Link copied!
Sign in / Sign up
11
Shares

భార్యల ముఖాన్ని బట్టి వాళ్ళ మనస్సులో ఏముందో భర్తలు ఈ 4 విధాలుగా తెలుసుకుంటారు..

అమ్మ నాన్నల తర్వాత ఎక్కువగా, దగ్గరగా కలిసి ఉండే బంధం భార్యాభర్తల బంధం. ఆలుమగలు ఒకరి గురించి మరొకరు అర్థం చేసుకున్నట్లుగా పెళ్లి తర్వాత మరెవరూ అర్థం చేసుకోలేరు అనేది అందరికీ తెలిసిన నిజం. అయితే భార్యల మనస్సును అర్థం చేసుకోలేరు అని చాలామంది మహిళలు అనుకుంటూ ఉంటారు. అది అస్సలు నిజం కాదు, భర్తలకు భార్యల మనస్సులో ఏముందో వాళ్ళ ముఖాన్ని బట్టి చాలా సులభంగా అర్థం చేసుకోగలరు. తెలిసినా కానీ బయటకు చెప్పరు, ఎలాగో మీరే చూడండి..

పదే పదే ఫోన్ చేస్తూ ఉంటే..

భర్త ఆఫీస్ కు వెళ్ళినప్పుడు భార్య ఎప్పుడు ఇంటికి వస్తారు అని అసలు విషయం చెప్పకుండా పదే పదే ఫోన్ చేస్తూ ఉంటే ఏదో సంతోషకరమైన వార్త అని అర్థం చేసుకుంటారు. ప్రేమ ఎక్కువైనప్పుడు కూడా ఇలాగే ఫోన్లు చేస్తూ ఉంటారట. భర్త పక్కన ఎక్కువ సమయం గడపాలని, ఆయనతో కలిసి బయటకు వెళ్లాలని ఆశపడుతూ ఉంటారు. ఇది తెలిసినా కూడా సరైన టైం లేకపోవడం వలన భర్తలు రాలేరు.

ఎంత పిలిచినా సైలెంట్ గా కూర్చొని ఉంటే..

భర్త బయట నుండి లేదా ఆఫీస్ నుండి ఇంటికి వచ్చిన తర్వాత ఎంతో ప్రేమగా పిలుస్తుంటే భార్య బెడ్ రూమ్ లోనే, సోఫాలోనే కూర్చుని ఉండి, ఆయన పిలుస్తున్నా పలకలేదంటే ఆమె అడిగినది ఇవ్వనందుకే ఇంకా కోపంగా ఉందని అర్థం చేసుకుంటాడు. చాలాసార్లు నాకు అది కావాలి, ఇది కావాలి అని చెబుతున్నా మీరు నన్ను పట్టించుకోవట్లేదు అని భార్యలు అంటూ ఉంటారు. ఆర్ధిక పరిస్థితుల వలనే ఇలా చేస్తారు కానీ, మీ ఇష్టాలు తీర్చవద్దు అని కాదు.

గలగల మాట్లాడుతుంటే..

కొందరు మహిళలు అన్నిసార్లు ఒకేవిధంగా ఉండరు, సంతోషం వచ్చినప్పుడే నోరు విప్పడం చేస్తూ ఉంటారు.  మనస్సులో ఆనందం ఎక్కువైనప్పుడే వాళ్లకు మాట్లాడాలి అనిపిస్తుంది. ఇంటికి వచ్చిన భర్త ఆమెను చూసి వెంటనే ఏంటి విషయం ఇంత ఎప్పుడు లేనిది ఇంత ఆనందంగా ఉన్నావు అని సంబరంగా అడుగుతాడు. ఇది ప్రత్యేకంగా చెప్పకపోయినా మీ ముఖంలో చిరునవ్వు చెబుతుంది.

ముఖం చికాకుగా, డల్ గా ఉంటే..

నా భార్యతో ఆనందంగా, సంతోషంగా ఉండాలని వచ్చిన భర్త హాయ్ బుజ్జి, బంగారం అని పిలుస్తుంటే మీరు చికాకుగా, డల్ గా ఉంటే మీ మనస్సులో బాధను ఆయనకు ప్రత్యేకంగా చెప్పకపోయినా కనిపెట్టగలరు. మీ ఇంట్లో వాళ్ళు గుర్తొచ్చారేమో  అని వెంటనే వాళ్ళకి ఫోన్ చేయడం నవ్వు బుజ్జి అంటూ ఆనందపరచడం, బయటకు తీసుకెళ్లడం చేస్తూ ఉంటారు. ఇది భార్యల మనస్సును భర్త చేసుకునే విధానం..

ఇలా మీ భర్త కూడా మిమ్మల్ని అర్థం చేసుకుంటారు అని మీకు అనిపిస్తే COMMENT చేయండి. అవును ఇది నిజమే అనిపిస్తే SHARE చేయండి… 

Tinystep Baby-Safe Natural Toxin-Free Floor Cleaner

Dear Mommy,

We hope you enjoyed reading our article. Thank you for your continued love, support and trust in Tinystep. If you are new here, welcome to Tinystep!

We have a great opportunity for you. You can EARN up to Rs 10,000/- every month right in the comfort of your own HOME. Sounds interesting? Fill in this form and we will call you.

Click here for the best in baby advice
What do you think?
0%
Wow!
0%
Like
0%
Not bad
0%
What?
scroll up icon