Link copied!
Sign in / Sign up
7
Shares

భార్యాభర్తల మధ్య గొడవలు, మనస్పర్థలకు కారణాలు : గొడవలు రాకుండా ఏం చేయాలో తెలుసుకోండి

భార్యాభర్తలు అంటే కుటుంబ కథా చిత్రాలలో చూపించినట్లు ఎప్పుడు అన్యోనంగా, ఆప్యాయంగా మాత్రమే కలిసి ఉండరు.  రియల్ లైఫ్ లో అప్పుడప్పుడు అలకలు, మనస్పర్థలు, గొడవలు జరుగుతూనే ఉంటాయి. ఇవి ప్రేమగా ఉన్నంత వరకు ఫర్వాలేదు కానీ మితిమీరితేనే ఇద్దరి మధ్య బంధాలు దూరం అవుతాయి. మరి ఈ గొడవలకు, మనస్పర్థలకు అసలు కారణాలు ఏంటో తెలుసుకుని మీ సంసార జీవితాన్ని హ్యాపీగా ఉంచుకోండి..

మీ మాట లెక్కచేయకపోతే..

భర్త తన మాట వినటం లేదని, నేను చెప్పే మాటలు అస్సలు లెక్కలోకే తీసుకోవడం లేదని అనవసరంగా అపార్థం చేసుకోవడం, తమలో తామే బాధపడుతూ ఓపిక నశించినప్పుడు ఆ బాధను భర్తపై చూపడం వలన ఇద్దరి మధ్య ప్రేమ దూరమై, ఇది వరకు మీరు చేసిన చిన్న చిన్న తప్పులే మీ ఇద్దరి మధ్య పెద్దవిగా కనిపించి గొడవలకు కారణం అవుతాయి. మీ భర్తకు మీరే ప్రపంచం అయినప్పుడు మీ గురించి కాకుండా దేని గురించి ఆలోచిస్తాడు. మీ మాటను ఎందుకు లెక్కచెయ్యడు.

ఆర్ధిక ఇబ్బందులు

డబ్బు..ప్రస్తుతం ప్రతి ఒక్కరినీ నడిపిస్తున్న ఇంధనం, అందరికీ అవసరమైన ఆయుధం. దీనివలనే ప్రపంచం మొత్తం మీద సగానికి సగం బంధాలు దూరమవుతున్నాయి. ముఖ్యంగా సంసార జీవితం. ఎదురింటి గొప్పగా ఉంటే, పక్కింటివాళ్ళు ఖరీదైన వస్తువులు తెచ్చుకున్నప్పుడు, చుట్టుపక్కల వాళ్ళు లగ్జరీగా బ్రతుకుతుంటే మనమెందుకు ఇలా అవస్థలు పడాలి అంటూ పెద్ద యుద్ధమే జరుగుతోంది. ఐతే భార్యను భర్త, భర్తను భార్య అర్థం చేసుకుని ఉన్నదానితో సర్దుకుంటే కలిగే సంతోషం కోట్ల డబ్బుతో కూడా సమానం కాదు.

అత్త మామలు

పుట్టింటి నుండి అత్తారింటికి వెళ్లిన అత్త-కోడళ్ల మధ్య చిన్న చిన్న తగాదాలు, ఒకరు చేసే పనులు మరొకరికి నచ్చకపోవడం అనేది అందరి జీవితంలో ఉండేవే. కానీ మీ అత్తమామలు మిమ్మల్ని కోడలిగా కాకుండా కూతురిలా చూస్కుంటే మీరు అలాగే చూస్కోండి. అలా చూసుకోకపోతే హింసించమని కాదు. కానీ వయస్సు అయిపోతున్న వారిని దూరంగా ఉంచడం కన్నా మీ ఆయనకు దగ్గరగా తమ కొడుకుని ఉంచడం భావ్యమే కదా.

పిల్లలు

ప్రస్తుత రోజుల్లో పిల్లలకు మంచి చదువు అందించడం అంటే ఎంత ఖర్చుతో కూడుకున్నదో అందరికీ తెలిసిందే. మీరు చదవలేని చదువులను, గొప్ప జీవితాన్ని అందించాలని మీ ఇద్దరికీ ఉంటుంది. కానీ, ఈ ఫీజులు భరించలేకే చాలామంది ఉన్న డబ్బుతోనే మంచి చదువును అందించే స్కూల్ కు పంపిస్తున్నారు, కానీ పిల్లలను చదువుకు దూరం చేయడం లేదు కదా. పిల్లలు స్కూల్ నుండి వచ్చాక మీ భర్త కన్నా మీరే ఎక్కువ బాధ్యత తీసుకోండి. డబ్బులు లేకపోయినా ఎంతమంది గొప్ప గొప్ప చదువులు ఉన్నత స్థానాలలో ఒక్కసారి ఆలోచించండి.

మీ ఆయనకు నచ్చని ముఖ్యమైన విషయం

చీటికీ మాటికీ భర్తను ఒకే విషయం గురించి గుచ్చి గుచ్చి అడగటం, నేనంటే మీకు ఇష్టం లేదు, ప్రేమ తగ్గిపోయింది, నా కన్నా మీ అమ్మానాన్నలే ఎక్కువ అయిపోయారు అనే మాటలు మీ భర్తకే కాదు, ఏ మగాడికి నచ్చవు. నిజం చెప్పాలంటే వారికి తలనొప్పిగా మారతాయి మరియు వారి ఆనందాన్ని దెబ్బతీస్తాయి. అందుకని ఈ మాటలు మాట్లాడకండి. ఏదైనా తప్పు చేస్తే మాత్రం ఎదురుగానే నిలదీయండి. ఎటువంటి తప్పులేదు.

మగాళ్ళంటే గొప్ప వాళ్ళని మంచి వాళ్ళని చెప్పడానికో, మహిళలు అంటే ఇలాగే ఉంటారు అని తప్పుగా అనుకోకండి. ఈ కారణాల వలనే చాలామంది దంపతుల మధ్య వస్తున్న గొడవలు మరియు మనస్పర్థలు అని చెప్పడానికే. అర్థం చేసుకుంటారని ఆశిస్తున్నాం. 

Click here for the best in baby advice
What do you think?
0%
Wow!
0%
Like
0%
Not bad
0%
What?
scroll up icon