Link copied!
Sign in / Sign up
22
Shares

భార్యభర్తల మధ్య దూరం పెరగకుండా ఉండాలంటే మహిళలు చేయాల్సిన 5 పనులు..

పెళ్లి తర్వాత భార్యాభర్తలు ఎప్పుడు ఒకరి మాటలంటే మరొకరు ఎంతో ఇష్టంగా వింటూ ఉంటారు, సంవత్సరాలు గడిచేకొద్దీ దూరం కొంచెం కొంచెం పెరుగుతూ ఉంటుంది (అందరిలో కాదులెండి). అంటే మాటలు తక్కువగా మాట్లాడటం, ఎక్కువ సమయం గడపలేకపోవడం, ఎక్కడికైనా కలిసి వెళ్ళటం లాంటివి. అయితే ఈ దూరం దంపతుల మధ్య పెరగకుండా ఉండాలంటే మహిళలు ఏం చేస్తే మంచిదో తెలుసుకోండి. మహిళలే అని కాదు, ఈ విషయంలో మగవాళ్ళు కూడా కొన్ని టిప్స్ ఫాలో అవ్వాలి. అవేంటో మీరే చూడండి..

ఇంటికి రాగానే ఇలా చేయకూడదు

మీ భర్త ఆఫీస్ నుండి ఇంటికి రాగానే ఒకే విధంగా ఆయనకు చిరాకు కలిగించేలా ప్రశ్నలు వేయడం, అదండీ ఇదండీ అంటూ ఇష్టంలేని విషయాలు చెప్పకూడదు. అందుకు బదులుగా చేతిలోని బ్యాగ్ తీసుకుని ఏమండీ కాఫీ, టీ ఏమైనా తాగుతారా..! వంటి కుశలు ప్రశ్నలు వేయడం వారికి కాస్త హాయినిస్తుంది.

కూర్చోని మాట్లాడుకోండి

ప్రతి రోజూ రాత్రి భోజనము చేసిన తర్వాత భార్యాభర్తలు కాసేపు కూర్చొని మాట్లాడటం చేయాలి. ఇలా మాట్లాడుకునేటప్పుడు ఎక్కువగా కోపం, చిరాకు, బాధ కలిగించే విషయాలు కాకుండా మీ జీవితంలో మీరు సంతోషంగా గడిపిన క్షణాలు, ఎక్కువగా నవ్వు తెప్పించిన విషయాలు మాట్లాడుకోవడం మంచిది. ఎప్పుడో జరిగిన పాత విషయాలు మాట్లాడుకోవడం వలన ఇది మీ ఇద్దరికీ కూడా మంచిది కాదు.

ఇలా సమాధానం ఇవ్వాలి

మీ భర్త మిమ్మల్ని ఏదైనా అడిగినప్పుడు లేదా మీరు మీ ఆయనను ఏదైనా అడగాలనుకున్నప్పుడు ఆ విషయం సీరియస్ ఐతే వారికి అర్థం అయ్యేలా చెప్పాలి, జోక్ చేసి మాట్లాడటం మంచిది కాదు. అలాగే ఆ విషయం గురించి అడిగినప్పుడు నిజాన్ని డైరెక్ట్ గానే చెప్పాలి, మనస్సులో ఏ మాత్రం దాచుకోకూడదు. ఇలా చేస్తే భవిష్యత్ లో మరిన్ని సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది.

పిల్లలు పుట్టాక..

చాలామంది దంపతులు చెబుతున్న ప్రకారం వారి దాంపత్య జీవితాన్ని పిల్లలు లేనప్పుడు, పిల్లలు పుట్టిన రెండేళ్ల వరకు చాలా సంతోషంగా ఉండేవారట. ఆ తర్వాత చిన్న చిన్న మనస్పర్థలు వారిని డిస్టర్బ్ చేసేవట. అయితే అసలు దాంపత్యం అంటే అర్థం ఏమిటంటే ఇక్కడ ఒకరినొకరు అర్థం చేసుకుని, అండగా నిలబడి సర్దుకుని పోవటమే. నేను ఇంటికి చూసుకుంటాను, మీరు పిల్లల్ని చూసుకోండి, నేను డబ్బు సంపాదిస్తాను నాదే పై చేయి అనుకోవడం పొరపాటు. ఇది మీ దాంపత్య జీవితంపై ప్రభావం చూపుతుంది.

నిర్లక్ష్యం చేయకూడదు అలాగే..

భార్యాభర్తలలో ఎవరు ఏది చెప్పినా సరే ముందు శ్రద్ధగా వినాలి.  ఏదైనా చెబుతుంటే దూరం వెళ్లడం, పెడచెవిన పెట్టడం వలన వారికి బాధ కలిగిస్తుంది.  అలాగే చాలామంది దాంపత్య జీవితంలో ఎదురయ్యేదే ఇది, ఆర్ధిక ఇబ్బంది. డబ్బులు సరిగ్గా పొదుపు చేయడం లేదని, వేరేవాళ్ళ సంపాదన చూసి, వారి జీవన విధానం చూసి వాళ్లలాగే మనం ఉందాం అని అనుకోవడం మీ ఇద్దరి మధ్య దూరాన్ని పెంచుతుంది. ఈ స్టేజ్ ను దాటి మీరు అర్థం చేసుకుంటే చాలు, దాంపత్య జీవితంలో మీరు విజయం సాధించినట్లే.

ఈ అందమైన జీవితాన్ని మీ దాంపత్య బంధం ద్వారా మరింత అందంగా మార్చుకోండి..   

Tinystep Baby-Safe Natural Toxin-Free Floor Cleaner

Click here for the best in baby advice
What do you think?
0%
Wow!
0%
Like
0%
Not bad
0%
What?
scroll up icon