Link copied!
Sign in / Sign up
23
Shares

భార్యాభర్తల మధ్య ఎప్పటికీ రాకూడని 3 మాటలు : మీ దాంపత్యాన్ని దెబ్బతీస్తాయి

ఏడడుగులు వేసి, మూడు ముళ్ల బంధంతో, ఇద్దరినీ ఒక్కటి చేసేదే పెళ్లి. పెళ్లి తర్వాత మగవారి జీవితం ఎలా ఉంటుందో గానీ, మహిళల జీవితంలో చాలా మార్పు   వస్తుంది. కొత్త ఇల్లు, కొత్త మనుషులు..ఇలా అన్నిటికీ అలవాటు పడి సర్దుకుపోతూ సంతోషంగా ఉండాలి. అయితే కొన్ని కొన్ని సార్లు కొంతమంది దంపతుల మధ్య గొడవలు వచ్చేలా మాటలు వస్తుంటాయి. ఆ మాటలు సరదాగా ఉంటే ఫర్లేదు కానీ మితిమీరితే మాత్రం మీ దాంపత్యంపై ప్రభావాన్ని చూపిస్తాయి. అందుకని ఈ మూడు మాటలు మీ మధ్య రాకుండా చూసుకోండి..

నువ్వు ఎప్పుడు ఇంతే ఇలాగే చేస్తుంటావ్..

సాధారణంగా ఈ మాటను ఎంత తక్కువగా వాడితే అంత మంచిది. ఏదైనా విషయంలో చిన్న తప్పు జరిగినా లేదా తెలియక చేసినా సరే  భార్యాభర్తల మధ్య వచ్చే మాట ‘నువ్వు ఎప్పుడు ఇంతే, ఇలాగే చేస్తుంటావ్, నువ్వు చేసే పని నాకు నచ్చడం లేదని అనే మాటలు అస్సలు రాకూడదు.

నువ్వు మారవా ఎన్నిసార్లు చెప్పాలి నీకు..

పైన చెప్పుకున్నట్లుగానే చాలామంది దంపతుల మధ్య వచ్చే రొటీన్ పదం ‘నువ్వు మారవా, ఎప్పుడు ఇలాగే ఉంటావా, ఎన్నిసార్లు చెప్పాలి నీకు, నీకు చెప్పి చెప్పి నాకు విసుగొస్తుంది కానీ నువ్వు మారటం లేదు, ఇలా అయితే నీతో ఉండటం కష్టం అనే మాటలు చాలా బాధను కలిగిస్తాయి. ఇద్దరి మధ్య దూరాన్ని పెంచుతాయి కూడా..

మీ వాళ్ళ లాగే నువ్వు కూడా..

ఇది ప్రతి భార్యభార్యల మధ్య ఏదో ఒక టైములో వచ్చే మాట. ఏదైనా సరిగ్గా పని చేయనప్పుడు,వారికి ఇష్టం లేని పనిచేసినప్పుడు వెంటనే ‘నువ్వు కూడా మీ వాళ్ళ లాగే ఉన్నావ్, వాళ్ళు చెప్పినట్లు వింటున్నావ్ తప్ప నా మాటలు నీ చెవ్వుకు ఎక్కట్లేదని చెప్పడం, మీ ఫ్యామిలీ మొత్తం ఇంతే అనే మాటలు ఇద్దరి మధ్య అస్సలు రాకపోవడం మంచిది. ఇటువంటి మాటలకు దూరంగా ఉండటం వలన మీ దాంపత్యం తప్పకుండ సంతోషంగా ఉంటుంది.

ఇది ప్రతి భార్యాభర్తలకు చాలా వరకు తెలిసినవే అయ్యుండవచ్చు. కరెక్ట్ అని మీరు కనెక్ట్ అయితే వెంటనే SHARE చేయండి. 

Click here for the best in baby advice
What do you think?
0%
Wow!
0%
Like
0%
Not bad
0%
What?
scroll up icon