Link copied!
Sign in / Sign up
3
Shares

భర్త సెక్స్ మూడ్స్'ను భార్య అర్ధం చేసుకోవడం ఎలా?

దంపతుల మధ్య మరింత ఆనందాన్ని, ఆరోగ్యాన్ని కలిగించే విషయం పడకగదిలో జరిగే శృంగారం. నిజానికి ఈ విషయాలు తెలుసుకోవడానికి చాలామంది సిగ్గుపడుతుంటారు కానీ అలసిపోయిన శరీరాన్ని ఎటువంటి మందులు అవసరం లేకుండా ఉత్తేజపరిచే శక్తి ఒక్క దీనికి మాత్రమే ఉంది. అయితే భర్త ఎప్పుడు శృంగారం కోరుకుంటున్నాడని భార్య తెలుసుకోవడం ఎలాగో తెలిపే గుర్తులు ఇవే…

పొగడటం మొదలు పెడతాడు

మీ ఆయనకు శృంగారం కావాలి అనుకున్నప్పుడు ఎక్కువగా ఆ రోజు పొగడ్తల వర్షం కురిపిస్తాడు. మాములుగా ఉన్నా సరే ఈ రోజు ఎందుకో చాలా అందంగా ఉన్నావు అని మీరు సిగ్గుపడేలా పొగిడేస్తుంటారు. ఇలా ప్రతి భర్త చేస్తాడని కాదు గానీ చాలావరకు ఇలానే చేస్తారు.

ఈ చీర నాకు చాలా బాగుంది

ప్రతి మగాడు తన భార్యతో ఈ రోజు నాకు శృంగారం కావాలి అని అడగడానికి చాలా ఇబ్బంది మరియు సిగ్గు పడుతుంటాడు. అందుకోసం మీరు ఆ రోజు కట్టుకున్నది పాత చీరే లేదా డ్రస్ అయినా ఈ రోజు నువ్వు కట్టుకున్నది చీర చాలా బాగుంది, ఈ డ్రస్ లో నువ్వు చాలా అందంగా ఉన్నావ్ తెలుసా అని చెబుతారు.

మీకు దగ్గరగా వస్తుండటం

ప్రతి రోజులా కాకుండా అతనికి శృంగారం కావాలనిపించిన్నప్పుడు మీపై చేతులు వేస్తుండటం, మీకు మరింత దగ్గరగా వస్తుండటం, మిమ్మల్ని శృంగారానికి సిద్ధం అవ్వమని హింట్ ఇవ్వడం చేస్తాడు.

ఒకే మాట మళ్ళీ మళ్ళీ చెబుతుండటం

నువ్వు చాలా అందంగా ఉన్నావ్, నీకు ఈ డ్రస్ బాగుంది, నువ్వు ఈ రోజు చేసిన చాలా అద్భుతంగా ఉంది, చెప్పు నీకు ఏం కావాలి బుజ్జి, బంగారం అంటూ చెప్పిన మాటలనే ఒకటికి రెండుసార్లు మళ్ళీ మళ్ళీ చెబుతుంటాడు. అందుకని ఆయనను ఇబ్బంది పెట్టకుండా అర్థం చేసుకోవాలి.

పాత విషయాలు గుర్తుకు చేయడం

ముద్దుగా మిమ్మల్ని పిలుస్తూ మన మొదటి రోజు గుర్తుందా నీకు, ఆ రోజు చాలా ఎంజాయ్ చేశాం కదా.. ఈ రోజు కూడా అలా చేద్దామా, నువ్వు నా పక్కన ఉంటే నాకు ఎంతో ఆనందంగా ఉంటుందని మనసులో మీపై ఉన్న ప్రేమను తెలుపుతుంటారు. భర్త భార్యతో శృంగారం గురించి చెప్పే గుర్తులు ఇవే..

ఈ ఆర్టికల్ అందరికీ ఉపయోగపడుతుంది అని మీకు అనిపిస్తే వెంటనే LIKE చేయండి SHARE చేయండి.  మరిన్ని విషయాలు తెలుసుకోవాలన్నా, ఈ ఆర్టికల్ పై మీరు COMMENT చేయవచ్చు.

ఇవి కూడా చదవండి.

ప్రెగ్నన్సీ సమయంలో తమ సెక్స్ జీవితం గురించి మాతో పంచుకున్న 6 గురు మహిళలు

Click here for the best in baby advice
What do you think?
0%
Wow!
0%
Like
0%
Not bad
0%
What?
scroll up icon