Link copied!
Sign in / Sign up
7
Shares

భర్తలను మూడ్ లోకి తీసుకురావడానికి భార్యలు చేసే 5 సెక్సీ పనులు…

భార్య భర్తల మధ్య శృంగారం దాంపత్య జీవితానికి చాలా అవసరం. కానీ దంపతులు మధ్య జరిగే అనేక ఇతర విషయాలు,  శృంగారం మీద ప్రభావం చూపిస్తాయి.  మీ మధ్య జరిగే చిన్న చిన్న గొడవలు శృంగారానికి ఆటంకం కలిగిస్తాయి. కొన్ని సార్లు మీరు శృంగాన్ని కోరుకున్న మీ భర్తకు ఆసక్తి లేకపోవచ్చు.  అప్పుడు మీ భర్తను మూడ్ లోకి తీసుకురావడానికి మీరు చేయాల్సిన పనులేవీ….

1. రిలాక్స్ అవ్వనివ్వండి

మీ భర్తకు శృంగారం మీద ఆసక్తి లేకపోవడానికి తను అలసిపోవడం ఒక కారణం కావచ్చు. అందుకే ముందు మీ భర్తను రిలాక్స్ అవ్వనివ్వండి. అందుకు మీరు ఏమి చేయకలిగితే అది చేయండి. తనకు నచ్చిన సినిమా లేదా పాటలను ఇద్దరు కలిసి చూడండి. ఇవన్నీ మీ ఆయనకు శృంగారం మీద ఆసక్తిని కలిగిస్తాయి.

2. వంట

మగవారి హృదయంలోకి చేరుకోడానికి, వంట ఒక సాధనం. నచ్చిన ఆహారం తినడం సంతోషాన్ని కలిగించి మూడ్ ను మారుస్తుంది. మీ భర్తకు బాగా ఇష్టమైన ఆహారాన్ని వండి తినిపించండి. ఉత్సాహంగా శృంగారంలో పాల్గొంటాడు.

3. నచ్చిన దుస్తులు

మీ ఆయనకు మిమ్మల్ని కొన్ని ప్రత్యేకమైన దుస్తుల్లో చూడడానికి ఇష్టమై ఉండచ్చు. మీ ఆయన మీకు గిఫ్ట్ గా ఇచ్చిన చీర, లేదా మీ ఆయనకు ఇష్టమైన రంగు చీర ఇలా ఏదైనా. మీ ఆయనకు నచ్చిన డ్రెస్ వేసుకోవడం మీ ఆయనకు శృంగారం మీద ఆసక్తిని కలిగిస్తుంది.

4. సరదాగా మాట్లాడండి

మీ ఆయనను మూడ్ లోకి తీసుకురావడానికి మీ మాటలు మంత్రాల్లా పని చేస్తాయి. మీ ఆయనతో కాసేపు సరదాగా మాట్లాడండి. అది మీ ఆయనకు ప్రశాంతతను కలిగిస్తుంది. మీ భర్తను మూడ్ లోకి తీసుకొచ్చి శృంగారం పై ఆసక్తిని కలిగిస్తుంది.

5. మీ మొదటిసారి

మీరు మీ భర్త మొదటిసారి కలవడం ఎప్పటికి ఒక మధుర జ్ఞాపకమే. వాటి గురించి మీ ఆయనకు గుర్తుచేయండి. అప్పుడు మీ ఆయన ఎంత సరదాగా ఉండేవాడో, ఎలాంటి చిలిపి పనులు చేసే వాళ్ళో గుర్తుచేయండి. మీ ఆయన మూడ్ మారుతుంది. 

Click here for the best in baby advice
What do you think?
0%
Wow!
0%
Like
0%
Not bad
0%
What?
scroll up icon