Link copied!
Sign in / Sign up
63
Shares

మగవాళ్ళు ఈ 4 పనులు చేస్తే మహిళలు మళ్ళీ మళ్ళీ ప్రేమలో పడతారు ❤️❤️

భర్త మన కోసం ఏ చిన్న పని చేసినా చాలా సంతోషంగా అనిపిస్తుంది. అలాంటిది మనతో ఉంటూ  మన పనుల్లో సహాయం చేస్తే, మన ఆనందానికి అవధులు  ఉండవు. ముఖ్యంగా పిల్లలను పెంచడంలో సహాయం చేస్తే మన భర్తతో రోజు ప్రేమలో పాడుతాం, ప్రతి నిమిషము ప్రేమలో ఉంటాం. ఇప్పుడు అలాంటి   5 సందర్భాలు ఏమిటో చూద్దాం.

1. పిల్లల డైపర్ మార్చినప్పుడు

మీ భర్తను పిల్లల డైపర్ మారుస్తు౦డగా చుస్తే మీకు ప్రేమ కలగదా? మీకు జ్వరం వచ్చి పడుకోనున్నారు. బాబు ఏడవడం మొదలు పెట్టాడు. మీ పారిస్టితి తెలుసుకొని బాబు డైపర్ తడవడం వల్ల ఏడుస్తున్నాడు అని కనుక్కొని, డైపర్ మార్చాడు మీ భర్త. అది కనుక మీరు చూస్తె కచ్చితంగా తన మీద ప్రేమ రెట్టిపవుతుంది.

2. చిన్న పిల్లాడిలా మీ పిల్లలతో ఆడుతూ ఉన్నప్పుడు

పిల్లలను వీపు మీద ఎక్కించుకొని ఆడిస్తున్న మీ భర్తను చూస్తె మీరు పొందే ఆనందం అంతా ఇంతా కాదు. తను అప్పుడే అలసిపోయి ఇంటికి వచ్చాడు , కాని ఏడుస్తున్న పిల్లాడిని సముదాయించడానికి తను చిన్న పిల్లాడిలా మారాడు అనుకోండి, మీ కన్నా అదృష్టవంతురాలు ఎవరూ ఉండరు. నమ్మండి, మీ భర్త చాలా గొప్పవారు.

3. అర్ధరాత్రి ఏడుస్తున్న బుజ్జయికి లాల పాడటం

మీరు ఎట్టకేలకు నిద్రలోకి జారుకుంటున్నారు. అప్పుడు మీ పాప ఏడవడం మొదలెడుతుంది. నీరసంగా మీ పాపను మీరు ఎత్తుకోబోతుంటే మీ భర్త వచ్చి పాపను లాలించాడు. పాపను నిద్రపుచ్చాడు. వినడానికి ఎంత బాగుంది కదా! అలా మీ భర్త నిజంగా చేస్తుండగా మీరు చూస్తె కచ్చితంగా తన మీద గౌరవం ప్రేమ రెండూ పెరుగుతాయి.

4. మీ కోసం తన పనులన్నీ వదులుకున్నపుడు

ఆఫీస్ మీటింగ్స్, ఫ్రెండ్స్ పెళ్ళిళ్ళు ఇలా ఏదో ఒక ముఖ్యమైన పని పడ్డప్పుడు. పిల్లల్ని వదిలిపెట్టి వెళ్లడం ఇష్టం లేక అవన్నీ మనుకుంటారు. అలాంటి పరిస్థితుల్లో మీ భర్త “నేనున్నానంటూ..” ముందుకొచ్చి , మీకోసం తన పనులన్నీ మానుకొని ఇంట్లో వుండి పిల్లలను చుసుకుంటే. మీ భర్త మీద ప్రేమ వేయి రెట్లు పెరిగిపోతుంది. ఎక్కడికి వెళ్లినా మదిలో మీ ఆయనే మెదులుతూవుంటాడు.

5. చిన్న భరోసా ఇచ్చినప్పుడు

మనం చాలా పనులు అనుకోని ఏవో కారణాల వలన చేయలేకపోతాం. నిరాశ చెందుతాం,  నమ్మకాన్ని కోల్పోతాం, ఎంత కోరిక వున్నా ఆ పని చేయడం మానుకుంటాం. అలాంటప్పుడు “నువ్వు చేయగలవు" అని మీ భర్త ఇచ్చే చిన్న భరోసా మీకు చాలా శక్తినిస్తుంది.  ఆ పనిని తిరిగి ప్రారంభించి పూర్తి చేస్తారు. అతను మీకిచ్చే ఈ ప్రోత్సాహం, తనతో మళ్ళి ప్రేమలో పడేలా చేస్తుంది.

Tinystep Baby-Safe Natural Toxin-Free Floor Cleaner

Dear Mommy,

We hope you enjoyed reading our article. Thank you for your continued love, support and trust in Tinystep. If you are new here, welcome to Tinystep!

Recently, we launched a baby-safe, natural and toxin-free floor cleaner. Recommended by moms and doctors all over India, this floor-cleaner liquid gets rid of germs and stains without adding harmful toxins to the floor. Click here to buy it and let us know if you liked it.

Stay tuned for our future product launches - we plan to launch a range of homecare products that will keep your little explorer healthy, safe and happy!

Click here for the best in baby advice
What do you think?
0%
Wow!
0%
Like
0%
Not bad
0%
What?
scroll up icon