఇది భార్యలకే కాదు భర్తలకు కూడా వర్తిస్తుంది. తెలియని మగవాళ్ళు/మహిళలతో గానీ మీ భర్తకు ఇష్టం లేని వారితో మాట్లాడటం వారితో చనువుగా ఉండటం మీ ఆయనకు అస్సలు నచ్చదు. ఇవే మీ దాంపత్య జీవితాన్ని దెబ్బతీస్తాయి కూడా. ఈ విషయంలో భర్త/భార్య ఒకటి లేదా రెండుసార్లు చెబుతుంటారు. ఆ మాటలు వినకపోతే వారిలో వాళ్లే బాధపడటం చేస్తుంటారు.

పిల్లల ముందు, ఇంటికి వచ్చిన వారు ముందు

ఇంట్లో పిల్లలు ఉన్నప్పుడు వాళ్ళ నాన్న గారి ముందు మీరు మీ భర్తను తక్కువగా చేసి మాట్లాడటం,  ఏది చేతకాదు అని తిట్టడం వంటివి చేయడం వలన మీ పిల్లలు కూడా మీ భర్తను లెక్కచేయరు. అలాగే ఇంటికి బంధువులు వచ్చినప్పుడు అది చేయ్, ఇలా ఎందుకు చేస్తున్నావ్ అంటూ మీ ఆయనపై అరవటం వలన మీవాళ్ళు మా అమ్మాయిదే పై చేయి అనుకున్నా ఆ తర్వాత మాత్రం మీ దాంపత్యం గురించి తప్పుగా మాట్లాడుకుంటారు.

ఐతే భార్యాభర్తలు ఒకరికొకరు అన్యోన్యంగా, ఒకరి పనిలో మరొకరు సాయం చేసుకుంటూ ఉంటే మీ దాంపత్యం హ్యాపీగా ఉంటుంది. మరి మీలో ఎంతమంది ఇలా ఉన్నారో COMMENT చేయండి. ఇది నచ్చితే మీ ఆయనకు తెలిసేలా SHARE చేయండి. 

Tinystep Baby-Safe Natural Toxin-Free Floor Cleaner

Click here for the best in baby advice
What do you think?
0%
Wow!
0%
Like
0%
Not bad
0%
What?
scroll up icon